STOCKS

News


సంవత్ 2075 ర్యాలీకి ఈ షేర్లు రెడీ..!

Thursday 8th November 2018
Markets_main1541662173.png-21789

ముంబై: దీపావళి సందర్భంగా పలు దిగ్గజ బ్రోకింగ్‌ సంస్థలు మరింత ర్యాలీ చేయడానికి సిద్ధంగా ఉన్న షేర్లను సిఫార్సు చేస్తున్నాయి. సంవత్ 2075(ఈ ఏడాది దీపావళి నుంచి వచ్చే ఏడాది దీపావళి మధ్య సమయం)లో ఇన్వస్టర్లు ఈ షేర్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి రాబడిని అందుకోవచ్చని ఆయా బ్రోకింగ్‌ సంస్థల అనలిస్టులు సూచిస్తున్నారు. ఈ జాబితాను ఒకసారి పరిశీలిస్తే..

డైమెన్షన్స్‌ కార్పొరేట్ ఫైనాన్స్ సర్వీసెస్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజయ్ శ్రీవాత్సవ టాప్‌ పిక్స్‌, మార్కెట్‌ అంచనా

  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ 

సంవత్ 2075 పూర్తి ఏడాది కాకుండా, కేవలం ఎన్నికల వరకు మాత్రమే తాను దృష్టిసారించినట్లు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీ ప్రధాన సూచీలపై ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ.. ఇక్కడి ఇన్వెస్టర్ల కొనుగోలు మద్దతు ఇప్పటివరకు సంతృప్తికరంగా ఉందన్నారు. వీరి పెట్టుబడులు ఇకమీదట కూడా ఇదే విధంగా కొనసాగుతాయా లేదా అనేది కీలక అంశంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో లార్జ్‌-క్యాప్‌ షేర్లను కొనుగోలు చేయడమే సరైన నిర్ణయంగా తాము భావిస్తున్నట్లు అజయ్ శ్రీవాత్సవ అన్నారు. మిడ్‌-క్యాప్‌ షేర్ల తాత్కాలిక ర్యాలీ వలలో చిక్కుకోవద్దని సూచించారు. 10-12 షేర్లతో కూడిన లార్జ్‌-క్యాప్‌ పోర్టిఫోలియోను నిర్వహించడం మంచిదన్నారు. వచ్చే తొమ్మిది నెలలపాటు ఆచితూచి వ్యహరించాల్సి ఉంటుందన్నారు. ఇక ఈయన సూచిస్తున్న రంగాల విషయానికి వస్తే.. (లిక్కర్‌) మద్యం, రవాణా, ట్రాక్టర్లు, గ్రామీణ ప్రాంతాలపై పట్టుకలిగిన సంస్థలు, గ్యాస్ రంగాల షేర్లను సూచించారు. 

స్టాక్‌యాక్సిస్‌ సీనియర్ టెక్నికల్‌ అనలిస్ట్‌ బ్రిజేష్ సింగ్ లార్జ్‌-క్యాప్‌ సిఫార్సులు

  • రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆర్‌బీఎల్ బ్యాంక్‌, డీసీబీ బ్యాంక్, బాటా, టెక్ మహీంద్రా, ఎన్ఐఐటీ

ఇండియా ఇన్ఫోలైన్‌ సినియర్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ హడ్రియన్ మెన్డోంకా టాప్‌ పిక్స్‌

  • రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్తి ఇండస్ట్రీస్

దీపావళి రోజున సూచీలు లాభాల్లో ప్రారంభమై.. ఈ ఏడాదిలో మంచి ఆరంభాన్ని నమోదుచేశాయి. మరి ఈ ర్యాలీ నిలబడుతుందా అనేది మాత్రం ప్రశ్నార్థకమే. ఇక ఇన్వెస్టర్లు మిడ్‌-క్యాప్‌ షేర్ల కంటే లార్జ్‌-క్యాప్‌ షేర్లను కొనుగోలు చేయడమే ఈ సమయంలో మంచిదనేది మా సలహా అని ఆయన వ్యాఖ్యానించారు.

డెఫినెడ్జ్‌ సొల్యూషన్స్ డైరెక్టర్‌ అభిజిత్ ఫాతక్‌ 
స్వల్పకాలానికి నిఫ్టీ ఇండెక్స్‌ కొనుగోలుచేయడం రిస్క్‌తో కూడుకున్నదని సూచించారు. రెండు షేర్లను సిఫార్సుచేశారు.

  • ఎల్‌టీ ఫుడ్స్‌, నాల్కో

ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ బిస్సా
నిఫ్టీ ట్రెండ్‌ పాజిటీవ్‌గానే ఉంది. అయితే, నల్లేరు మీద నడక మాత్రం కాదు అని వ్యాఖ్యానించారు. ఒక షేరును టాప్‌ పిక్‌గా చెప్పారు.

  • రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్

నిర్మల్‌ బాంగ్‌ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ బిజినెస్‌ సీఈఓ రాహుల్ అరోరా 
కేవలం ఎంపిక చేసిన షేర్లను మాత్రమే కొనుగోలుచేయడం మంచిది. ఫార్మా రంగంలో విలువ జతకావచ్చు. కాంట్రా బెట్స్‌లో ఆటోమొబైల్స్‌ రంగాన్ని సూచించారు. నూతన గరిష్టస్థాయిల అంశాన్ని పక్కనపెట్టి, ఇది కొనుగోలుకు మంచి తరుణంగా భావించవచ్చని అన్నారు. ఈ సిఫార్సులు.. 

  • మారుతి సుజుకి, ఐషర్ మోటార్స్, అశోక్ లేలాండ్

ఏంజెల్ బ్రోకింగ్ చీఫ్ టెక్నికల్ అనలిస్ట్ సమీత్‌ చావాన్ 
ర్యాలీ ఇంకొంత కాలం కొనసాగవచ్చు. అయితే, తొందరపడి ర్యాలీ సమయంలో పెట్టుబడులను పెంచకండి. ప్రస్తుత రిలీఫ్‌ తరువాత మరో భారీ పతనానికి అవకాశం ఉందన్నారు. 10,700-10,800 స్థాయిలో నిరోధం ఎదురుకావచ్చు అని విశ్లేషించారు.

  • టాటా స్టీల్‌ (స్టాప్‌లాస్‌ రూ.557)
  • మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (స్టాప్‌లాస్‌ రూ.824)

కంప్లీట్ సర్కిల్ కన్సల్టెంట్స్ సీఈఓ గుర్మీత్‌ చధా సిఫార్సులు

  • టీటీకే ప్రెస్టీజ్, ఐసీఐసీఐ బ్యాంక్

హేటోంగ్‌ సెక్యూరిటీస్ హెడ్‌ రీసెర్చ్‌ సంతోష్‌ సింగ్‌ టాప్‌ పిక్‌

  • హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌

కేఆర్‌చోక్సే మేనేజింగ్‌ డైరెక్టర్‌ దేవన్ చోక్సే: ఎన్నికలు, ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి విలువ కదలికలు ప్రస్తుత మార్కెట్‌కు సవాళ్లుగా మారాయి. అయితే, దేశ ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉన్నందున సంవత్ 2075లో మార్కెట్‌ ర్యాలీ చేస్తుందని భావిస్తున్నాను. ఫండమెంటల్స్‌ బాగున్నాయి. వాల్యుయేషన్స్‌ ఆధారంగా ఇన్వెస్ట్‌ చేయడం మంచింది. కరెక్షన్‌ కారణంగా లార్జ్‌-క్యాప్‌ షేర్లు చాలా చౌకగా లభిస్తున్నాయి. 

మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్‌ అగర్వాల్: ప్రస్తుతం మార్కెట్‌లో వాల్యుయేషన్స్‌ చాలా బాగున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగా ఇప్పటికీ సవాళ్లను ఎదుర్కుంటోంది. కస్టమర్లు సంతోషంగానే ఉన్నప్పటికీ.. బిల్డర్లు ఇబ్బందుల్లోనే ఉన్నారు. సాధారణంగా బ్యాంకింగ్‌ రంగంలో వృద్ధి ఆర్థిక వ్యవస్థ కంటే రెట్టింపు స్థాయిలో ఉంటుంది. పలు ప్రైవేట్‌ రంగ బ్యాంకుల ఈ తరహా వృద్ధిరేటును సాధించేందుకు అవకాశం ఉంది. 

ఇవి కేవలం మార్కెట్‌ విశ్లేషకుల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.
 You may be interested

దశాబ్దం కాలం తరువాత భారీ లాభాలు

Thursday 8th November 2018

దాదాపు దశాబ్దం కాలం తరువాత ముహూరత్ ట్రేడింగ్‌లో సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. ఈ ఏడాది సంవత్‌ 2075 ప్రారంభపు రోజు జరిగిన ముహూరత్ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 245 పాయింట్లు(0.70 శాతం) లాభపడి 35,237 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల (0.65శాతం) లాభంతో 10,598 వద్ద ముగిసింది. 2008 దీపావళి(సంవత్‌ 2065) ముహూరత్‌ ట్రేడింగ్‌ తర్వాత అంటే దాదాపు దశాబ్ధం తరువాత సూచీలు గత ఇంత భారీ ఎత్తున లాభపడటం

ఎస్‌బీఐకి హెచ్‌డీఎఫ్‌సీ బై రేటింగ్‌

Thursday 8th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) షేరును కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ షేరు: ఎస్‌బీఐ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.286 టార్గెట్‌ ప్రైస్‌: రూ.352 హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. ఎస్‌బీఐపై పాజిటివ్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.352గా నిర్ణయించింది. బ్యాంక్‌ క్యూ2 ఎర్నింగ్స్‌ అంచనాలకు మించి ఉన్నా కూడా నాణ్యత

Most from this category