STOCKS

News


ట్రేడింగ్‌ వేళల పొడిగింపు వాయిదా..!?

Tuesday 18th September 2018
Markets_main1537260689.png-20355

మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ అక్టోబర్‌ 1నుంచి దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ సమయాన్ని పొడిగించే అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం 9:00 నుంచి రాత్రి 11.55 గంటల వరకూ ట్రేడింగ్‌ నిర్వహించే అంశంపై స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లు, బ్రోకర్లలు ఏకాభిప్రాయానికి రాలేకపోవడం సెబీ వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతంలో ఈక్విటీ డెరివేటివ్స్‌ విభాగంలో ఉదయం 9:00 నుంచి రాత్రి 11.55 గంటల వరకూ ట్రేడింగ్‌ నిర్వహించేందుకు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు అనుమతిసున్నట్లు సెబీ ఓ ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి వరకు ట్రేడింగ్ సమయాన్ని పొడిగించడంతో దేశీయ మార్కెట్లను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించవచ్చని ఎక్చ్సేంజ్‌లు భావిస్తున్నాయి. అయితే అర్ధరాత్రి వరకు ట్రేడింగ్ సమయాన్ని పొడిగించడాన్ని బ్రోకర్లు వ్యతిరేకిస్తున్నారు. సాధారణ సమయాలకు మించి ట్రేడింగ్ సమయాన్ని పెంచితే తమ నిర్వహణా వ్యయాలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే లావాదేవీలు కూడా పరిమితంగానే జరిగే అవకాశం వుందని బ్రోకర్లు భావిస్తున్నారు.



You may be interested

11300 దిగువన నిఫ్టీ ముగింపు

Tuesday 18th September 2018

మార్కెట్‌ పతనం మంగళవారమూ కొనసాగింది. బ్యాంకింగ్‌, ఆర్థిక, అటో, మెటల్‌ రంగ షేర్లలో చివరి గంటలో మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు వరుసగా రెండోరోజూ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా కేంద్రం మరో మూడు ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనానికి తెరతీయడంతో బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్ల క్షీణత నేటి మార్కెట్‌ను నష్టాల బాట పట్టించింది. అంతర్జాతీయ మార్కెట్లో తొలగని వాణిజ్య యుద్ధ భయాలు, మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు, రూపాయి క్షీణత

ఫార్మా, ఐటీ షేర్ల కొనుగోళ్లకు మ్యూచువల్‌ ఫండ్స్‌ మొగ్గు

Tuesday 18th September 2018

ముంబై:- డాలర్‌ మారకంలో రూపాయి క్షీణత కారణంగా మ్యూచువల్‌ ఫండ్‌ హౌస్‌లు ఐటీ, ఫార్మా రంగ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నాయి. ఆగస్ట్‌లో పలు మ్యూచువల్‌ ఫండ్స్‌లు ఎగుమతులపై ఆదారపడే ఐటీ, ఫార్మా రంగ షేర్లలో తమ వాటాలను పెంచుకున్నట్లు ఫించ్‌ రేటింగ్‌ గణాంకాలు చెబుతున్నాయి. ఐసీఐసీఐ ప్రిడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌:- ఫార్మారంగంలో లుపిన్‌షేర్లను 35లక్షలు, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్‌ షేర్లను 4.5లక్షలు కొనుగోలు చేసింది. ఇక ఐటీ విభాగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న టీసీఎస్‌కు చెందిన 6.2లక్షల

Most from this category