News


సంవత్ 2075లో సెన్సెక్స్‌ శ్రేణి 35,000-45,000 పాయింట్లు

Monday 5th November 2018
Markets_main1541401996.png-21717

50 శాతం మార్కెట్‌ విశ్లేషకుల అంచనా ఇదే

ముంబై: సంవత్ 2075లో సెన్సెక్స్‌ 45,000 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. పలు ప్రాంతాలలో నూతన ఏడాది ప్రారంభంగా భావించే దీపావళి పండుగ దగ్గర పడిన సందర్భంగా.. ఇక్కడ నుంచి వచ్చే ఏడాది పాటు మార్కెట్‌ ఎలా ఉండవచ్చనే అంశంపై ఒక ఆంగ్ల చానల్‌ నిర్వహించిన సర్వేలో ఈ మేరకు అంచనాలు వెల్లడయ్యాయి. పోల్‌లోని 50 శాతం మార్కెట్‌ విశ్లేషకులు సెన్సెక్స్‌ 35,000-45,000 పాయింట్ల స్థాయికి త్వరలోనే చేరుకుంటుందనే అంచనాను వెల్లడించగా, 48 శాతం మంది అనలిస్టులు పెట్టుబడులకు ఇది సరైన సమయంగా తాము భావిస్తున్నట్లు తెలిపారు. అయితే, 38 శాతం మంది మాత్రం మరికొంత కాలం వేచిచూడడం మంచిదని సూచించారు. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌, మోతిలాల్ ఓస్వాల్, యస్‌ సెక్యూరిటీస్‌, 5నాన్స్‌, ఎపిక్‌ రీసెర్చ్‌, ఐడీబీఐ క్యాపిటల్‌, కేఐఎఫ్‌ఎస్‌, ట్రేడ్‌ స్మార్ట్‌ ఆన్‌లైన్‌, చాయిస్‌ బ్రోకింగ్‌ వంటి దిగ్గజ బ్రోకింగ్‌ సంస్థల విశ్లేషకులు ఈ సర్వేలో పాల్గొన్నారు.

నిఫ్టీ స్థాయి 11,000-12,000
వచ్చే దిపావళి నాటికి సెన్సెక్స్‌ మరో 10,000 పాయింట్ల మేర పెరిగేందుకు అవకాశం ఉందని అభిప్రాయపడిన మార్కెట్‌ పండితులు.. నిఫ్టీ 11,000 పాయింట్ల పైన కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. పోల్‌లోని 57 శాతం మంది 11,000-12,000 స్థాయిలో నిఫ్టీ ఉండనుందని విశ్లేషించగా.. 38 శాతం మంది 13,000 పాయింట్లకు చేరుకుంటుందని అంచనాకట్టారు. ఒక్కరు మాత్రం 14,000 పాయిం‍ట్లకు చేరుకుంటుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. 

మార్కెట్‌పై విశ్లేషకుల అభిప్రాయలు.. 
వచ్చే ఏడాది దీపావళి నాటికి నిఫ్టీ 13,000 పాయింట్లకు చేరుకోనుందని తాను భావిస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషకులు, పీసీజీ అండ్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ గ్రూప్‌ విభాగం హెడ్‌ వీకే శర్మ చెప్పారు. ‘ఇన్వెస్టర్లు ఈ సమయాన్ని పెట్టుబడులకు మంచి అవకాశంగా తీసుకుని మార్కెట్‌ లీడర్లుగా కొనసాగుతూ, డిస్కౌంట్‌లో ట్రేడవుతున్న షేర్లను కొనుగోలు చేయడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు.’ అని వ్యాఖ్యానించారు. అత్యంత నాణ్యమైన షేర్లను కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయమని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధన విభాగం హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు. గడిచిన 3 ఏళ్ల సగటు వాల్యుయేషన్‌ తక్కువగా ఉన్న షేర్లు, నాణ్యమైన షేర్లను కలిపి పోర్టిఫోలియో నిర్వహించడం ద్వారా ఆకర్షణీయ రాబడి అందుకోవచ్చన్నారు. ఐటీ, ఫార్మా, వినిమయం, ఎగుమతి ఆధారిత కెమికల్‌ రంగ షేర్లను కొనుగోలుచేయవచ్చని సూచించారు. రిస్క్‌ తీసుకోగలిగితే.. 15-30 శాతం పెట్టుబడిని ఆటో, ఫార్మా, ఎన్‌బీఎఫ్‌సీ రంగాల్లో కేటాయించవచ్చని సూచించారు.

