STOCKS

News


రూ.10వేలు పదేళ్లలో రూ.కోటిన్నర

Friday 1st March 2019
Markets_main1551463772.png-24395

స్టాక్‌ మార్కెట్లో లాభాలు దీర్ఘకాలంలో కోటీశ్వరులను చేస్తాయనేదాన్ని ఇప్పటి వరకు ఎన్నో కంపెనీలు నిరూపించాయి. ఆ జాబితాలోనిదే వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌ కూడా. పోటీపరమైన అనుకూలత (ఆ విభాగంలో సంబంధిత కంపెనీకి గట్టి పోటీలేకపోవడం) ఉన్న కంపెనీలను మోట్‌గా చెబుతారు. స్థిరంగా ఫలితాల్లో వృద్ధిని చూపిస్తే వీటిని కొనుగోలు చేసుకోవచ్చన్నది విశ్లేషకుల సూచన. వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీకి ఇవే అర్హతలు ఉన్నాయి.

 

వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌ స్టాక్‌ 2009లో ఓ బుల్లి కంపెనీ. పెద్దగా ప్రాచుర్యంలో ఉన్నదీ కాదు. కానీ 2012-13 నాటికి ఇది ఇన్వెస్టర్లకు డార్లింగ్‌ కంపెనీగా మారింది. మెక్‌డొనాల్డ్స్‌ ఫ్రాంచైజీ హక్కులను పశ్చిమ, దక్షిణ భారత్‌కు సంబంధించి వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌ సబ్సిడీ కంపెనీ హార్డ్‌క్యాస్టిల్‌ రెస్టారెంట్స్‌కు లభించడంతో కంపెనీ దశ మారిపోయింది. 2009 మార్చిలో ఈ షేరు 0.20 పైసలు. కానీ, 2013 మార్చి 31 నాటికి రూ.372కు చేరింది. 2013 తర్వాత నుంచి ఈ షేరు రూ.160-400 మధ్యలో ట్రేడ్‌ అవుతూ వస్తోంది. 2009లో ఈ కంపెనీ షేరులో రూ.10,000 ఇన్వెస్ట్‌ చేసిన వారి వాటాల విలువ ప్రస్తుత ధరల ప్రకారం రూ.కోటిన్నర. ప్రొగ్రెసివ్‌ షేర్‌బ్రోకర్స్‌ ఈ షేరు పట్ల బుల్లిష్‌గా ఉంది. రూ.425 టార్గెట్‌ ఇచ్చింది. 

 

వాటాదారులను ధనికులను చేసిన షేర్లలో బజాజ్‌ ఫైనాన్స్‌ కూడా ఒకటి. 2009 మార్చిలో ఈ కంపెనీలో రూ.10,000 ఇన్వెస్ట్‌ చేసిన వారి వద్దనున్న ప్రస్తుత వాటాల విలువ రూ.57 లక్షలు. వార్షికంగా 88 శాతం వృద్ధి చెందినట్టు. ఇంతే పెట్టుబడిపై ఇదే కాలంలో అవంతి ఫీడ్స్‌ రూ.33.30 లక్షల సంపద సమకూర్చిపెట్టింది. ఇక ఆస్ట్రల్‌ పాలీటెక్నిక్‌, అజంతా ఫార్మా, వినతి ఆర్గానిక్స్‌, లా ఒపాలా ఆర్‌జీ, మయూర్‌ యూనికోటర్స్‌, ఐచర్‌ మోటార్స్‌, పాలీ మెడిక్యూర్‌ కంపెనీలు రూ.10,000 పెట్టుబడిని రూ.8-33 లక్షల మధ్య సంపదగా మార్చాయి. మంచి యాజమాన్య నాయకత్వం, క్లీన్‌ బ్యాలన్స్‌ షీటు, ఆదాయ వృద్ధి అవకాశాలు, స్థిరత్వం వంటి ఎన్నో అంశాలు మల్టీబ్యాగర్ల ఎంపికకు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలుగా నిపుణులు చెబుతుంటారు. ఓ స్టాక్‌లో సంపద కూడబెట్టాలంటే దాన్ని ఏ ధరలో కొనుగోలు చేశామన్నదీ కూడా కీలకమే. రుణం లేకపోవడం, ఉన్నా ఈక్విటీతో పోలిస్తే తక్కువగా ఉండడం, అధిక రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ, రిటర్న్‌ ఆన్‌ క్యాపిటల్‌ ఎంప్లాయిడ్‌ వంటి అంశాలు కూడా కంపెనీ భవిష్యత్తు రాబడులను నిర్దేశిస్తాయి. You may be interested

సెబీ సంస్కరణల జోష్‌

Saturday 2nd March 2019

రూ.కోటి లావాదేవీలపై బ్రోకర్ల చార్జీ ఇకపై రూ.10 ప్రస్తుతం ఇది రూ.15 అగ్రి కమోడిటీలపై రూ.15 నుంచి రూపాయికి తగ్గింపు లిస్టింగ్‌ ఫీజులకూ కోత స్టార్టప్‌లో పెట్టుబడులకు చేయూత పెట్టుబడుల నిబంధనలు సరళతరం కమోడిటీస్‌లోకి మ్యూచువల్‌ ఫండ్స్‌, పీఎంఎస్‌లు ఓపెన్‌ ఆఫర్‌ నుంచి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు మినహాయింపు సెబీ బోర్డు నిర్ణయాలు న్యూఢిల్లీ: దేశీయ ఈక్విటీ, క్యాపిటల్‌ మార్కెట్లను మరింత బలోపేతం, విస్తృతం చేసే దిశగా సెక్యూరిటీస్‌ ఎక్సేంజ్‌ బోర్డు (సెబీ) శుక్రవారం నిర్ణయాలు తీసుకుంది. ట్రేడింగ్‌ చార్జీల భారాన్ని తగ్గించడం

ఈ స్టాక్స్‌లో సత్తా ఉంది: యాంబిట్‌ క్యాపిటల్‌

Friday 1st March 2019

గత ఏడాది కాలంలో మిడ్‌క్యాప్స్‌, స్మాల్‌క్యాప్స్‌ కంపెనీల విలువలు భారీగా దిగొచ్చాయి. నిఫ్టీ 9 శాతం తగ్గితే, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ 25 శాతం పతనమైంది. ఈ నేపథ్యంలో టాప్‌ డౌన్‌ క్వాలిటేటివ్‌, క్వాంటిటేటివ్‌ పారామీటర్ల ఆధారంగా యాంబిట్‌ క్యాపిటల్‌ అధిక నాణ్యత కలిగిన మిడ్‌క్యాప్‌ కంపెనీలతో ఓ జాబితా రూపొందించింది. బలమైన వ్యాపార మూలాలతో, చారిత్రకంగా చూస్తే ఆకర్షణీయమైన విలువల వద్ద ఇవి ఉన్నట్టు యాంబిట్‌ క్యాపిటల్‌ తెలిపింది.    ఆర్‌వోసీఈ 15

Most from this category