STOCKS

News


 74 దిగువకు రూపాయి క్రాష్‌

Wednesday 31st October 2018
Markets_main1540963339.png-21600

ఒకవైపు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో డాలరు గత రాత్రి భారీగా బలపడటంతో పాటు...ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి, ఆర్‌బీఐకి తీవ్ర విభేదాలు తలెత్తాయని వచ్చిన వార్తలకు స్పందనగా డాలరు మారకంలో రూపాయి విలువ నిట్టనిలువునా పతనమయ్యింది. బుధవారం ఉదయం 10 గంటల సమయానికి రూపాయి 45 పైసల మేర క్షీణించి 74.13 వద్దకు పడిపోయింది. క్రితం రోజు 20 పైసల వరకూ తగ్గిన రూపాయి..ఈ రెండు రోజుల్లో 1 శాతం వరకూ పతనంకావడం గమనార్హం. గత రాత్రి ఏడు ప్రధాన కరెన్సీలతో కూడిన డాలరు ఇండెక్స్‌ అరశాతం వరకూ పెరిగి 96.85 పాయింట్ల వద్దకు చేరింది. 



You may be interested

2వారాల కనిష్టానికి పసిడి

Wednesday 31st October 2018

డాలర్‌ ఇండెక్స్‌ పటిష్టమైన ర్యాలీ కారణంగా బుధవారం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర రెండు వారాల కనిష్టస్థాయికి పతనమైంది. గత రాత్రి అమెరికా ప్రకటించిన యూఎస్‌ కన్జ్యూమర్‌ కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌ 18 ఏళ్ల గరిష్టానికి చేరడంతో పాటు రానున్న రోజుల్లో ఆర్థిఖ వ్యవస్థ మరింత వృద్ధి చెందుతునే అంచానాలు నెలకొన్నాయి. పలితంగా ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 97.054 స్థాయిని తాకింది. ఈ స్థాయికి డాలర​

హఠాత్తుగా పతనమైన సూచీలు

Wednesday 31st October 2018

ఆర్‌బీఐ, కేంద్రం విభేదాలతో మార్కెట్లో షాక్‌ బుధవారం పాజిటివ్‌గా ప్రారంభమైన భారత్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ మొదలైన గంట తర్వాత హఠాత్తుగా నెగిటివ్‌లోకి మళ్లింది. ఉదయం 10.20 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 250 పాయింట్లు క్షీణించి 33,640 పాయింట్ల వద్దకు తగ్గగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 90 పాయింట్ల క్షీణతతో 10,108 పాయింట్ల స్థాయికి దిగింది. కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 250 పాయింట్ల మేర పతనమై 25,555 పాయింట్ల స్థాయికి చేరింది.   

Most from this category