News


స్వల్పంగా పెరిగిన రూపాయి

Monday 31st December 2018
Markets_main1546237166.png-23329

వివిధ కరెన్సీలతో డాలరు బలహీనపడిన నేపథ్యంలో సోమవారం భారత్‌ రూపాయి సైతం ఇతర ఆసియా కరెన్సీలబాటలోనే బలపడింది. ముంబైలోని ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్సే‍్ఛంజ్‌ మార్కెట్లో డాలరుతో పోలిస్తే మారకపు విలువ 13 పైసలు పెరిగి 69.81 స్థాయికి చేరింది. అయితే 2018లో ఆసియా కరెన్సీల్లోకెల్లా అత్యధికంగా నష్టపోయింది రూపాయే. ఈ ఏడాది ఇది 9 శాతం పతనమయ్యింది. 2011లో 15.8 శాతం నష్టపోయిన తర్వాత రూపాయి అధ్వాన్న పనితీరు కనపర్చడం ఈ ఏడాదే. విదేశీ ఇన్వెస్టర్ల ఈ ఏడాది భారత్‌ కేపిటల్‌ మార్కెట్‌ నుంచి 11 బిలియన్‌ డాలర్ల నిధుల్ని ఉపసంహరించుకున్నారు. ఫలితంగా రూపాయి భారీ నష్టాన్ని చవిచూసింది. 



You may be interested

మెటల్ షేర్ల ర్యాలీ

Monday 31st December 2018

ఉక్కు షేర్ల ర్యాలీ అండతో సోమవారం ఉదయం సెషన్‌లో మెటల్ షేర్లు లాభాల బాట పట్టాయి. అమెరికా ప్రభుత్వం ఉక్కు దిగుమతులపై విధిస్తున్న భారీ సుంకాలను తగ్గించాలని భారత ప్రభుత్వం అమెరికా అధికారులను కోరినట్లు శుక్రవారం కేంద్ర ఉక్కు కార్యదర్శి బినోయ్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఉక్కు దిగుమతులపై సుంకాలు తగ్గొచ్చనే అంచనాలు షేర్ల లాభాల ట్రేడింగ్‌కు కారణమయ్యాయి.  నేటి ట్రేడింగ్‌లో  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మెటల్

స్మార్ట్‌ ఇన్వెస్టర్‌ నామ సంవత్సరం

Monday 31st December 2018

25 లక్షల కోట్లకు ఫండ్‌ అసెట్స్‌ 2.5 కోట్లకు సిప్‌ ఖాతాలు     పెట్టుబడుల విషయంలో దేశీ ఇన్వెస్టర్లు మరింత స్మార్ట్‌గా వ్యవరించడం 2018 సంవత్సరంలో అత్యంత సానుకూలాంశం. అక్టోబర్‌ విషయమే తీసుకుంటే.. సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్‌ (సిప్‌)లోకి రూ. 7,985 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ వచ్చాయి. ఇది గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే 42 శాతం అధికం కావడం గమనార్హం. బలహీన రూపాయి. ముడిచమురు ధరల పెరుగుదలతో దేశీ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న

Most from this category