STOCKS

News


ఏడాది గరిష్టానికి ఎస్‌బీఐ

Thursday 28th March 2019
Markets_main1553767113.png-24850

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ షేరు గురువారం ట్రేడింగ్‌లో 52-వారాల గరిష్టాన్ని తాకింది. నేడు ఎస్‌బీఐ షేరు రూ. 310.10ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడే  ప్రభుత్వ రంగ బ్యాంకుల ర్యాలీలో భాగంగా షేరు 3.75శాతం లాభపడి రూ. 319.50ల స్థాయిని తాకింది. ఇది షేరు ఏడాది గరిష్టస్థాయి కావడం విశేషం. మధ్యాహ్నం గం.3:00లకు షేరు గత ముగింపు (రూ.308.05)తో పోలిస్తే 3.50శాతం లాభంతో రూ.318.95ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట గరిష్ట ధరలు వరుసగా రూ. 232.00 రూ.325.85లుగా నమోదయ్యాయి. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ-50 సూచీలోని టాప్‌ గెయినర్లలో 5వ స్థానంలో కొనసాగుతుంది.



You may be interested

6నెలల గరిష్టం వద్ద ముగింపు

Thursday 28th March 2019

ఐటీ, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్ల ర్యాలీతో గురువారం దేశీయ మార్కెట్‌ భారీగా లాభపడింది. మార్చి డెరివేటివ్‌ సిరీస్‌ చివరిరోజు ట్రేడర్లు సైతం కొత్త పొజిషన్లు తీసుకునేందుకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా లాభాలను ఆర్జించగా నిఫ్టీ 11550పైన ముగిసింది. ఆర్థిక వృద్ధికి మరింత ఊతం ఇచ్చేందుకు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా వచ్చేవారంలో జరగనున్న సమీక్షా సమావేశంలో వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. అంతర్జాతీయ

ఎంఅండ్‌ఎం వాహనాల ధరల పెంపు

Thursday 28th March 2019

వచ్చే నెల నుంచి తమ పాసెంజర్‌, వాణిజ్య వాహనాల ధరలను రూ.5వేల నుంచి రూ. 7వేల వరకు పెంచుతున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రకటించింది. ఉత్పాదక వ్యయాల పెరుగుదలను తట్టుకునేందుకు ధరలను పెంచాల్సివచ్చిందని వివరించింది. తాజా పెంపుతో తమ వాహనాల ధరలు 0.5 నుంచి 2.7 శాతం మేర పెరగవచ్చని తెలిపింది. ఈ ఏడాది కమోడిటీ ధరలు రికార్డు గరిష్ఠాలకు చేరాయని కంపెనీ తెలిపింది. దీనికితోడు వచ్చే నెల ఒకటి

Most from this category