STOCKS

News


ఎస్‌బీఐ ర్యాలీ..కారణమిదే!!

Thursday 13th December 2018
Markets_main1544684235.png-22893

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) షేరు గురువారం మార్నింగ్‌ సెషన్‌లో 3 శాతం మేర ర్యాలీ చేసింది. ప్రముఖ గ్లోబల్‌ రీసెర్చ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ.. ఎస్‌బీఐ టార్గెట్‌ ప్రైస్‌ను రూ.350 నుంచి రూ.375కి పెంచడం షేరు ధరపై సానుకూల ప్రభావం చూపింది. అలాగే మోర్గాన్‌ స్టాన్లీ.. ఎస్‌బీఐపై ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ను కొనసాగించింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో బ్యాంక్‌ మొండి బకాయిల కేటాయింపులు బాగా తగ్గుతాయని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేస్తోంది. అలాగే 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌పీఏలకు సంబంధించి టర్న్‌అరౌండ్‌ ఉంటుందని పేర్కొంది. మొండి బకాయిల కారణంగా ఎస్‌బీఐ గత ఆర్థిక సంవత్సరం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో భారీ నష్టాలను ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి టర్న్‌అరౌండ్‌ ఉంటుందని పేర్కొంది. ప్రస్తుత క్యూ2లో ఎస్‌బీఐ మొండి బకాయిల కేటాయింపులు రూ.10,184 కోట్లకు తగ్గాయని గుర్తు చేసింది. కేటాయింపుల్లో వార్షికంగా 39 శాతం, త్రైమాసికం పరంగా 22 శాతం తగ్గుదల నమోదయ్యిందని పేర్కొంది. తక్కువ కేటాయింపుల వల్ల బ్యాంక్‌ రూ.944 కోట్ల నికర లాభాన్ని సాధించిందని తెలిపింది. రానున్న కాలంలో బ్యాంక్‌ ఎర్నింగ్స్‌ కూడా పెరుగుతాయని అంచనా వేసింది. బ్యాంక్‌ నికర లాభం 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.30,000 కోట్లకు పైగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.37,000 కోట్లకుపైగా నమోదు కావొచ్చని విశ్వాసం వ్యక్తం చేసింది. 

కాగా మోర్గాన్‌ స్టాన్లీ .. ఎస్‌బీఐ టార్గెట్‌ ప్రైస్‌ను పెంచిన  నేపథ్యంలో ఉదయం 10:35 సమయంలో బీఎస్‌ఈలో స్టాక్‌ ధర 2.49 శాతం లాభంతో రూ.292 వద్ద ట్రేడయ్యింది. 



You may be interested

వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో...

Thursday 13th December 2018

బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ రిజర్వ్‌ బ్యాంక్‌ కొత్త గవర్నర్‌ శక్తికాంత్‌ వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలతో గురువారం బ్యాంకింగ్‌ రంగ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. ఈ నవంబవర్‌లో సీపీఐ ద్రవ్యోల్బణం 2.33శాతం, ప్రతి ద్రవ్యోల్బణం 5.73శాతం నమోదైంది. అలాగే ఏప్రిల్‌ పాలసీ సమావేశంలో పావుశాతానికి మించి వడ్డీరేట్ల పెంపు ఉండకపోవచ్చు. కొత్త గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ రాక నిధుల కొరతతో కొట్టిమిట్టాడుతున్న బ్యాంకులకు మూలధన సాయంపై కూడా ఆశలు చిగురింపజేసిందని మార్కెట్‌ విశ్లేషకలంటున్నారు. పీఎస్‌యూ

టాటా కార్లు ప్రియం!!

Thursday 13th December 2018

జనవరి 1 నుంచి రూ.40,000 వరకు పెంపు  ప్రముఖ దేశీ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్‌ తాజాగా ప్యాసింజర్‌ వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెంపు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. మోడల్‌ ప్రాతిపదికన ధరల పెంపు రూ.40,000 వరకు ఉండొచ్చని తెలిపింది. ఉత్పత్తి వ్యయాల పెరుగుదల సహా పలు ఇతర అంశాల కారణంగా వాహన ధరలను పెంచాల్సి వస్తోందని టాటా మోటార్స్‌ ప్రెసిడెంట్‌​(ప్యాసింజర్‌ వాహన

Most from this category