STOCKS

News


స్వల్ప నష్టంతో ప్రారంభమైన రూపాయి

Tuesday 16th April 2019
Markets_main1555387419.png-25150

ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ మంగళవారం నష్టంతో ప్రారంభమైంది. నిన్న ముగింపు(69.42)తో పోలిస్తే 7 పైసల నష్టంతో 69.49ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ వారంలో మార్కెట్‌ రెండు రోజులు సెలవు(మార్చి 17న, మార్చి 19న) కావడంతో ఫారెక్స్‌ మార్కెట్లో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడంతో సోమవారం 25పైసలు క్షీణించి 69.42 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగిరావడం, దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ నిల్వలు క్రమంగా తరలిరావడంతో పాటు కొనుగోళ్లు పెరగడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ క్రమంగా హరించుకుపోతుందని ఫారెక్స్‌ ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు. నేటి ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 69.05 - 69.80 రేంజ్‌లో కదలాడుతుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనావేస్తుంది. 



You may be interested

లాభాల్లో బ్యాంక్‌ నిఫ్టీ

Tuesday 16th April 2019

మార్కెట్‌ ప్రారంభంలోనే బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మంగళవారం దాదాపు 0.8 వరకూ లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకు షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ సూచీ 30,236.25ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించడంతో 0.77శాతం పెరిగి 30,338.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఇండెక్స్‌లో అత్యధికంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ 3.50శాతం లాభపడగా, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ 1శాతం, ఇండస్‌

గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌

Tuesday 16th April 2019

కొద్ది రోజులుగా స్వల్ప శ్రేణిలో కదులుతున్న భారత్‌ స్టాక్‌ సూచీలు మంగళవారం దాదాపు అరశాతం గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 200 పాయింట్లకుపైగా లాభంతో 39,100 పాయింట్లపైన ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 11,740 పాయింట్ల ఎగువన మొదలయ్యింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో కోల్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, వేదాంత, ఐఓసీ, హీరో మోటోకార్‌‍్ప, ఆసియన్‌ పెయింట్స్‌ షేర్లు 1-2 శాతం మధ్య జంప్‌చేశాయి. మరోవైపు టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌,టాటా

Most from this category