STOCKS

News


రూపాయి రికవరీతో నష్టాలకు బ్రేక్‌..!

Wednesday 12th September 2018
Markets_main1536749462.png-20205

  • 300 పాయింట్ల లాభపడి సెన్సెక్స్‌

రూపాయి అనూహ్య రికవరీ కారణంగా మార్కెట్‌ రెండు రోజుల భారీ పతనానికి బుధవారం బ్రేక్‌ పడింది. దీనికి తోడు హెవీ వెయిట్‌ షేర్లైన ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల ర్యాలీ, ఆగస్ట్‌ నెల వాణిజ్యలోటు స్వల్పంగా తగ్గిందనే వార్తలు కూడా లాభాల సూచీల లాభాల ముగింపునకు కారణమయ్యాయి. ముఖ్యంగా మిడ్‌సెషన్‌ నుంచి  బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంజీసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, ఫార్మా రంగ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో సూచీల రెండు రోజుల నష్టాలకు ముగింపు పలికాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 304 పాయింట్లను ఆర్జించి 37718 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 37342 - 37753 పాయింట్ల మధ్య ట్రేడ్‌ అయ్యింది. మరో ప్రధాన సూచి నిఫ్టీ 83 పాయింట్ల లాభపడి 11371 వద్ద ముగిసింది. 11,250 - 11,381 రేంజ్‌లో ట్రేడైంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రైవేట్‌ బ్యాంకు, రియల్టీ రంగ సూచీలు తప్ప, మిగిలిన అన్ని రంగాలకు చెందిన సూచీలు లాభాల్లో ముగిశాయి. ఎఫ్‌ఎంజీసీ సూచీ అత్యధికంగా 2.53శాతం లాభపడింది. కీలకమైన బ్యాంకు నిఫ్టీ స్వల్పంగా 12 పాయింట్లు  లాభపడి 26,819 వద్ద ముగిసింది.
మిడ్‌ సెషన్‌ నుంచి కొనసాగిన సూచీల ర్యాలీ:-
ఆసియా మార్కెట్లు వరసుగా పదిరోజుల నష్టాల ట్రేడింగ్‌, డాలర్‌ మారకంలో రూపాయి క్షీణత తదితర  ప్రతికూల సంకేతాలతో నేడు మన మార్కెట్‌ ఫ్లాట్‌గా ప్రారంభమైంది. బ్యాకింగ్‌, అటో, ఫైనాన్స్‌ రంగాలకు చెందిన షేర్ల నష్టాల ట్రేడింగ్‌ కారణంగా మిడ్‌ సెషన్‌ వరకు సూచీలు తీవ్ర ఒడిదుడుకులయ్యాయి. ఒకనొక దశలో సెన్సెక్స్‌ 70 పాయింట్లను నష్టపోయింది. నిఫ్టీ 37 పాయింట్లను కోల్పోయింది. ఒడిదుడుకుల మార్కెట్లో ఎఫ్‌ఎంసీజీ షేర్ల ర్యాలీ సూచీలకు అండగా నిలిచింది. మిడ్‌ సెషన్‌ అనంతరం నాటకీయంగా రూపాయి జీవితకాల కనిష్టస్థాయి నుంచి కోలుకోవడంతో, ఆగస్ట్‌ నెలలో వాణిజ్యలోటు స్వల్పంగా తగ్గిందనే వార్తలు మార్కెట్‌కు ఉత్సాహానిచ్చాయి. ఫలితంగా అన్ని రంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్లు ఉపందుకోవడంతో సూచీలు లాభాల బాట పట్టాయి. చివరకి అరగంటలో కొనుగోళ్లు మరింత పెరగడంతో సెన్సెక్స్‌ 37718 వద్ద, నిఫ్టీ 11371 వద్ద ముగిసింది.
రూపాయి అనూహ్య రీకవరీ:-
 రెండు రోజులుగా మార్కెట్‌ను అతలాకుతలం చేసిన రూపాయి పతనానికి నేటి ట్రేడింగ్‌లో అడ్డుకట్టపడింది. నేటి రూపాయి 72.75 వద్ద ప్రారంభమైంది. గత పతనానికి కొనసాగింపుగా నేటి ఉదయం  72.92 వద్ద మరో కనిష్టస్థాయిని నమోదు చేసింది. అటుతర్వాత రూపాయి అనూహ్యంగా రీకవరీ బాట పట్టింది. రూపాయి క్షీణత, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగదలపై ప్రధాని మోదీ ఈ వారం చివర్లో సమీక్షా సమావేశం నిర్వహిస్తారనే వార్తలు ఇందుకు కారణమయ్యాయి. ఒకానొక దశలో 99 పైసల వరకూ కోలుకుని 71.92 వద్దకు బలపడింది.
ఐఓసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌పీసీఎల్‌, టాటామోటర్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 1నుంచి 2శాతం నష్టపోగా, హిందాల్కో, ఐటీసీ, అదానీ పోర్ట్స్‌, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్‌ షేర్లు 3నుంచి 3.50శాతం లాభపడ్డాయి.You may be interested

‘ఐఎల్‌ఎఫ్‌ఎస్‌’ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసిన ఎంఎఫ్‌ ఫథకాలు

Thursday 13th September 2018

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు సంస్థల డెట్‌ సెక్యూరిటీల రేటింగ్‌లను రేటింగ్‌ ఏజెన్సీలు తగ్గించడం... ఈ కంపెనీల డెట్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసిన మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల రాబడులను దెబ్బతీసే ప్రమాదం ఏర్పడింది. దీంతో డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేవారు తమ పథకాలు ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు కంపెనీల డెట్‌ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టాయా, లేదా అన్నది తెలుసుకోవడం అవసరం. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు కార్పొరేట్‌ కంపెనీల డెట్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేయడం

రూపీ రేంజ్‌ 70-74!

Wednesday 12th September 2018

క్రూడ్‌ ధరలు పెరిగాయని, ఇవి ఈ ఏడాది అధిక స్థాయిల్లోనే ఉంటాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది. భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఇందుకు కారణమని పేర్కొంది. సమీప కాలంలో డిమాండ్‌-సప్లై సమీకరణాలు క్రూడ్‌ ధరలను నిర్దేశిస్తాయని తెలిపింది. ఒపెక్‌ దేశాల నుంచి క్రూడ్‌ సరఫరా, అమెరికాలో ఉత్పత్తి పెరుగుదల వంటి అంశాలు క్రూడ్‌ ధరల పరుగును కొంత అడ్డుకోవచ్చని అంచనా వేసింది.  వెనిజుల వంటి దేశాల నుంచి క్రూడ్‌ ఉత్పత్తి తగ్గడం సహా

Most from this category