STOCKS

News


వచ్చే 3-4 వారాల్లో లాభాలనిచ్చే పది షేర్లివే..!

Monday 15th October 2018
Markets_main1539593248.png-21168

ఆసియా మార్కెట్ల నుంచి అందుతున్న ప్రతికూల పవనాలతో దేశీయమార్కెట్‌ సోమవారం నష్టాల బాట పట్టింది. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత కూడా ఇందుకు కారణమవుతోంది. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచి రాబడులు ఇచ్చే పది నాణ్యమైన స్టాకులను ప్రముఖ ఇన్వెస్టర్స్ రికమండ్‌ చేస్తున్నారు.

వోల్టాస్‌:- టార్గెట్‌ ధర:- రూ.560, స్టాప్‌ లాస్:- రూ.480. ఈ షేరు ఇటీవల రూ.636 వద్ద కరెక‌్షన్‌కు లోనై రూ. 475 వద్ద మద్దతు పొందింది. తాజాగా షేరులో అప్‌సైడ్‌ సంకేతాలు వస్తున్నాయి. 
మహీంద్రా అండ్‌ మహీంద్రా:- టార్గెట్‌ ధర:- రూ.840.స్టాప్‌లాస్‌:- రూ.715.  షేరు గత నెలరోజుల్లో గరిష్టస్థాయి రూ.976 నుంచి రూ.715-720 స్థాయిల వరకు కరెక్షన్‌కు గురైంది. ప్రస్తుతం, వీక్లీ ఛార్ట్‌లో బుల్లిష్‌ క్యాండిల్‌ ఫార్మేషన్‌ ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో షేరు అప్‌ట్రెండ్‌ మూవెంట్‌ను కొనసాగిస్తుందని  ఈ ఫార్మారేషన్‌ తెలుపుంది. 
పవర్‌ గ్రిడ్‌:- టార్గెట్‌ ధర:- రూ.205. స్టాప్‌లాస్‌:- రూ.180.  షేరు గతవారం ముగింపులో త్రీ వేవ్స్‌ పతనం పూర్తి చేసుకుంది. స్వల్పకాలకంలో షేరు ర్యాలీ సిద్ధమైందనే విషయాన్ని చార్టులు స్పష్టం చేస్తున్నాయి. 
ఐటీసీ:- టార్గెట్‌ ధర:- రూ.290. స్టాప్‌ లాస్:- రూ.257 . సెప్టెంబర్‌లో రూ. 320 నుంచి అధోముఖ పయనం ఆరంభించింది. రూ. 260 రేంజ్‌లో గట్టి మద్దతు పొందుతోంది.
ఐఆర్‌బీ ఇన్ఫ్రాస్టక్చర్స్‌ డెవెలర్స్‌:- టార్గెట్‌ ధర:- రూ.146.స్టాప్‌ లాస్‌:- రూ.128.  షేరు గతవారం ముగింపులో ఫైవ్‌ వేవ్స్‌ ఫాల్స్‌ను పూర్తి చేసుకుంది. ఇది స్వల్పకాలకంలో షేరు ర్యాలీ సిద్ధమైందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. 
బజాజ్‌ ఫైనాన్స్‌:- టార్గెట్‌ ధర:- రూ.2420. స్టాప్‌ లాస్‌:- రూ.2180. - ప్రస్తుతం షేరు చార్టుల్లో బుల్లిష్‌ ధోరణి కనిపిస్తోంది.
మణప్పురం ఫైనాన్స్‌:- టార్గెట్‌ ధర:- రూ.83 . స్టాప్‌ లాస్‌:- రూ.69.  షేరు విలోమ హెడ్‌ అండ్‌ షోల్డర్‌ ప్యాట్రన్‌ నమోదు చేసింది. పాట్రన్‌లో కదలికలు  షేరులో కొనుగోళ్ల ఆసక్తిని సూచిస్తున్నాయి. 
కమ్మిన్స్‌ ఇండియా:- టార్గెట్‌ ధర:- రూ.727. స్టాప్‌ లాస్‌: 657 . వీక్లీ ఛార్టులో షార్ట్‌టర్మ్‌ బాటమ్‌ రూ.642 స్థాయిని అధిగమించింది. 
ఐసీఐసీఐ బ్యాంక్‌:- టార్గెట్‌ ధర రూ:- 350.  స్టాప్‌ లాస్‌:- రూ.300.  షేరు గత వీక్లీ ఛార్ట్‌లో డోజీ క్యాండిల్‌ ప్యాట్రన్‌ను నమోదు చేసింది. ఇది షేరు బుల్లిష్‌నెస్‌ను సూచిస్తుంది.



You may be interested

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లాభం @ 920 కోట్లు

Monday 15th October 2018

ప్రైవేట్‌ రంగ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన బ్యాంక్‌ నికర లాభం 5 శాతం వృద్ధితో రూ.920 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో బ్యాంక్‌ నికర లాభం రూ.880 కోట్లు. కాగా మార్కెట్‌ నిపుణులు బ్యాంక్‌ నికర లాభం రూ.1,091 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. అధిక కేటాయింపుల వల్ల

యూనిట్‌ విక్రయంతో రెడ్డీస్‌ షేరు 4% అప్‌

Monday 15th October 2018

డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ షేరు సోమవారం దాదాపు 4 శాతంమేర పెరిగింది. కంపెనీ తనకు హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఉన్న ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌) మ్యానుఫ్యాక్చరింగ్‌ బిజినెస్‌ యూనిట్‌ను విక్రయించడం ఇందుకు ప్రధాన కారణం. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఈ ఏపీఐ యూనిట్‌ను మొత్తంగా జనరిక్స్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ థెరాపివాకు విక్రయించింది. ఈ వార్త నేపథ్యంలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ షేరు ధర 4 శాతంమేర ర్యాలీ చేసింది. కాగా

Most from this category