STOCKS

News


పునరుద్ధణకు సిద్ధమైన ఎస్‌బీఐ..!

Thursday 1st November 2018
Markets_main1541068091.png-21641

- టార్గెట్‌ ధర రూ.365

ముంబై: దేశీ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) పునరుద్ధణకు సిద్దమైందని డాయిష్ బ్యాంక్ విశ్లేషించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ద్రవ్యలభ్యత కట్టడిలో అత్యధిక ప్రయోజనం పొందనున్నది ఈ బ్యాంకేనని అంచనాను వెల్లడించింది. అనుబంధ సంస్థల విలీనాల అనంతరం సవాళ్లను ఎదుర్కొంటున్న బ్యాంకులో 2019-20 నుంచి ఎర్నింగ్స్‌ వృద్ధిరేటు నమోదుకానుందని పేర్కొంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎస్‌బీఐ షేరు ధర 8 శాతం పతనమైంది. అత్యధిక కాలం క్రెడిట్‌ గ్రోత్‌ నెమ్మదించడం, అర్థిక వృద్ధి మందకోడిగా ఉండడం, నిరర్థక ఆస్తులు, విలీనాల అంశాల కారణంగా అండర్‌పెర్ఫార్మర్‌గా కొనసాగుతోందని జర్మన్‌ సంస్థ విశ్లేషించింది. అయితే, ఈ సవాళ్లను దాదాపుగా బ్యాంక్‌ అధిగమించినట్లేనని అంచనావేసింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం), ఆర్‌ఓఏ, ఆర్‌ఓఈ మెరుగుపడుతుండడం వంటి సానుకూల అంశాల ఆధారంగా షేరు టార్గెట్‌ ధరను రూ.365 వద్ద నిర్ణయించినట్లు తెలిపింది. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) వద్ద ఉన్న జాబితాలో అతిపెద్ద రుణదాతగా ఉన్న ఈ బ్యాంక్‌.. ఒక్కసారి పరిష్కారం వేగవంతమైతే అత్యంత ఎక్కువ ప్రయోజనాన్ని పొందనున్నట్లు భావిస్తోంది. 



You may be interested

‘ఎల్‌ అండ్‌ టీ’ టార్గెట్‌ ధర రూ.1,880

Thursday 1st November 2018

దేశీ ఇంజనీరింగ్‌, నిర్మాణ రంగ దిగ్గజం లార్సన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌ అండ్‌ టీ) షేరుకు పలు బ్రోకింగ్‌ సంస్థలు అవుట్‌పెర్ఫార్మర్‌ రేటింగ్‌ను ఇచ్చాయి. ప్రస్తుత ఏడాది జూలై–సెప్టెంబర్‌ (క్యూ2) ఆర్థిక ఫలితాల వెల్లడి అనంతరం ఈ కంపెనీ షేరు రేటింగ్స్‌ను అత్యధిక శాతం బ్రోకరేజ్‌లు సవరించాయి. కంపెనీ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన 28 శాతం వృద్ధి చెందండం ఆధారంగా సీఎల్‌ఎస్‌ఏ ఈ షేరుకు బై రేటింగ్‌ ఇచ్చింది.

స్వల్ప నష్టంతో ముగింపు

Thursday 1st November 2018

10400 దిగువకు నిఫ్టీ ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్‌ సూచీలు ప్రారంభ లాభాలను నిలుపులేకపోవడంతో మార్కెట్‌ గురువారం స్వల్ప నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ 10 పాయింట్లు కోల్పోయి 34,432 వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల నష్టపోయి10,380 వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌లోని మరో కీలకమైన సూచీ నిఫ్టీ బ్యాంక్‌ 155పాయింట్లు పెరిగి 25,323.6 వద్ద ముగిసింది.  మెటల్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లు ర్యాలీ చేయగా, ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంజీసీ, అటో రంగాలకు చెందిన సూచీలు

Most from this category