STOCKS

News


వారాంతాన బలహీనపడిన రూపాయి

Saturday 18th May 2019
Markets_main1558152048.png-25807

  • శుక్రవారం 20 పైసలు డౌన్‌
  • డాలరుతో 70.23 వద్ద ముగింపు
  • మూడు రోజుల లాభాల తరువాత మళ్లీ పతనం

ముంబై: డాలరుతో రూపాయి మారకం విలువ మరోసారి కుదేలైంది. శుక్రవారం 20 పైసలు నష్టపోయి 70.23 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 70.22 వద్ద ప్రారంభమై ఒక దశలో 70.32 వద్దకు పతనమైంది. గురువారం నాటి ముగింపు 70.03తో పోల్చితే చివరకు 20 పైసలు బలహీనపడింది. వరుసగా మూడు రోజులపాటు బలపడుతూ వచ్చిన భారత కరెన్సీ.. పెరిగిన ముడిచమురు ధరలు, విదేశీ నిధుల ఉపసంహరణ కారణంగా వారాంతాన మళ్లీ బక్కచిక్కిందని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు విశ్లేషించారు. వారం మొత్తం మీదా చూస్తే.. 31 పైసలు నష్టపోయి, వరుసగా రెండవ వారంలోనూ బలహీనతను నమోదుచేసింది. అమెరికా డాలరుతో ఆసియా దేశాల కరెన్సీలు బలహీనపడడం కూడా రూపాయిపై ఒత్తిడికి మరో కారణంగా నిలిచిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ హెడ్‌ (పీసీజీ, కాపిటల్‌ మార్కెట్స్‌ స్ట్రాటెజీ విభాగం) వీకే శర్మ అన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌, సాధారణ ఎన్నికల ఫలితాలు ఉన్నందున వచ్చేవారం రోజుల్లో భారీ ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని అంచనావేశారు. ఇక ఫైనాన్షియల్‌ బెంచ్‌మార్క్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌బీఐఎల్‌) డాలరుతో రూపాయి రిఫరెన్స్‌ రేటును 70.2469 వద్ద నిర్ణయించింది. 



You may be interested

ఐఓసీ నికర లాభం రూ.6,099 కోట్లు

Saturday 18th May 2019

17 శాతం వృద్ధి తగ్గిన రిఫైనరీ మార్జిన్‌ ఆదుకున్న ఇన్వెంటరీ, కరెన్సీ మారకం లాభాలు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) గత ఆర్థిక సంవత్సరం (2018-19) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.6,099 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం రూ.5,218 కోట్లతో పోలిస్తే 17 శాతం వృద్ధి సాధించామని ఐఓసీ తెలిపింది. షేర్‌ వారీ ఆర్జనను చూస్తే నికర

‍స్పెన్సర్స్‌ గూటికి గోద్రెజ్‌ నేచుర్స్‌ బాస్కెట్‌

Saturday 18th May 2019

న్యూఢిల్లీ: సంజీవ్‌ గోయంకా గ్రూపులో భాగమైన స్పెన్సర్స్‌ రిటైల్‌, గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్‌ గ్రోసరీ సంస్థ నేచుర్స్‌ బాస్కెట్‌ను కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌ విలువ రూ.300 కోట్లు. ఈ కొనుగోలు ద్వారా స్పెన్సర్స్‌ రిటైల్‌ దేశవ్యాప్త కార్యకలాపాలు కలిగిన సంస్థగా మారుతుంది. ముంబై, పుణె, బెంగళూరులోని ప్రధాన ప్రాంతాల్లో 36 స్టోర్లతోపాటు పశ్చిమాదిన స్పెన్సర్స్‌కు నెట్‌వర్క్‌ లభిస్తుంది. గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ సబ్సిడరీ గోద్రేజ్‌ నేచుర్స్‌ బాస్కెట్‌లో నూరు

Most from this category