News


రిలయన్స్‌ 6 శాతానికిపైగా క్రాష్‌

Friday 19th October 2018
Markets_main1539929465.png-21286

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు శుక్రవారం మార్నింగ్స్‌ ప్రారంభంలోనే భారీగా పతనమైంది. కంపెనీ క్యూ2 ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోవడంతో ప్రతికూల ప్రభావం పడింది. నిఫ్టీ-50లో టాప్‌-3 లూజర్లలో రిలయన్స్‌ ఒకటిగా ఉంది. ఉదయం 11:26 సమయంలో ఎన్‌ఎస్‌ఈలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 5.32 శాతం క్షీణతతో రూ.1,090 వద్ద ట్రేడవుతోంది. షేరు ధర ఒకానొక సమయంలో 6 శాతానికిపైగా పడిపోయింది. రూ.1,070 కనిష్ట స్థాయిని తాకింది. 
కాగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎర్నింగ్స్‌ ఫలితాల సమయంలో హాత్‌వే కేబుల్‌, డెన్‌ నెట్‌వర్క్స్‌లలో మెజారిటీ వాటాను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో డెన్‌ నెట్‌వర్క్‌ షేరు 6 శాతం క్షీణతతో 71.9 వద్ద ట్రేడవుతోంది. రూ.70 స్థాయికి కూడా పడిపోయింది. మరోవైపు హాత్‌వే కేబుల్‌ మాత్రం 4 శాతానికిపైగా పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4.24 శాతం పెరుగుదలతో రూ.30.7 వద్ద ట్రేడవుతోంది. ఒకానొక సమయంలో రూ.32.35 స్థాయికి కూడా పెరిగింది. 



You may be interested

రిలయన్స్‌ షేరును ఏం చేద్దాం?

Friday 19th October 2018

శుక్రవారం ట్రేడింగ్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు దాదాపు 6 శాతం పతనమైంది. క్యు2 ఫలితాలు మిశ్రమంగా ఉండడంతో ఆర్‌ఐఎల్‌ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. అయితే బ్రోకరేజ్‌లు మాత్రం షేరుపై బుల్లిష్‌గా ఉన్నాయి. షేరు త్వరలో అప్‌ట్రెండ్‌ చూపుతుందని అంచనా వేస్తున్నాయి. టెలికం, రిటైల్‌ విభాగాలు మంచి వృద్ది సాధిస్తున్నాయని, కొత్తగా కొనుగోలు చేసే కంపెనీలతో మంచి ఫలితాలుంటాయని చెబుతున్నాయి.  ఆర్‌ఐఎల్‌ షేరుపై వివిధ బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి... 1. క్రెడిట్‌ సూసీ:

తగ్గిన పసిడి

Friday 19th October 2018

ప్రపంచ మార్కెట్లో ఔన్సు పసిడి ధర స్థిరంగా 1,230 డాలర్ల వద్ద ట్రేడ్‌అవుతున్నప్పటికీ, శుక్రవారం ఉదయం రూపాయి మారకపు విలువ 73.46 స్థాయికి పెరిగిన నేపథ్యంలో ఇక్కడి మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్‌లో 10 గ్రాముల బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ.140 మేర తగ్గి, 31,932 వద్ద ట్రేడవుతోంది.   

Most from this category