STOCKS

News


రూపాయికి ఫుల్‌ జోష్‌

Saturday 3rd November 2018
Markets_main1541230204.png-21680

  • ఒక్క రోజులోనే 100 పైసలు బలోపేతం
  • డాలర్‌తో 72.45కు చేరిక

ముంబై: ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి కుమ్మేసింది. శుక్రవారం ఒకే రోజు డాలర్‌తో 100 పైసలు బలపడి 72.45కు వచ్చేసింది. గడిచిన ఐదేళ్లలో (2013 సెప్టెంబర్‌ తర్వాత) రూపాయి ఒకే రోజు ఇంతగా లాభపడిన సందర్భం ఇదే. చమురు ధరలు శాంతించడం, ఇరాన్‌ నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్‌కు అమెరికా మినహాయింపునిచ్చే అవకాశాలు, ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల రాక రూపాయిని బలపడేలా చేశాయి. గురువారం కూడా రూపాయి 50 పైసలు పెరగడంతో రెండు రోజుల్లోనే మొత్తం 150 పైసల మేర లాభపడినట్టయింది. తొలుత ఫారెక్స్‌ మార్కెట్లో 73.14 వద్ద రూపాయి ట్రేడింగ్‌ ఆరంభం కాగా, ఇంట్రాడేలో 72.43 వరకు రికవరీ అయింది. చమురు ధరలు దిగిరావడంతో కరెంటు ఖాతా లోటుపై ఆందోళనలు చల్లబడడం రూపాయికి జోష్‌నిచ్చాయి. బ్రెంట్‌ క్రూడ్‌ గత నెలలో 86.74 డాలర్ల స్థాయి వరకు వెళ్లగా, తాజాగా 73 డాలర్లకు దిగువకు రావడం గమనార్హం. ‘‘చమురు ధరలు ఏడు నెలల కనిష్ట స్థాయికి వచ్చేశాయి. గరిష్ట ధర నుంచి 17 శాతం తగ్గాయి. ప్రధాన చమురు దేశాల నుంచి ఉత్పత్తి అధికం కావడం ఇందుకు తోడ్పడింది’’ అని ఓ విశ్లేషకుడు తెలిపారు.



You may be interested

సెయిల్‌కు రూ.554 ​కోట్ల లాభం

Saturday 3rd November 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని స్టీల్‌ కంపెనీ సెయిల్‌ సెప్టెంబర్‌ క్వార్టర్‌కు రూ.553.69 కోట్ల స్టాండలోన్‌ లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.539 కోట్ల నష్టంతో పోలిస్తే మంచి పనితీరు చూపించింది. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.13,666 కోట్లతో పోలిస్తే 23 శాతం పెరిగి రూ.16,832 కోట్లకు చేరుకుంది. మొత్తం వ్యయాలు సైతం రూ.15,950 కోట్లకు పెరిగాయి. ఎబిట్డా 156 శాతం వృద్ధితో రూ.2,473 కోట్లుగా

గంటలో రూ.కోటి రుణం

Saturday 3rd November 2018

చిన్న సంస్థల రుణావసరాల కోసం ప్రభుత్వ పోర్టల్‌ ఎంఎస్‌ఎంఈలకు ఊతమిచ్చేలా 12 చర్యలు- ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ)కు ఊతమిచ్చేలా ప్రధాని నరేంద్ర మోదీ పలు చర్యలు ప్రకటించారు. ఎంఎస్‌ఎంఈలు కేవలం 59 నిమిషాల వ్యవధిలోనే రూ. 1 కోటి దాకా రుణాలు పొందగలిగేలా ప్రత్యేక పోర్టల్‌ను (www.psbloanin59minutes.com) శుక్రవారం ఆవిష్కరించారు. వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ)లో నమోదు చేయించుకున్న ఎంఎస్‌ఎంఈలు

Most from this category