STOCKS

News


రూపీ @ 73.34

Wednesday 3rd October 2018
Markets_main1538540331.png-20805

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి బుధవారం తన జీవిత కాలంలోనే తొలిసారిగా 73 మార్క్‌ దిగువకు పతనమైంది. క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 85 డాలర్లకు చేరడం ప్రతికూల ప్రభావం చూపింది. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.28 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన సోమవారం ముగింపు 72.91తో పోలిస్తే 0.45 శాతంమేర నష్టపోయింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి బుధవారం 73.25 వద్ద ప్రారంభమైంది. ఒకానొక సమయంలో 73.34 కొత్త కనిష్ట స్థాయిని కూడా తాకింది.  
కాగా మంగళవారం గాంధీ జయంతి కారణంగా మార్కెట్లకు సెలవు. 
క్రూడ్‌ ధరలు పెరగడం వల్ల ద్రవ్యలోటు కట్టు తప్పుతప్పొచ్చని ట్రేడర్లు ఆందోళనలు వ్యక్తంచేశారు. దీంతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. అక్టోబర్‌ మానిటరీ పాలసీలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచుతుందనే అంచనాలకు బలం చేకూరిందని పేర్కొన్నారు. 
అమెరికాలో క్రూడ్‌ ఉత్పత్తి తగ్గడం, వెనిజులలో ఉత్పత్తి నెమ్మదించడం, ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో గ్లోబల్‌గా క్రూడ్‌ సరఫరా తగ్గడం వల్ల సమీప కాలంలో క్రూడ్‌ ధరలు బాగా పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేశారు. రూపాయి క్షీణత, క్రూడ్‌ ధరల పెరుగుదల వల్ల బాండ్‌ మార్కెట్‌పై ఒత్తిడి పెరిగిందని పేర్కొన్నారు. 
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 8.052 శాతంగా ఉంది. ఇక బాండ్‌ ఈల్డ్‌ మునపటి ముగింపు స్థాయి 7.988 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
ఈ ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 12 శాతానికిపైగా బలహీన పడింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 2.01 బిలియన్‌​డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 7.11 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకున్నారు. బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ ఇండెక్స్‌ ఈ ఏడాది ఇప్పటి దాకా 7.25 శాతంమేర పెరిగింది. 
ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఇండోనేసియా రుపియ 0.27 శాతం, జపాన్‌ యెన్‌ 0.13 శాతం, తైవాన్‌ డాలర్‌ 0.07 శాతం క్షీణించాయి. ఇక చైనా రెన్‌మిన్‌బి 0.31 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.17 శాతం, దక్షిణ కొరియా ఒన్‌ 0.07 శాతం పెరిగాయి.  
ఇతర ప్రధాన కరెన్సీల్లో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు 95.507తో పోలిస్తే 0.2 శాతం తగ్గుదలతో 95.312 వద్ద ట్రేడ్‌ అవుతోంది.
 



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 3rd October 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు హోటల్‌ లీలా:- ఎల్‌ఐసీకి రూ.22.50 కోట్ల రుణాన్ని చెల్లించడంలో విఫలమైంది. బజాజ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌:- ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. ఎంఫసిస్‌:- షేర్ల బైబ్యాక్‌ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రతి షేరు ధర రూ.1350ల చొప్పున ఇన్వెస్టర్ల నుంచి ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేస్తుంది. శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్స్‌:- రుణాల ద్వారా నిధులను సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:-

నిఫ్టీ రెడ్‌.. సెన్సెక్స్‌ గ్రీన్‌..

Wednesday 3rd October 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం మిశ్రమంగా ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,526 పాయింట్లతో పోలిస్తే 76 పాయింట్ల లాభంతో 36,602 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,008 పాయింట్లతో పోలిస్తే 26 పాయింట్ల నష్టంతో 10,982 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే సెన్సెక్స్‌ కూడా వెంటనే నష్టా‍ల్లోకి జారిపోయింది. ఉదయం 9:22 సమయంలో సెన్సెక్స్‌ 147 పాయింట్ల నష్టంతో 36,379 వద్ద,

Most from this category