STOCKS

News


జులై 18న సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ఆరవ విడత

Wednesday 10th July 2019
Markets_main1562755816.png-26959

కేంద్ర ప్రభుత్వం సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌(సెంట్రల్‌ పబ్లిక్‌  సెక్టార్‌ ఎంటర్‌ ప్రైజస్‌ ఎక్సెంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌) ఆరవ విడతను జులై 18న ప్రారంభించనుంది. దీని ద్వారా రూ.18,000 కోట్లను సమీకరించాలని భావిస్తుంది.  ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, ఐఓసీ, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్ప్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్ప్‌, భారతి ఎలక్ట్రానిక్స్‌, ఆయిల్‌ ఇండియా, ఎన్‌బీసీసీ ఇండియా, ఎన్‌ఎల్‌సీ ఇండియా, ఎస్‌జేవీఎన్‌ వంటి 11 కేంద్ర ప్రభుత్వ సంస్థలలోని షేర్లను సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ట్రాక్‌ చేయనుంది. ‘‘ఫాలో-ఆన్ ఫండ్ ఆఫర్ (ఎఫ్‌ఎఫ్‌ఓ) 5 బేస్ ఇష్యూ సైజు రూ .8,000 కోట్లు, మరో రూ .2,000 కోట్లు అదనంగా సమీకరించే అవకాశం ఉంటుంది’’ అని అధికారులు తెలిపారు. ఈ ఇష్యు జులై 18న యాంకర్‌ ఇన్వెస్టర్ల కోసం, జులై 19న ఇతర ఇన్సెస్టర్ల కోసం అందుబాటులోకి రానుంది. ముందు జరిగిన 5 విడతల ద్వారా ప్రభుత్వం రూ.38,500 కోట్లను సమీకరించింది. 2014 మార్చిలో జరిగిన మొదటి విడతలో రూ. 3,000 కోట్లు, 2017 జనవరిలో జరిగిన రెండవ విడతలో రూ.6,000 కోట్లు, మార్చి 2017లో జరిగిన మూడవ విడతలో రూ. 2,500 కోట్లు , 2018 నవంబర్‌లో జరిగిన నాల్గవ విడతలో రూ.17,000 కోట్లు, మార్చి 2019 లో జరిగిన ఐదవ విడతలో రూ. 10,000 కోట్లను సమీకరించింది. గత ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌యూలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం రూ.85,000 కోట్లను సమీకరించింది. డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ. 1.05లక్షల కోట్లను 2019-20లో సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. 


 



You may be interested

40 శాతం మ్యూచువల్‌ ఫండ్స్‌ పనితీరు బాలేదు

Wednesday 10th July 2019

మన దేశంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌కు ఆదరణ ఇటీవలి సంవత్సరాల్లోనే పెరిగింది. ప్యాసివ్‌గా పనిచేసే (ఇండెక్స్‌ ఫండ్స్‌)వాటితో పోలిస్తే యాక్టివ్‌గా పనిచేసే పథకాల్లోకి ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ యాక్టివ్‌ ఫండ్‌ మేనేజర్లు తమ ప్రతిభతో సూచీలకు మించి అధిక రాబడులు తెచ్చిపెడతారన్న నమ్మకం వల్లే. కానీ, మ్యూచువల్‌ ఫండ్స్‌ యాక్టివ్‌ పథకాల్లో 40 శాతం పథకాలు గత ఐదేళ్లలో తమ పోటీ సూచీల కంటే పనితీరులో చతికిలపడడం

రెండేళ్ల కనిష్ఠానికి క్యు1 రెవెన్యూవృద్ధి!

Wednesday 10th July 2019

క్రిసిల్‌ అంచనా కార్పొరేట్‌ ఇండియా రెవెన్యూపై వినిమయంలో మందగమనం తీవ్ర నెగిటివ్‌ ప్రభావం చూపనుందని రేటింగ్‌ ఏజన్సీ క్రిసిల్‌ పేర్కొంది. ఈ ప్రభావంతో క్యు1లో రెవెన్యూ వృద్ధి రెండేళ్ల కనిష్టానికి పడిపోతుందని అంచనా వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్‌ రెవెన్యూలో 5-6 శాతం వృద్ధి ఉంటుందని, ఇది గత రెండేళ్లలో కనిష్ఠ స్థాయని తెలిపింది. గత నాలుగు త్రైమాసికాల్లో కంపెనీల సరాసరి రెవెన్యూ వృద్ధి 14- 15 శాతం ఉంది.

Most from this category