STOCKS

News


లాభాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు

Saturday 23rd February 2019
Markets_main1550906190.png-24295

అమెరికా - చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు సఫలవ్వచ్చనే అంచనాలు మరోసారి తెరపైకి రావడంతో శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. చైనాతో కీలకమైన వాణిజ్య చర్చలు సజావుగా సాగుతున్నాయి. చర్చలు అమెరికాకు మంచి ఫలితాన్ని ఇస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే చైనాపై  వాణిజ్యపరమైన కొత్త ఆంక్షలు విధింపు తుది గడువు వాయిదా పడవచ్చని ఆయన తెలిపారు. మరోవైపు వాణిజ్య చర్చలు జరిపేందుకు వాషింగ్టన్‌కు వచ్చిన చైనా అధికారులు వచ్చేవారంలో కూడా చర్చలను కొనసాగించేందుకు ఆంగీకారం తెలిపారు. ఆ సానూకూలాంశాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చాయి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో టెక్నాలజీ, హెల్త్‌కేర్‌ కంపెనీ షేర్ల ర్యాలీ సూచీలకు కలిసొచ్చింది. ఎస్‌అండ్‌పీ సూచీ 18 పాయింట్లు పెరిగి 2,792 వద్ద ముగిసింది. ఈ ఇండెక్స్‌లో 64 షేర్లు కొత్తగా 52-వారాల గరిష్టాన్ని అందుకోగా, కేవలం మూడు షేర్లు 52-వారాల కనిష్టానికి పతనమయ్యాయి. ఈ సూచీ వరుసగా నాలుగో వారం లాభాల్లో ముగియడం విశేషం. నాస్‌డాక్‌ 67 ర్యాలీ చేసి 7,527 వద్ద ముగిశాయి. ఈ సూచీలో 112 షేర్లు జీవితకాల గరిష్టానికి, 21 షేర్లు జీవితకాల కనిష్టానికి తాకాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ సూచీ 181 పాయింట్లు లాభపడి 26,031 వద్ద స్థిరపడింది. పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 2.65శాతానికి పతనమైంది. 



You may be interested

వీఐఎక్స్‌ తగ్గడంతో మార్కెట్‌కు స్థిరత్వం

Saturday 23rd February 2019

శుక్రవారం వొలటాలిటీ ఇండెక్స్‌ (వీఐఎక్స్‌) 3.74 శాతం తగ్గి 15.45 పాయింట్ల వద్దకు దిగిరావడంతో మార్కెట్‌కు స్థిరత్వం వస్తుందని మోతీలాల్‌ ఓస్వాల్‌కు చెందిన టెక్నికల్‌ విశ్లేషకుడు చందన్‌ తపారియా అంటున్నారు. వీఐక్స్‌ 16కుపైన వుంటే మార్కెట్లో ఒడుదుడుకులు కొనసాగుతాయని, 16 దిగువన కొనుగోలు మద్దతు లభిస్తుందన్న భావన ట్రేడర్లలో వుంటుంది. ఇక నిఫ్టీ అప్‌ట్రెండ్‌ కొనసాగాలంటే 10,750పైన నిలవాల్సివుంటుందని, ఆ సందర్భంలో 10,820 పాయింట్లు, అటుతర్వాత 10,888 పాయింట్ల వరకూ

ఈ షేర్లలో బుల్లిష్‌ క్రాసోవర్‌

Saturday 23rd February 2019

ఇటీవలి కనిష్టస్థాయి నుంచి స్టాక్‌ సూచీలు 2 శాతం వరకూ కోలుకున్న నేపథ్యంలో 260కి పైగా షేర్లు సాంకేతికంగా బుల్లిష్‌ క్రాసోవర్‌ను కనపరుస్తున్నాయి. మూమెంటమ్‌ ఇండికేటర్‌ అయిన మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జెన్స్‌ (ఎంఏసీడీ) ఆధారంగా చూస్తే ఆయా షేర్లు రానున్న ట్రేడింగ్‌ సెషన్లలో బుల్లిష్‌ మూమెంటమ్‌ ప్రదర్శించే అవకాశాలున్నాయి. బుల్లిష్‌ క్రాసోవర్‌ కనపర్చిన షేర్లలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, హెచ్‌డీఐఎల్, స్ట్రయిడ్స్‌ ఫార్మా, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, మహింద్రా అండ్‌

Most from this category