STOCKS

News


2019 ఈక్విటీనామ సంవత్సరం!!

Thursday 29th November 2018
Markets_main1543477326.png-22483

  • మెటల్స్‌ మెరవొచ్చు..
  • ఐఐఎఫ్‌ఎల్‌ సంజీవ్‌ భాసిన్‌ అంచనా

ఈక్విటీ మార్కెట్‌పై ఏడాది కాల లక్ష్యంతో చాలా బుల్లిష్‌గా ఉన్నానని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెట్స్‌ అండ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్‌) సంజీవ్‌ భాసిన్‌ తెలిపారు. ఈక్విటీలు 2019లో మంచి పనితీరు కనబరుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయలు వెల్లడించారు. ఎన్నికల కారణంగా కొంత కాలం ఒడిదుడుకులు ఉంటాయని తెలిపారు. 
నెల కిందట అక్టోబర్‌ 29న నిఫ్టీ 10,020 మార్క్‌ స్థాయికి పడిపోయిందని, అప్పుడు అందరూ 9,500 స్థాయి గురించి మాట్లాడారని సంజీవ్‌ భాసిన్‌ గుర్తు చేశారు. భయాన్ని సొమ్ము చేసుకుంటే లాభాలొస్తాయని తెలిపారు. అందుకే భయం కారణంగా మార్కెట్‌ పడిపోయినప్పుడు కొనుగోలు చేస్తే మంచి ప్రయోజనం పొందొచ్చన్నారు. దేశీ ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్‌కు వెన్నుముక్కలా నిలుచున్నారని తెలిపారు. ఆయిల్‌ ధరలు తగ్గడం, రూపాయి రికవరీ వంటివి సానుకూల అంశాలని పేర్కొన్నారు. అందువల్ల 2019లో ఈక్విటీలు మంచి పనితీరు కనబరుస్తాయని తెలిపారు. 
టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ, హిందాల్కో, వేదాంత స్టాక్స్‌లో మంచి విలువకు ఛాన్స్‌ ఉందని సంజీవ్‌ భాసిన్‌ పేర్కొన్నారు. డాలర్‌ బలహీనపడితే.. చైనా మార్కెట్‌లో స్థిరత్వం చోటుచేసుకుంటుందని తెలిపారు. 2019లో మెటల్స్‌ ఔట్‌పర్ఫార్మ్‌ కనబరుస్తాయని అంచనా వేశారు. మెటల్‌ ధరలు పెరగొచ్చని తెలిపారు. ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు విషయంలో మెతకగా వ్యవహరిస్తే.. అప్పుడు కంపెనీలు తక్కువ ఖర్చుకే మూలధనాన్ని సమకూర్చుకోవచ్చని, అప్పుడు అవి మంచి పనితీరు కనబర్చవచ్చని పేర్కొన్నారు. టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ, హిందాల్కో, వేదాంత స్టాక్స్‌ తమ టాప్‌ పిక్స్‌ అని తెలిపారు. 
ఐటీ స్టాక్స్‌ విషయానికి వస్తే.. రూపాయి రికవరీ వీటికి ప్రతికూలమని సంజీవ్‌ భాసిన్‌ పేర్కొన్నారు. అయితే విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పుడు మళ్లీ ఇండియన్‌ మార్కెట్‌లలో ఇన్వెస్ట్‌ చేస్తున్నారని, ఈ మొత్తంలో కొంత భాగం ఐటీ బ్లూచిప్‌ స్టాక్స్‌లోకి వెళ్లొచ్చని తెలిపారు. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ ఇందులో ముందుంటాయని పేర్కొన్నారు. అయితే తాను మాత్రం మైండ్‌ట్రీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ స్టాక్స్‌పై బుల్లిష్‌గా ఉన్నానని పేర్కొన్నారు. 
రూ.75 వద్ద పీఎఫ్‌సీపై, రూ.100 వద్ద ఆర్‌ఈసీపై పాజిటివ్‌గా ఉన్నామని సంజీవ్‌ భాసిన్‌ తెలిపారు. ఇరు సంస్థల విలీన వార్తల నేపథ్యంలో ఆర్‌ఈసీ విషయంలో రూ.125 వద్ద ప్రాఫిట్‌ బుక్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యుత్‌ విభాగం మంచి పనితీరు కనబరుస్తోందని తెలిపారు. రూ.22 వద్ద అదానీ పవర్‌ స్టాక్‌ను కొనుగోలు చేయడానికి ఎవ్వరూ ఇష్టపడలేదని, ఇప్పుడు అది రెండేళ్ల గరిష్ట స్థాయిలో ట్రేడవుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం అయితే పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ స్టాక్స్‌కు దూరంగా ఉండటం మంచిదని తెలిపారు.You may be interested

హానర్‌ కొత్త ఫోన్‌.. ‘8సీ’

Thursday 29th November 2018

ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘హానర్‌’ తాజాగా ‘8సీ’ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.11,999 నుంచి ప్రారంభమౌతోంది. స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు డిసెంబర్‌ 10 నుంచి ప్రారంభమౌతాయి. ఇవి కేవలం అమెజాన్‌లో మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి. హానర్‌ 8సీ లోని ప్రత్యేకతలను గమనిస్తే..  ► 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ► క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 632 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ (ప్రపంచంలోనే ఈ ప్రాసెసర్‌తో వస్తోన్న తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదే) ► 13 ఎంపీ+

మెటల్‌ షేర్ల తళుకులు

Thursday 29th November 2018

హిందాల్కో, వేదాంత షేర్ల ర్యాలీతో గురువారం మెటల్‌ ఇండెక్స్‌ 2శాతం పెరిగింది. ఫెడ్‌ వడ్డీరేట్లపై పెంపుపై పావెల్‌ వాఖ్యలు  మెటల్‌ షేర్ల ర్యాలీకి కారణమని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఒకవేళ ఫెడ్‌రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచకపోతే.., రుణాల రేట్ల తగ్గుతాయి. తద్వారా వ్యయాలు తగ్గి వ్యవస్థలో మూలధన లభ్యత కలుగుతుంది. . ఈసారి వడ్డీరేట్ల పెంపుపై అంచనాలు సన్నగిల్లడంతో వ్యయాలు తగ్గవచ్చన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ ధరలు ర్యాలీ చేస్తున్నాయి. ఈ

Most from this category