STOCKS

News


వెలుగులోకి ప్రభుత్వరంగ షేర్లు

Thursday 28th February 2019
Markets_main1551345181.png-24378

ఆరంభ లాభాల్ని కోల్పోయిన మార్కెట్లో ప్రభుత్వరంగ షేర్లు రాణిస్తున్నాయి. బీఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌ గురువార ట్రేడింగ్‌లో 1శాతం లాభపడింది. ప్రభుత్వరంగానికి చెందిన ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, ఐఓసీ, గెయిల్‌, ఎన్‌టీపీసీ షేర్లు 3.50శాతం నుంచి 2శాతం   వరకూ లాభపడ్డాయి. మధ్యాహ్నం గం.2:15ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు (6,654.59)తో పోలిస్తే 1శాతం లాభంతో 6725.86 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ టాప్‌-5 గెయినర్లలో ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, ఐఓసీ, గెయిల్‌ షేర్లు మొదటి 4స్థానాలను చోటు దక్కించుకోవడం విశేషం. ఇక ఇదే సమయానికి ప్రధాన సూచీలైన నిఫ్టీ ఇండెక్స్‌ 16 పాయింట్ల నష్టంతో 10,790 వద్ద ట్రేడ్‌ అవుతుండగా, సెన్సెక్స్‌ 45 పాయిం‍ట్లను కోల్పోయి 35856 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

మార్కెట్‌కు అండగా మెటల్‌ షేర్లు

Thursday 28th February 2019

ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో మెటల్ షేర్ల ర్యాలీ మార్కెట్‌ అండగా నిలుస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.50శాతం లాభపడింది. వేదాంత లిమిటెడ్‌, కోల్‌ ఇండియా, ఎన్‌ఎండీసీ, ఏపిల్‌ అపోలో షేర్లు 3శాతం లాభపడ్డాయి. హిందూస్థాన్‌ కాపర్‌, నాల్కో, వెల్‌స్పాన్‌కార్ప్‌, హిందాల్కో, హిందూస్థాన్‌ జింక్‌, మెయిల్‌ ఇండియా షేర్లు 2శాతం నుంచి 1శాతం లాభపడ్డాయి. జేఎస్‌ఎల్‌ హిస్సార్‌, జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. మధ్యాహ్నం

హ్యుందాయ్‌ క్రెటా విక్రయాల జోరు

Thursday 28th February 2019

5 లక్షల మైలురాయికి చేరిన అమ్మకాలు న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా’.. తన పాపులర్‌ ఎస్‌యూవీ ‘క్రెటా’ విక్రయాలు 5 లక్షల మైలురాయిని దాటినట్లు ప్రకటించింది. 2015 జూలైలో విడుదలైన ఈకారు అమ్మకాలు ఇప్పటివరకు భారత్‌లో 3.7 లక్షలు, అంతర్జాతీయ మార్కెట్లో 1.4 లక్షలకు చేరుకున్నాయి. బుధవారం నాటికి మొత్తంగా 5 లక్షలుగా నమోదయ్యాయి. కారు మార్కెట్లోకి విడుదలైన నాలుగేళ్లలోనే ఈ స్థాయి అమ్మకాలు నమోదయ్యాయని

Most from this category