ఎన్నికల ప్రభావం..
నవంబర్‌, డిసెంబర్‌ కాలంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండగా.. ఈ ప్రభావం మార్కెట్‌పై స్పష్టంగా కనిపించనుందని 81 శాతం మంది విశ్లేషకులు వివరించారు. మిగిలిన 19 మంది మాత్రం ఈ ప్రభావం ఉండకపోవచ్చని అంచనావేశారు. ‘ఎన్నికల సమయంలో ఒడిదుకులు అధికంగా ఉంటాయి. ఈ సమయంలో ఎంపికచేసిన షేర్లలో పెట్టుబడికి మంచి అవకాశం ఉంటుంది. సమర్థవంతమైన యాజమాన్యం, ఫండమెంటల్స్‌ బాగున్న షేర్లలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కొనసాగించమని సూచన. కంపెనీల ఫలితాలు, రూపాయి కదలికలు, ముడిచమురు ధరలు, రాజకీయ, అంతర్జాతీయ అంశాలు మార్కెట్‌పై మరికొంతకాలం ప్రభావం చూపనున్నాయి.’ అని ఆషికా స్టాక్‌ బ్రోకింగ్‌ ఏవీపీ సంజీవ్ జైన్ వ్యాఖ్యానించారు.

73-75 స్థాయిలో రూపాయి కదలికలు..
డాలరుతో రూపాయి మారకం విలువ ఈ ఏడాదిలో 14 శాతం క్షీణించింది. గతేడాది దీపావళి నుంచి చూస్తే 12 శాతం పతనాన్ని నమోదుచేసింది. మరి ఇక్కడ నుంచి వచ్చే ఏడాది దీపావళి వరకు ఎలా ఉంటుందనే అంశంపై 48 శాతం మంది విశ్లేషకులు 73-75 స్థాయిలో రూపాయి కదలికలు ఉండవచ్చని విశ్లేషించారు. 19 శాతం మంది మాత్రం రూపాయి విలువ ఏకంగా 78-80 స్థాయికి పడిపోతుందని భావిస్తున్నట్లు చెప్పారు. మిగిలిన 33 శాతం మంది విశ్లేషకులు 73 స్థాయి నుంచి మరింత బలపడవచ్చని వివరించారు. ముడిచమురు ధరలు మరోసారి పెరిగేందుకు ఆస్కారం ఉందని వ్యాఖ్యానించిన ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్‌ సీఈఓ అభిషేక్ గోయంకా.. సప్లై తగ్గితే క్రూడ్‌ ధర మళ్లీ పెరుగుతుందని అన్నారు. నవంబరు 6న వెలువడనున్న అమెరికా మధ్యంతర ఎన్నికల అంశం కీలకంగా ఉందన్నారు. ఇక్కడ నుంచి కొంతకాలం పాటు అయితే 72.60-74 స్థాయిలో కదలికలు ఉండనున్నాయని విశ్లేషించారు. 

 You may be interested

సిప్లా అంచనాలు మిస్‌..!

Monday 5th November 2018

ముంబై:- ఔషధ రంగ దిగ్గజం సిప్లా సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మిస్‌ అయ్యాయి. ఈ క్యూ2లో విశ్లేషకులు రూ.450 కోట్ల నికరలాభాన్ని అంచనా వేయగా, కంపెనీ రూ.377.05 కోట్ల నికరలాభాన్ని మాత్రమే ఆర్జించింది. ఇదే క్యూ2లో విశ్లేషకులు రూ.4270 కోట్ల అమ్మకాలు అంచనా వేయగా, రూ.3,947.93 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే క్యూ2లో కంపెనీ ఆర్జించిన రూ.3,988.24కోట్లతో పోలిస్తే అ‍మ్మకాలు 1శాతం తక్కువ. గతేడాది ఇదే క్యూ2లో

2-3 నెలల్లో 31,000కి పసిడి!!

Monday 5th November 2018

ధంతేరాస్‌ పవిత్రమైన రోజని, అప్పుడు పసిడి కొనుగోలు చేస్తే శ్రేయస్కరమని చాలా మంది విశ్వసిస్తారు. సాంప్రదాయ ఇన్వెస్టర్లు ధంతేరాస్‌ రోజు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కొంత మొత్తంలో పసిడిని కొనుగోలు చేయవచ్చని, అయితే పోర్ట్‌ఫోలియోలో బంగానికి తగిన కేటాయింపుల కోసం సరైన సమయం కోసం వేచిచూడటం మంచిదని రిలయన్స్‌ కమోడిటీస్‌ హెడ్‌ (కమోడిటీ) ప్రీతమ్‌ పట్నాయక్‌ తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల

Most from this category