STOCKS

News


రూరల్‌ థీమ్‌ స్టాక్స్‌కు పాజిటివ్‌

Wednesday 30th January 2019
Markets_main1548838695.png-23901

బడ్జెట్‌పై రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ అంచనా
గ్రామీణ, వినిమయ థీమ్స్‌కు చెందిన కంపెనీలకు బడ్జెట్‌లో మంచి లబ్ది చేకూరవచ్చని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ హెడ్‌ నవీన్‌ కులకర్ణి అంచనా వేశారు. బడ్జెట్లో ఈ రంగాలకు కేటాయింపులు భారీగా పెరగవచ్చన్నారు. హెచ్‌యూఎల్‌తో సహా రూరల్‌ థీమ్‌కు సంబంధించిన డాబర్‌, ఐటీసీ, ఎస్కార్ట్స్‌, కోల్గోట్‌ వంటి కంపెనీల షేర్లపై పాజిటివ్‌గా ఉన్నట్లు చెప్పారు. గతేడాది బడ్జెట్‌కూడా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలపై ఫోకస్‌ చేసిందన్నారు. ఈ దఫా ఇన్వెస్ట్‌మెంట్‌ కన్నా కంజప్షన్‌(వినిమయం) థీమ్‌పై ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ పెట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ఎన్నికల వేళ ప్రభుత్వం పాపులర్‌ పథకాలు ప్రవేశపెడుతుందని, దీంతో విత్తలోటు కట్టుతప్పుతుందన్న భయాలను ఆయన సమర్ధించలేదు. కొంతమేర లోటు పెరగవచ్చని, కానీ పూర్తిగా కట్టుతప్పదని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి విత్తలోటు 3.5 శాతం ఉండొచ్చని, ప్రభుత్వం ఈ టార్గెట్‌ను చేరవచ్చని నవీన్‌ అంచనా వేశారు. ప్రజాకర్షక పథకాలున్నా, విత్తపరిస్థితి చెల్లాచెదురయ్యేంత పథకాలుండవని తెలిపారు. తాము అనుకున్న టార్గెట్‌ కన్నా విత్తలోటు పెరిగితే మాత్రం ఆందోళన చెందాల్సిఉంటుందన్నారు. ప్రభుత్వానికి ఎన్నికల సందర్భంగా ఈ బడ్జెట్‌ కీలకమని, గత సాంప్రదాయాలకు భిన్నంగా ప్రభుత్వం పూర్తి బడ్జెట్‌ ప్రవేశపెట్టవచ్చని అంచనా వేశారు. రైతు రుణమాఫీ, రూరల్‌ ఉద్దీపనలు, కనీసమద్దతు ధరల హామీ లాంటి పథకాలుంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. 



You may be interested

నిఫ్టీలో మార్పులు!

Wednesday 30th January 2019

త్వరలో నిఫ్టీ ఇండెక్స్‌లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం రెండు మార్లు నిఫ్టీ50ని రివ్యూ చేస్తారు. షేర్ల పనితీరును బట్టి కొన్నింటి చేర్చడం కొన్నింటిని తీసివేయడం చేస్తుంటారు. జనవరి నుంచి జూన్‌, జూన్‌ నుంచి జనవరి మధ్య కాలాన్ని పరిశీలించి నిఫ్టీలో మార్పులు చేస్తారు. ఈ దఫా గతంలోలాగా షేరు పనితీరు పరిశీలనకు  ఆరునెలల సమయాన్ని కాకుండా మూడు నెలల సమయాన్నే తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టీలో జరగబోయే

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం జంప్‌

Wednesday 30th January 2019

బుధవారం మధ్యాహ్నం మార్కెట్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్ల పెరుగుదలతో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌  1శాతం ర్యాలీ చేసింది. క్యూ3లో అదిరిపోయే ఫలితాలను నమోదు చేయడంతో నేటి ట్రేడింగ్‌లో యాక్సిస్‌ బ్యాంక్‌ 5శాతం ర్యాలీ చేసింది. నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించనున్న ఐసీఐసీఐ బ్యాంక్‌ 4శాతం లాభపడింది. అలాగే ఎస్‌బీఐ షేరు సైతం 2శాతం పెరిగింది. ఈ మూడు షేర్ల ర్యాలీతో నిఫ్టీ

Most from this category