STOCKS

News


3 నెలల గరిష్టస్థాయికి రూపాయి

Monday 26th November 2018
Markets_main1543206408.png-22374

  • డాలరుతో 70.52 వద్ద ప్రారంభం

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభ సమయంలో 18 పైసలు బలపడింది. ఇంటర్‌ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) మార్కెట్‌లో 70.52 దగ్గర ప్రారంభమయ్యింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధర 60 డాలర్ల దిగువకు పతనమైన నేపథ్యంలో వరుసగా 8వ రోజూ రూపాయి మారకం విలువ బలపడింది. మూడు నెలల గరిష్టస్థాయికి చేరుకుంది. ఇదే సమయంలో దేశీయ స్టాక్‌ సూచీలు లాభాల్లో ప్రారంభం కావడం కూడా రూపాయి మారకం విలువ బలపడానికి మరో ప్రధాన కారణంగా నిలిచిందని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు తెలియజేశారు. గురువారం నాటి ఫారెక్స్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి డాలరుతో రూపాయి విలువ 70.70 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో రూపాయి విలువ 9.66 శాతం పతనమైంది. 



You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 26th November 2018

వివిధ వార్తలను అనుగుణంగా సోమవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు బ్రెంట్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర 59 డాలర్ల దిగువకు చేరిన నేపథ్యంలో ఆయిల్‌ మార్కెట్‌, ఏవియేషన్‌ షేర్లతో పాటు అపోలో టైర్స్‌, ఎంఆర్‌ఎఫ్‌, సియెట్‌, ఏషియన్‌ పేయింట్స్‌, నెరోలాక్‌ పెయింట్‌ షేర్లులో ర్యాలీ జరగవచ్చు. ఇండెక్స్‌లో మార్పులు, చేర్పులు:- బీఎస్‌ఈలో సెన్సెక్స్‌ సూచీలు విప్రో, అదానీ పోర్ట్స్‌ షేర్లను తొలగించి వాటి స్థానంలో కొత్తగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లను

10550 పైన ప్రారంభమైన నిఫ్టీ

Monday 26th November 2018

గతవారం నష్టాల ముగింపు స్వస్తి చెబుతూ మార్కెట్‌  సోమవారం లాభాల్లో ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ భారీ పతనం, దేశీయంగా డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం సూచీలకు కలిసొచ్చింది. ఆసియాలో పలు మార్కెట్ల లాభాల ట్రేడింగ్‌ కూడా ఇన్వెస్టర్లకు ఉత్సాహానిస్తుంది. ఫలితంగా నేటి ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 35000 పైన, నిఫ్టీ సూచీ 10,550పైన ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ 81.51 పాయింట్ల లాభంతో 35,062.53 వద్ద, నిఫ్టీ 43

Most from this category