STOCKS

News


రూపాయి రికవరీ: నష్టాల్లో ఐటీ షేర్లు

Wednesday 3rd October 2018
Markets_main1538556742.png-20825

ముంబై:- రూపాయి మారకం రికవరీ కారణంగా బుధవారం మిడ్‌ సెషన్‌ సమయానికి ఐటీ షేర్లు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 85 డాలర్లకు చేరడంతో నేడు ఇండియన్‌ రూపాయి తన జీవిత కాలంలోనే తొలిసారిగా 73 మార్క్‌ దిగువకు పతనమైంది. నేటి ఇంట్రాడేలో డాలర్‌ మారకంలో రూపాయి 73.34 వద్ద కొత్త కనిష్ట స్థాయిన్ని నమోదు చేసింది. రూపాయి పతననానికి అడ్డుకట్టు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంధన రిటైల్‌ కొనుగోలుదారులు కోసం స్పెషల్‌ డాలర్‌ స్వాప్‌ విండో విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌తో చర్చలు జరుపుతోందని వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తల నేపథ్యంలో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 72.910 స్థాయికి కోలుకుంది. రూపాయి కోలుకోవడంతో ఇంట్రాడేలో ఐటీ షేర్ల నష్టాల బాట పట్టాయి. -    ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ ఇంట్రాడేలో దాదాపు 2శాతం(281 పాయింట్లు) నష్టపోయింది.
-    మధ్యాహ్నం గం.2:00లకు సూచి గత ముగింపుతో పోలిస్తే 1.50శాతం నష్టంతో 15970ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
-    ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన 10షేర్లకు గానూ, 5 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 5 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది.
-    అత్యధికంగా టీసీఎస్‌ 3.50శాతం నష్టపోగా, ఇన్ఫోసిస్‌ 2శాతం, హెచ్‌సీఎల్‌టెక్‌ 1.50శాతం, విప్రో, 1శాతం, టెక్‌ మహీంద్రా అరశాతం నష్టపోయింది.
-    మరోవైపు ఇదే సూచీలోని ఇన్ఫీభీమ్‌ షేరు 16శాతం లాభపడింది. ఎన్‌ఐఐటీ షేరు 5శాతం, టాటాఎలక్సీ 4శాతం, ఓఎఫ్‌ఎస్‌ఎస్‌ 3శాతం, మైండ్‌ ట్రీ షేరు 1శాతం నష్టపోయాయి.
-    టీసీఎస్‌ షేరు 3.50శాతం నష్టపోయి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ-50 సూచిలోని టాప్‌-5 లూజర్లలో చోటు దక్కించుకుంది.You may be interested

200 డీఎంఏ దిగువకు 60 శాతం షేర్లు

Wednesday 3rd October 2018

దేశీయ మార్కెట్లు సెప్టెంబర్‌లో మంచి పతనం చవిచూశాయి. దీంతో నిఫ్టీ 50లో సగానికి పైగా స్టాకులు బలమైన 200 రోజుల డీఎంఏ స్థాయి దిగువకు దిగజారాయి. షేరు చార్టుల్లో 200 రోజుల డీఎంఏ స్థాయి బలమైన మద్దతుగా పరిగణిస్తారు. తాజా పతనంలో పలు బ్లూచిప్‌ కంపెనీలు ఈ కీలక స్థాయిని కోల్పోయాయి. ఇలా పతనమైన స్టాకుల్లో బజాజ్‌ ఆటో, యస్‌ బ్యాక్‌, కోల్‌ ఇండియా, ఎయిర్‌టెల్‌, హెచ్‌పీసీఎల్‌, యూపీఎల్‌, టాటా

షార్ట్‌టర్మ్‌ కోసం ఐదు రికమండేషన్లు

Wednesday 3rd October 2018

వచ్చే ఒకటి రెండు నెలల్లో 13 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ శాంక్టమ్‌ వెల్త్‌ రికమండ్‌ చేస్తోంది. 1. ఇన్ఫోసిస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 850. స్టాప్‌లాస్‌ రూ. 710. ఏడాదిగా హయ్యర్‌ టాప్స్‌ ఏర్పరుస్తూ అప్‌ట్రెండ్‌లో ఉంది. తాజాగా వచ్చిన పతనంలో ఊర్ధ్వముఖ ట్రెండ్‌లైన్‌ వద్ద మద్దతు తీసుకుంది. ఇదే ప్రాంతంలో 21 రోజుల డీఎంఏ స్థాయి కూడా ఉంది. సోమవారం షేరు మరో

Most from this category