STOCKS

News


నిట్టనిలువునా రూపీ పతనం ..

Tuesday 11th December 2018
Markets_main1544502336.png-22813

ఇండియన్‌ రూపాయి మంగళవారం భారీగా పతనమైంది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ అనూహ్యంగా రాజీనామా చేయడం ఇందుకు కారణం. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.46 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ముగింపు స్థాయి 71.32తో పోలిస్తే 1.5 శాతం క్షీణించింది. 114 పైసలు నష్టపోయింది. డాలర్‌ ఇతర కరెన్సీలతో పోలిస్తే బలపడటం కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచింది. రూపాయి మంగళవారం 72.44 వద్ద ప్రారంభమైంది. భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.652 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు స్థాయి 7.587 శాతంగా ఉంది. 
ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా వల్ల ఫారెక్స్‌ మార్కెట్‌లో నెగటివ్‌ సెంటిమెంట్‌ ఏర్పడిందని ఐఎఫ్‌ఏ గ్లోబల్‌ పేర్కొంది. డెట్‌, ఈక్విటీ మార్కెట్‌లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుందని తెలిపింది. కరెంట్‌ అకౌంట్‌ లోటు పెరగడం, బాండ్‌ ఈల్డ్స్‌ ఎగయడం వల్ల కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. 



You may be interested

ఆర్‌బీఐ గవర్నరు రాజీనామా!

Tuesday 11th December 2018

ఆరంభంలోనే పెద్ద నోట్ల రద్దులాంటి ఆర్థిక సునామీలను నిబ్బరంగా తట్టుకున్న భారత రిజర్వు బ్యాంకు గవర్నరు ఉర్జిత్‌ పటేల్‌... ఆకస్మికంగా రాజీనామా చేసి అందరినీ నివ్వెరపరిచారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎన్‌పీఏలు పెరిగిపోయిన బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకోవటంతో పాటు కొన్ని కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య కొన్నాళ్లుగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో

మార్కెట్‌ గ్యాప్‌డౌన్‌

Tuesday 11th December 2018

సెన్సెక్స్‌ 350 పాయింట్లు పతనం 10,350కి నిఫ్టీ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,488 పాయింట్లతో పోలిస్తే 138 పాయింట్ల నష్టంతో 10,350 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,959 పాయింట్లతో పోలిస్తే 375 పాయింట్ల నష్టంతో 34,584 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. సమయం గడిచే కొద్ది ఇండెక్స్‌ నష్టాలు కూడా పెరిగాయి. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్‌

Most from this category