STOCKS

News


5 పైసలు బలహీనపడిన రూపాయి

Wednesday 11th July 2018
Markets_main1531284548.png-18196

  • 10 గంటల సమయానికి 68.83 వద్ద ట్రేడింగ్‌

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ ఎక్స్ఛేంజ్‌లో 9 గంటల సమయానికి రూపాయి విలువ 5 పైసలు నష్టపోయి 68.87 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. మరోసారి 69 దిశగా కదలాడుతోంది. బ్యాంకులు, దిగుమతిదారులు అమెరికా డాలర్లను కొనుగోలు చేసేందుకు క్యూ కట్టిన నేపథ్యంలో రూపాయి మారకం విలువ కోల్పోయిందని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు తెలియజేశారు. ఇదే సమయంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ నష్టాలతో ప్రారంభంకావడం వల్ల రూపాయి విలువ మరింత బలహీనపడిందని వివరించారు. విదేశీ పోర్టిఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐలు) అదేపనిగా పెట్టుబడులను క్రమంగా వెనక్కుతీసుకోవడం వల్ల రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉందని వివరించారు. మంగళవారం ఫారెక్స్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి రూపాయి విలువ 10 పైసలు బలహీనపడి 68.82 వద్ద ముగిసింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 7.2 శాతం బలహీనపడింది.



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 11th July 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు మియిండా ఇండస్ట్రీస్‌:- 2:1 నిష్పత్తిలో ఎక్స్‌-బోనస్‌ ప్రకటించింది. ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌:- జూలై 13న జరిగే బోర్డు సమావేశంలో నిధుల సమీకరణంపై చర్చించనుంది. యాక్సిస్‌ బ్యాంక్‌:- ఎండీ & సీఈవో పదవి కోసం ముగ్గురు అభ్యర్థుల పేర్లను సిఫారసు చేసింది. 2018, డిసెంబర్‌ 31వ తేదితో శిఖాశర్మ పదవికాలం ముగుస్తుంది. పీఎస్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌:- పీఎన్‌బీ&కార్లే గ్రూప్‌ పీఎన్‌బీలోని 51శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధమైంది. ఆంధ్రా బ్యాంక్‌:-

ఫ్లాట్‌గా ప్రారంభమైన సెన్సెక్స్‌

Wednesday 11th July 2018

26,919 వద్ద బ్యాంక్‌ నిఫ్టీ ఒక శాతం లాభంతో ఐటీ 1.40 శాతం నష్టాల్లో నిఫ్టీ మెటల్‌ ముంబై: దేశీయ స్టాక్‌ సూచీలు బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 13 పాయింట్లు నష్టపోయి 36,226 వద్ద ప్రారంభం కాగా, నిఫ్టీ 9 పాయిం‍ట్లు నష్టపోయి 10,938 వద్ద ప్రారంభమయ్యింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో నష్టాలతోనే మొదలైనప్పటికీ.. క్రమంగా పుంజుకున్న సూచీలు 9 గంటల 40 నిమిషాల సమయానికి స్వల్ప లాభాలను నమోదుచేశాయి. ఈ సమయానికి

Most from this category