STOCKS

News


పీఎస్‌యూ బ్యాంకింగ్‌ అప్‌

Tuesday 11th September 2018
Markets_main1536652388.png-20166

  • ఎస్‌బీఐ 2.50శాతం ర్యాలీ 

ముంబై:- ఒడిదుడుకుల మార్కెట్‌ ట్రేడింగ్‌లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ సూచీలకు అండగా నిలుస్తోంది. క్రితం ట్రేడింగ్‌లో భారీగా పతనమైన షేర్ల చౌక ధరలకు లభిస్తుండంతో ఈ రంగ షేర్లలో కొనుగోళ్లు జరుపుతున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగషేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్‌ 2శాతం‍ లాభపడింది. ఈ సూచీలోని మొత్తం 12 షేర్లకు గానూ 11 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, బ్యాంకు ఆఫ్‌ బరోడా షేరు మాత్రం 1శాతం నష్టంతో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా అలహాదాబాద్‌ షేరు 4శాతం వరకు లాభపడగా, ఆంధ్రాబ్యాంకు, స్టేట్‌బ్యాంకుఆఫ్‌ ఇండియా, పంజాజ్‌నేషనల్‌బ్యాంక్‌ షేర్లు 3నుంచి 2శాతం పెరిగాయి. ఇండియన్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంక్‌ షేర్లు సిండికేట్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు షేర్లు 1నుంచి అరశాతం నష్టపోయాయి. మధ్యాహ్నం గం.12:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు 3,068తో పోలిస్తే 1.65శాతం లాభంతో 3,119 వద్ద ట్రేడ్‌ అవుతోంది.
ఎస్‌బీఐ 2.50శాతం అప్‌:-
ప్రభుత్వరంగబ్యాంకు దిగ్గజం స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) షేరు ఇంట్రాడేలో 2.50శాతం లాభపడింది. నేడు ఎస్‌బీఐ షేరు ఎన్‌ఎస్‌ఈలో రూ.287.35ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఎస్‌బీఐ రూ.3,948కోట్ల విలువైన  8 ఎన్‌సీఏ అకౌంట్లను బ్యాంక్ ఆస్తుల పున‌ర్నిర్మాణ‌ సంస్థలు(ఏఆర్‌సీ), ఎన్‌బీఎఫ్‌సీలకు విక్రయించేందుకు సిద్ధమైందన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా షేరు 2.50శాతం పెరిగి రూ.291.20ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12:45ని.లకు షేరు గత ముగింపు రూ.284.85తో పోలిస్తే 2శాతం లాభంతో రూ.290ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమాయానికి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 సూచీలోని టాప్‌-5 గెయినర్లలో రెండు స్థానంలో కొనసాగుతోంది.



You may be interested

ఏడాది కనిష్టానికి జేపీ అసోసియేట్స్‌..!

Tuesday 11th September 2018

ముంబై:- జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్‌ షేరు మంగళవారం ట్రేడింగ్‌లో ఏడాది కనిష్టానికి పతనయ్యాయి. నేడు ఈ షేరు బీఎస్‌ఈలో రూ.10.55ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. జేపీ అసోసియేట్స్‌ కంపెనీ తమకు చెల్లించాల్సిన రూ.1500 కోట్ల రుణ చెల్లింపులో విఫలమైనందున కంపెనీపై దివాళా ప్రక్రియ భాగంగా చర్యలు తీసుకోవాలని ఐసీఐసీఐ బ్యాంకు ఎన్‌సీఎల్‌టీకు పిటిషన్‌ దాఖలు తీసింది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ఎన్‌సీఎల్‌టీసీ సెప్టెంబర్‌ 17లోగా ఈ అంశంపై స్పందిచాలని జేపీ

ఐటీకి ‘అప్‌గ్రేడ్‌’ అవ్వొచ్చా?

Tuesday 11th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో ఇతర రంగాలకన్నా ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగం ఉత్తమమైన పనితీరు కనబరుస్తోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.67 రికార్డ్‌ స్థాయికి పతనం కావడం బాగా కలిసొచ్చింది. గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ మెక్వైరీ.. రూపాయి పతనం వల్ల ఐటీ వృద్ధి పుంజుకోవచ్చని అంచనా వేస్తోంది. పరిశ్రమలోని ట్రెండ్స్‌ కూడా వృద్ధి వేగాన్ని సూచిస్తున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మెక్వైరీ పలు కంపెనీల రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది.

Most from this category