STOCKS

News


మోతీలాల్‌, ఇండియా ఇన్ఫోలైన్‌లకు సెబీ షాక్‌

Saturday 23rd February 2019
Markets_main1550917691.png-24299

సెక్యూరిటీ అండ్‌ ఎక్చ్సేంజీ బోర్డు ఆఫ్‌ ఇండియా(సెబీ) ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలైన మోతీలాల్‌ ఓస్వాల్‌, ఇండియా ఇన్ఫోలైన్‌(ఐఐఎఫ్‌ఎల్‌)లకు షాక్‌నిచ్చింది. ఈ రెండు సంస్థలకు చెందిన కమోడిటీ విభాగాలకు డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ చేసే అర్హత లేదని వెల్లడించింది. రూ.5,600 కోట్ల ఎన్‌ఎస్‌ఈఎల్‌ కేసు దర్యాప్తులో భాగంగా సెబీ ఈ విషయాన్ని తెలిపింది. ఎన్‌ఎస్‌ఈఎల్‌కు చెందిన మోసపూరిత కాంట్రాక్టుల విక్రయాలకు ఆ రెండు సంస్థలు ఉద్దేశపూర్వకంగా సహకరించాయి. ‘ఫిట్‌ అండ్‌ ప్రాపర్‌’ విధానంలో నమ్మకం చాలా ముఖ్యమైంది. ఈ రెండు సంస్థలు వాటిని కోల్పోయాయి.’’ అని సెబీ అధికారి ఒకరు తెలిపారు. అలాగే ఈ రెండు సంస్థలకు చెందిన కమోడిటీ డెరివేటీవ్స్‌ ట్రేడింగ్‌ వినియోగదారులకు కూడా సెబీ సూచనలు ఇచ్చింది. వినియోగదారులంతా 45రోజుల్లోపు తమ సెక్యూరిటీలను 45రోజుల్లోపు వేరే బ్రోకింగ్‌ సంస్థలకు మార్పించుకోవాలని సూచించింది. ఎన్‌ఎస్‌ఈఎల్‌ కేసులో దాదాపు 300 బ్రోకరేజి సంస్థలను విచారించిన సెబీ ఈ రెండు సంస్థల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. మరో ఐదు బ్రోకరేజి సంస్థలకు నోటీసులు జారీ చేసింది.



You may be interested

ఈ నాలుగు షేర్లలో రిస్క్‌ పరిమితం

Saturday 23rd February 2019

లోక్‌సభ ఎన్నికల కారణంగా వచ్చే రెండు, మూడు నెలల్లో మార్కెట్‌ ఒడుదుడుకులకు లోనవుతుందని, ఈ సమయంలో నాలుగు షేర్లలో మాత్రం రిస్క్‌ పరిమితంగా వుంటుందని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ ఈక్విటీస్‌ హెడ్‌ రాజేష్‌ శ్రీవాత్సవ అభిప్రాయపడ్డారు. అవి...హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్, టైటాన్‌ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు. ఈ నాణ్యమైన షేర్లలో ఇన్వెస్ట్‌ చేయమని తమ క్టయింట్లకు సిఫార్సుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒడుదుడుకుల మార్కెట్లో కాస్త అధిక రిస్క్‌ తీసుకోదల్చినవారు

స్వల్పంగా పెరిగిన పసిడి

Saturday 23rd February 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం లాభపడింది. గతరాత్రి అమెరికాలో ఔన్స్‌ పసిడి ధర 5డాలర్లు పెరిగి 1,332.80 డాలర్ల వద్ద ముగిసింది.  వరుసగా రెండోవారం లాభాల ముగింపు కావడం విశేషం. డాలర్‌ ఇండెక్స్‌ తగ్గుదల, ట్రేడ్‌ చర్చల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత పసిడికి తోడ్పాటును అందిస్తున్నాయి.  వడ్డీరేట్లపై ఫెడ్‌రిజర్వ్‌ సానుకూల ధోరణి.. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌  ర్యాలీకి అవరోధాన్ని కలిస్తుంది. ఈ వారంలో డాలరు ఇండెక్స్‌ నెలరోజుల కనిష్టానికి

Most from this category