News


స్వల్ప నష్టంతో ప్రారంభమైన రూపాయి

Tuesday 27th November 2018
Markets_main1543292530.png-22399

  • ఇంట్రాడే కనిష్టస్థాయి 71.01

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభ సమయంలో 0.18 శాతం నష్టపోయింది. ఇంటర్‌ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) మార్కెట్‌లో 70.87 దగ్గర ప్రారంభమయ్యింది. ఇంట్రాడేలో 71.01 కనిష్టస్థాయిని నమోదుచేసింది. చైనాతో వాణిజ్య యుద్ధాన్ని కొనసాగించేందుకు అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించిన కారణంగా ఆసియా దేశాల కరెన్సీలు బలహీనపడ్డాయని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే రూపాయి మారకం విలువ కూడా బలహీనపడినట్లు వివరించారు. సోమవారం నాటి ఫారెక్స్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి డాలరుతో రూపాయి విలువ 70.87 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో రూపాయి విలువ 9.66 శాతం పతనమైంది. 



You may be interested

స్మాల్‌క్యాప్స్‌ కొనొచ్చు-మాక్వైరీ

Tuesday 27th November 2018

ముంబై: ఆసియా మార్కెట్లు వచ్చే ఏడాదిలో ర్యాలీ చేసేందుకు అవకాశం ఉందని గ్లోబర్ రీసెర్చ్ సంస్థ మాక్వైరీ అంచనావేస్తోంది. జపాన్‌ మినహాయించి ఆసియాలోని మిగిలిన దేశాల స్టాక్‌ మార్కెట్లు పెరిగేందుకు అవకాశం ఉన్నందున ఈ మార్కెట్లలోని స్మాల్‌క్యాప్స్‌ మంచి రాబడిని ఇచ్చేందుకు అవకాశం ఉందని అంచనావేసింది. ద్రవ్య లభ్యత కొరత కారణంగా ఈ షేర్లు గడిచిన మూడేళ్లలో ఆశించిన స్థాయి వృద్ధిరేటును నమోదుచేయలేకపోయినట్లు విశ్లేషించింది. బ్రోడర్‌ మార్కెట్‌ కంటే ఈ

ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌

Tuesday 27th November 2018

ఆసియా మార్కెట్ల నుంచి అందిన మిశ్రమ సంకేతాలతో మంగళవారం మార్కెట్‌ ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ప్రధాన సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 40 పాయింట్ల లాభంలో 35,394 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7పాయింట్ల స్వల్ప నష్టంతో 10,621.45 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించాయి. చైనా దిగుమతులపై మరిన్ని పన్నులు విధించేందుకు అమెరికా అధ్యక్షుడు ఈదేశ పాలనావ్యవస్థతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే వార్తలతో మంగళవారం ఆసియాలో పలు మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. మరోవైపు దేశీయ

Most from this category