STOCKS

News


పీఈ మల్టీపుల్స్‌ చూడండి..!

Friday 9th November 2018
Markets_main1541735997.png-21801

  • వచ్చే ఏడాదిలో బలమైన ఎర్నింగ్స్‌కు అవకాశం
  • వాల్యుయేషన్స్‌ సమంజసం
  • నాణ్యమైన యాజమాన్యం, ఆరోగ్యకర కార్పొరేట్‌ పాలన
  • పలు రంగాలకు సానుకూలంగా మారనున్న ప్రస్తుత స్థూల అంశాలు
  • రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ బీ గోప్‌కుమార్‌ సంవత్‌ 2075 అంచనాలు ఇవి

ముంబై: పెట్టుబడులను పెంచడం ద్వారా మంచి రాబడిని పొందే అవకాశాన్ని ఇప్పుడు దేశీ స్టాక్‌ మార్కెట్లు అందిస్తున్నాయని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ బీ గోప్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఈ సమయంలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా భారీ లాభాలను సొంతం చేసుకోగలిగే సువర్ణ అవకాశానికి భారత మార్కెట్‌ వేదికగా నిలవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జీవితకాల గరిష్టస్థాయి నుంచి మార్కెట్‌ దిద్దుబాటుకు లోనుకావడం వల్ల వాల్యుయేషన్స్‌ దిగివచ్చాయన్నారు. ఇన్నాళ్లు మార్కెట్‌కు సవాళ్లుగా మారిన అంతర్జాతీయ అంశాలు నెమ్మదిగా తగ్గిపోతున్నాయని వివరించారు. అయితే, మార్కెట్‌లో పెట్టుబడి కేవలం ఎంపిక చేసిన షేర్లు, రంగాలలో మాత్రమే కొనసాగాలని సూచించారు. మూడు ప్రధాన రాష్ట్రాల ఎన్నికలు, సాధారణ ఎన్నికల నేపథ్యంలో మధ్యకాలంలో స్టాక్‌ మార్కెట్‌ ఒడిదుడుకుల లోనయ్యే అవకాశం అధికంగా ఉందన్నారు. అధిక ఒడిదుడుకులు చోటుచేసుకుంటే.. ప్రస్తుత స్థాయిలో రీ-రేటింగ్‌ జరగకపోగా, ఇక్కడ నుంచి పడిపోవడానికే అవకాశం ఉంటుందన్నారు. ఇటువంటి పరిస్థితులను చూసి బెంబేలెత్తిపోకుండా.. నాణ్యమైన షేర్లలో పెట్టుబడులను పెంచుకుంటూ వెళ్లడం మంచి నిర్ణయం అవుతుందన్నారు. ఆయా రంగాల పీఈ మల్టీపుల్స్‌ ఏ షేరులో ఎంతటి నాణ్యత ఉందన్న విషయాన్ని వెల్లడిస్తాయని, ఇది సరళమైన పద్దతని వెల్లడించారు. గడిచిన ఐదేళ్లలో ఫైనాన్షియల్‌ బలాలు, యాజమాన్యం నాణ్యత, రిటర్న్‌ రేషియోలను చూసి కొనుగోలు చేయడం మంచిదని సూచించారు. ప్రస్తుత ద్రవ్య లభ్యత కొరత ప్రతికూలత వల్ల లార్జ్‌క్యాప్‌లోని పలు బ్యాంకులు ప్రయోజనం పొందనున్నట్లు వెల్లడించారు. 

లార్జ్‌ క్యాప్‌ సిఫార్సులు
ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్

మిడ్‌క్యాప్‌ పిక్స్‌
ఎస్కార్ట్స్‌, డీసీబీ బ్యాంక్‌, ఎన్‌బీసీసీ ఇండియా, సొనాటా సాఫ్ట్‌వేర్‌, ఇంజనీర్స్ ఇండియాYou may be interested

లాభాల్లోంచి వెంటనే నష్టాల్లోకి..

Friday 9th November 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,598 పాయింట్లతో పోలిస్తే 16 పాయింట్ల లాభంతో 10,614 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,237 పాయింట్లతో పోలిస్తే 21 పాయింట్ల లాభంతో 35,258 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు వెంటనే నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 9:21 సమయంలో సెన్సెక్స్‌ 149 పాయింట్ల నష్టంతో 35,088 వద్ద,

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 9th November 2018

వివిధ వార్తలను అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు గెయిల్‌ ఇండియా:- బురానీ - గౌహతీ పట్టణాల మధ్య 616 కిలోమీటర్ల గ్యాస్‌ లైన్‌ నిర్మాణానికి సంబంధించి రూ.1100 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.   అలహబాద్‌ బ్యాంక్‌:- రిజర్వ్‌ బ్యాంక్‌కు ప్రిపరెన్షియల్‌ బేసిస్‌ పద్ధతిలో ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.3054 కోట్లను సమీకరించనుంది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌:- అక్టోబర్‌లో 14.47 టన్నుల ముడిస్టీల్‌ ఉత్పత్తిని చేసింది. గతేడాది ఇదే నెలలో ఉత్పత్తి అయిన

Most from this category