STOCKS

News


రూపీ మళ్లీ తగ్గింది..

Wednesday 12th December 2018
Markets_main1544588753.png-22836

ఇండియన్‌ రూపాయి బుధవారం మళ్లీ బలహీనపడింది. మూడు ప్రధాన రాష్ట్రాల్లోనూ అధికార బీజేపీ ఓడిపోవడం ప్రతికూల ప్రభావం చూపింది. ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా శక్తికాంత్‌ దాస్‌ నియామకం కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఉదయం 9:15 సమయంలో రూపాయి 72.10 వద్ద ట్రేడవుతోంది. తన మునపటి ముగింపు స్థాయి 71.87తో పోలిస్తే 0.33 శాతం క్షీణించింది. ఇకపోతే రూపాయి బుధవారం 72.02 వద్ద ప్రారంభమైంది. 

భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 7.475 శాతం వద్ద ట్రేడవుతున్నాయి. బాండ్‌ ఈల్డ్‌ మునపటి ముగింపు స్థాయి 7.528 శాతంగా ఉంది. 
ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా శక్తికాంత్‌ దాస్‌ను నియమించింది. దీంతో సెంట్రల్‌ బ్యాంక్‌ స్వతంత్రత కొనసాగింపుపై మార్కెట్‌ దృష్టి కేంద్రీకరిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. 

ఇకపోతే మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయింది. ఈ ఫలితం అంచనాల కన్నా అద్వానంగా ఉండటం గమనార్హం. 

బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఈ ఏడాది ఇప్పటి దాకా 3.21 శాతం పెరిగింది. ఇక ఇదేసమయంలో రూపాయి 8.7 శాతం మేర పతనమైంది. విదేశీ ఇన్వెస్టర్లు దేశీ ఈక్విటీ మార్కెట్ల నుంచి 4 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్ల నుంచి 7.25 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. 

మరోవైపు ఇన్వెస్టర్లు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) గణాంకాల కోసం వేచి చూస్తున్నారు. మార్కెట్‌ ముగిసిన తర్వాత ఇవి వెల్లడి కానున్నాయి.  
 



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 12th December 2018

వివిధ వార్తలను అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇండియన్‌ఆయిల్‌కార్పోరేషన్‌(ఐఓసీ):- ప్రభుత్వం కంపెనీలో తన మొత్తం వాటాలోంచి 2.96శాతం వాటాను ఉపసంహరించుకుంది. అరబిందో ఫార్మా:- చైనా కంపెనీతో కలిసి ఒక జాయింట్‌ వెంచర్‌ కంపెనీని ఏర్పాటు చేయనుంది. తన అనుబంధ సంస్థ హెలిప్స్‌ హెల్త్‌కేర్‌ అనే సంస్థ ఈ మేరకు చైనా కంపెనీ షాన్‌డాంగ్‌ లుగ్జిన్‌ ఫార్మాస్యూటికల్‌ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- ఫైబర్‌, టవర్‌ వ్యాపారాలను విడివిడి సంస్థలుగా ఏర్పాటు చేయడానికి

పాజిటివ్‌ ఓపెనింగ్‌.. లాభాల్లో మార్కెట్‌

Wednesday 12th December 2018

10,600 పైన నిఫ్టీ సెన్సెక్స్‌ 200 పాయింట్లు జంప్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,549 పాయింట్లతో పోలిస్తే 42 పాయింట్ల లాభంతో 10,591 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,150 పాయింట్లతో పోలిస్తే 127 పాయింట్ల లాభంతో 35,277 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. సమయం గడిచే కొద్ది ఇండెక్స్‌ లాభాలు కూడా పెరిగాయి. ఉదయం 9:22

Most from this category