STOCKS

News


యూబీహెచ్‌ఎల్‌ షేర్లను విక్రయించిన డీఆర్‌టీ

Thursday 28th March 2019
Markets_main1553760228.png-24843

విజయ్‌మాల్యా రుణాల రికవరీలో ముగిసిన తొలిఘట్టం
న్యూఢిల్లీ: తన షేర్లను తనఖా పెట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుడు, కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ అధినేత విజయ్‌ మాల్యా యునైటెడ్‌ బ్రేవరీస్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (యూబీహెచ్‌ఎల్‌)కు చెందిన 74లక్షల షేర్లను రూ. 1008కోట్లకు ఈడీ విక్రయించింది. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) బుధవారం మీడియాకు వెల్లడించింది. విజయ్‌ మాల్యాపై మనీ లాండరింగ్‌ విచారణలో భాగంగా ఈడీ ఈ షేర్లను అటాచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ అటాచ్‌లో ఉన్న ఈ షేర్లు డెబిట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ (డీఆర్‌టీ)కు వెళ్లాయి. ఈ నెల తొలి వారంలోనే డీఆర్‌టీ ఆదేశించిన మేరకు యూబీహెచ్‌ఎల్‌కు చెందిన 74,04,932 షేర్లను విక్రయించింది. ఈడీ సమర్పించిన పత్రాలు, తీసుకున్న చర్యల ఆధారంగాను, ఎస్‌బీఐ కన్సార్టియంకు విజయ్‌ మాల్యా భారీమొత్తంలో రుణాలు బాకీ ఉన్న కారణంగాను ఈ షేర్లను అమ్మేందుకు అక్రమ నగదు రవాణా నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కోర్టు ఈనెల 26న అనుమతినిచ్చింది. దీంతో బుధవారం డీఆర్‌టీకి చెందిన రికవరీ అధికారి ఈ షేర్లను రూ. 1008 కోట్లకు విక్రయించారు. విజయ్‌ మాల్యా రుణాల రికవరీ ప్రక్రియలో ఇది తొలి ఘట్టమేనని, మరికొద్ది రోజుల్లో మిగిలినవి కూడా విక్రయిస్తామని డీఆర్‌టీ అధికారులు తెలిపారు. 



You may be interested

విదేశీ ఇన్వెస్టర్ల ఆధీనంలోకి భారత కంపెనీలు

Thursday 28th March 2019

విదేశీ ఇన్వెస్టర్ల ఆధీనంలోకి భారత కంపెనీలు 2018లో 1.64 లక్షల కోట్ల వ్యూహాత్మక పెట్టుబడులు వాటాల తగ్గింపు లేదా పూర్తిగా తప్పుకుంటున్న ప్రమోటర్లు న్యూఢిల్లీ: అననుకూల పరిస్థితులతో ప్రమోటర్లు కఠిన నిర్ణయాలకు మొగ్గు చూపుతున్నారు. పరిస్థితులను అధిగమించేందుకు కంపెనీల్లో తమ వాటాలను పూర్తిగా విక్రయించేందుకు ముందుకు వస్తున్నారు. నిధుల పరంగా తీవ్ర ఒత్తిళ్లు, అదే సమయంలో బ్యాంకులు పటిష్ట ఎన్‌పీఏ నిబంధనల కారణంగా కఠినంగా వ్యవహరిస్తుండడం వంటి పరిణామాలతో... ప్రమోటర్లు తమ వాటాలను తగ్గించుకోవడం

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి బుల్లెట్ ట్రయల్స్

Thursday 28th March 2019

ధరల శ్రేణి రూ.1.62 లక్షలు–2.07 లక్షలు న్యూఢిల్లీ: లగ్జరీ బైక్‌ల తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. బుల్లెట్ ట్రయల్స్ 350, 500 వెర్షన్లను బుధవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. 1948-1965 మధ్యకాలంలో 50కి మించి ఛాంపియన్‌షిప్‌లు గెలుచుకున్న జానీ బ్రిటెన్ ట్రయల్స్ మోటార్‌సైకిల్ ప్రేరణతో ఈ బైక్‌లను రూపొందించినట్లు కంపెనీ తెలియజేసింది. 348 సీసీ ఇంజిన్‌ సామర్థ్యం కలిగిన 350 వెర్షన్‌ ధర రూ.1.62 లక్షలు కాగా, 498 సీసీ 500 వెర్షన్‌

Most from this category