News


స్వల్పంగా పెరిగిన రూపాయి విలువ

Tuesday 18th September 2018
Markets_main1537242838.png-20338

క్రితం రోజు 60 పైసల వరకూ పతనమైన రూపాయి విలువ మంగళవారం స్వల్పంగా కోలుకుంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ స్వల్ప పెరుగుదలతో 72.46 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. రూపాయి స్థిరీకరణకు కేంద్రం పలు చర్యల్ని గతవారాంతంలో ప్రకటించినా, సోమవారం రూపాయి భారీగా పతనమైన సంగతి తెలిసిందే.
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 8.162 శాతంగా ఉంది. ఇక బాండ్‌ ఈల్డ్‌ శుక్రవారం ముగింపు స్థాయి 8.127 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి. 
ఈ ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 11.93 శాతం మేర బలహీన పడింది.  విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 939.15 మిలియన్‌​డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 8.79 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకున్నారు. 
ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. దక్షిణ కొరియా ఒన్‌ 0.85 శాతం, ఇండోనేసియా రుపియ 0.51 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.48 శాతం, తైవాన్‌ డాలర్‌ 0.19 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.007 శాతం, సింగపూర్‌ డాలర్‌ 0.022 శాతం, హాంగ్‌కాంగ్‌ డాలర్‌ 0.008 శాతం క్షీణించాయి. అయితే జపాన్‌ యెన్‌ 0.071 శాతం, చైనా ఆఫ్‌షోర్‌ 0.061 శాతం, థాయ్‌ బట్‌ 0.12 శాతం పెరిగాయి.  
ఇతర ప్రధాన కరెన్సీల్లో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు 94.09తో పోలిస్తే స్వల్ప తగ్గుదలతో 94.04 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 9 శాతం క్రాష్‌

Tuesday 18th September 2018

దేనా బ్యాంక్‌ 20 శాతం అప్‌...స్థిరంగా విజయా బ్యాంక్‌ మూడు ప్రభుత్వ రంగ విలీన పథకాన్ని కేంద్రం వెల్లడించిన నేపథ్యంలో మంగళవారం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 9 శాతం పతనమై రూ. 121 వద్దకు పడిపోయింది. ట్రేడింగ్‌ ప్రారంభమైన 15 నిముషాల్లోనే ఎన్‌ఎస్‌ఈలో ఈ కౌంటర్లో 2 కోట్లకుపైగా షేర్లు చేతులు మారాయి. అత్యధిక ఎన్‌పీఏలతో సతమతమవుతూ...రిజర్వుబ్యాంక్‌ నియంత్రణల్ని ఎదుర్కొంటున్న దేనా బ్యాంక్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 20 శాతం

‘2008’ షాక్‌ నుంచి బయటపడని 500 స్టాక్స్‌!

Tuesday 18th September 2018

స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు అంత ఆషామాషీ వ్యవహారం కాదనేందుకు ఎన్నో నిదర్శనాలను చెప్పుకోవచ్చు. 2008 నాటి మార్కెట్ల పతనం గుర్తుండే ఉంటుంది. నాటి పతనానికి ముందు ర్యాలీ చేసిన స్టాక్స్‌లో సుమారు 500 స్టాక్స్‌ ఇప్పటికీ నాటి ధరలను చేరుకోలేదు. ఆలోపే ట్రేడవుతుండడం ఆశ్చర్యకరం. కానీ 2008 నాటి కనిష్ట స్థాయిల నుంచి చూస్తే మార్కెట్‌ ప్రధాన సూచీలు 400 శాతం పెరిగాయి. కొన్ని స్టాక్స్‌ నూరు శాతం నుంచి

Most from this category