STOCKS

News


రూ.లక్ష పెట్టుబడి... రెండేళ్లలో రూ.32లక్షలు 

Sunday 6th January 2019
Markets_main1546795826.png-23439

స్టాక్‌ మార్కెట్లో నష్టాలు ఎదురైనా... ఒక్క జాక్‌పాట్‌ అయినా కొట్టకపోతామా? అన్న ఆకాంక్షే నేరుగా పెట్టుబడుల వైపు ఆకర్షిస్తుంటుంది. అలాంటి మల్టీబ్యాగర్స్‌ కొన్నే ఉంటుంటాయి. ఆ కోవలోనిదే హెచ్‌ఈజీ లిమిటెడ్‌. నిజమే... రూ.లక్ష పెట్టుబడిని రెండేళ్లలో రూ.32 లక్షలు చేసింది ఈ కంపెనీ. గత ఏడాది కాలంలో మంచి పేరున్న కంపెనీల షేర్లు కూడా కకావికలం అయిన పరిస్థితిని చూశాం. అయినా హెచ్‌ఈజీ మాత్రం అల్లకల్లోల పరిస్థితుల్లోనూ ఇన్వెస్టర్లకు కాసులు కురిపించింది. 2017, 2018 సంవత్సరాల్లో ఇది సాధ్యమైంది. అంటే రెండేళ్లలో ఈ కంపెనీ ఇచ్చిన రాబడి 3200 శాతం. 32 రెట్లు. 

 

హెచ్‌ఈజీ లిమిటెడ్‌ ఎలక్ట్రోడ్స్‌, గ్రాఫైట్‌ తయారీ కంపెనీ. ప్రస్తుతం ఈ సంస్థ మార్కెట్‌ విలువ రూ.14,500 కోట్ల దరిదాపుల్లో ఉంది. గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ను ప్రపంచవ్యాప్తంగా స్టీల్‌ తయారీలో వినియోగిస్తారు. ఈ ఉత్పత్తికి ఏర్పడిన అధిక డిమాండ్‌ కంపెనీకి లాభాలను భారీగా తెచ్చిపెట్టింది. అది స్టాక్‌ ధరను ఆకాశానికి తీసుకెళ్లేలా చేసింది. హెచ్‌ఈజీ లిమిటెడ్‌ షేరు ధర 2017 జనవరి 2న రూ.148.30 వద్ద ఉంది. 2018 అక్టోబర్‌లో రూ.4,950 వరకు వెళ్లింది. అంకెల్లో ఇది 3237 శాతం పెరుగుదలకు సమానం. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో దిద్దుబాటుకు గరైంది. ప్రస్తుత ధర రూ.3645. 2017 జనవరి నుంచి 2018 అక్టోబర్‌ వరకు షేరు ధర అదే పనిగా పెరుగుతూపోయింది. గ్రాఫైట్‌, ఎలక్ట్రోడ్స్‌కు అంతర్జాతీయంగా డిమాండ్‌ను గుర్తించి 2017లోనే పెట్టుబడి పెట్టిన వారు భారీ లాభాలను సొంతం చేసుకున్నట్టే. 2017 సెప్టెంబర్‌ త్రైమాసికంలో హెచ్‌ఈజీ లాభం రూ.113 కోట్లు. ఈ సంస్థ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగిపోవడంతో 2018 సెప్టెంబర్‌ త్రైమాసికంలో లాభం రూ.890 కోట్లకు చేరుకుంది. ఆదాయం రూ.410 కోట్ల నుంచి రూ.1,800 కోట్లకు పెరిగిపోయింది. 



You may be interested

స్వల్ప కాలం కోసం మూడు స్టాక్‌ రికమండేషన్లు

Sunday 6th January 2019

మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ చాలా చౌకగా మారాయని ఈక్విటీ99 వ్యవస్థాపకుడు సుమిత్‌ బిల్‌గయాన్‌ అన్నారు. గత రెండు నెలల్లో అమెరికా మార్కెట్లు చాలా అస్థిరతలకు గురయ్యాయని, ఇది మన మార్కెట్లపైనా ప్రభావం చూపించినట్టు పేర్కొన్నారు. మూడో త్రైమాసికం ఫలితాల సీజన్‌లోకి ప్రవేశించామని, ప్రధాన కంపెనీల్లో చాలా వరకు రానున్న 20 రోజుల్లో ఫలితాలు ప్రకటించనున్నాయని చెప్పారు. ఈ కాలంలో స్టాక్‌ వారీ కదలికలు ఉంటాయని అంచనా వేశారు. అస్థిరతల నేపథ్యంలో

ట్రంప్‌ దిగమన్నా దిగను!

Saturday 5th January 2019

ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ ఫెడ్‌ విధానాలపై అసంతృప్తితో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనను రాజీనామా చేయమన్నా, తాను చేయనని ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ వ్యాఖ్యానించారు. వడ్డీరేట్ల పెంపుదలపై ఇకనుంచి ఓపిగ్గా ఉంటామని భరోసా ఇచ్చారు. మార్కెట్ల డౌన్‌సైడ్‌ రిస్కులను దృష్టిలో ఉంచుకొని ఇకమీదట సున్నితంగా వ్యవహరిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో యూఎస్‌ మార్కెట్లు ఒక్కమారుగా ఎగిశాయి. ఫెడ్‌ దూకుడుతో అమెరికా ఎకానమీ మరోమారు మందగమనం బాట పట్టవచ్చని భావిస్తున్న

Most from this category