STOCKS

News


3 షేర్లు.. 60 శాతం ర్యాలీ..

Monday 27th August 2018
Markets_main1535362656.png-19685

నిఫ్టీ 50లోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), బజాజ్‌ ఫైనాన్స్‌ స్టాక్స్‌ కొత్త గరిష్ట స్థాయిలకు చేరాయి. ఈ మూడు షేర్లు సోమవారం 52 వారాల గరిష్ట స్థాయిలను తాకాయి. గత ఏడాది కాలంలో ఇవి 60 శాతానికిపైగా ర్యాలీ చేయడం గమనార్హం. 
అలాగే నిప్టీ 500లోని డాబర్‌ ఇండియా, హవెల్స్‌ ఇండియా, ఇండియాబుల్స్‌ వెంచర్స్‌, ఇన్ఫీబీమ్‌ అవెన్యూ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మెర్క్‌, ఎంఫసిస్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, ఫైజర్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, సన్‌టెక్‌ రియల్టీ, టొరెంట్‌ ఫార్మా, వీఐపీ ఇండస్ట్రీస్‌ స్టాక్స్‌ కూడా సోమవారం కొత్త గరిష్ట స్థాయిలకు చేరాయి. ఈ స్టాక్స్‌లో ఏడు స్టాక్స్‌ 300 శాతం ర్యాలీ చేసి మల్టీబ్యాగర్లుగా నిలిచాయి. 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎస్‌ఎస్‌ఈలో 1 శాతానికి పైగా పెరుగుదలతో 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,295ని టచ్‌ చేసింది. 2018 రెండో క్వార్టర్‌లో ఆర్‌ఐఎల్‌ టెలికం విభాగం రిలయన్స్‌ జియో.. రెవెన్యూ మార్కెట్‌ వాటా పరంగా వొడాఫోన్‌ ఇడియాను వెనక్కునెట్టి దేశంలోనే రెండో అతిపెద్ద టెలికం కంపెనీగా అవతరించిందనే వార్తలు సానుకూల ప్రభావం చూపాయి. టీసీఎస్‌ కూడా 52 వారాల గరిష్ట స్థాయి 2,059ని తాకింది. అలాగే బజాజ్‌ ఫైనాన్స్‌ కూడా 52 వారాల గరిష్ట స్థాయి రూ.2,953కి చేరింది. ఇక ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ గత నెల కాలంలో 40 శాతంమేర ర్యాలీ చేసింది. 



You may be interested

స్వల్పకాలంలో 30శాతం రాబడినిచ్చే 5 షేర్లివే..!

Monday 27th August 2018

ముంబై:- ఈ వారం ఆద్యంతం సూచీలు బుల్లిష్‌ ధోరణిని అవలంభిస్తాయని నరోలియా ఫైనాన్స్‌ అడ్వైజర్‌ షబ్బీర్‌ ఖయ్యం అభిప్రాయపడుతున్నారు. బ్యాంకింగ్‌, ఐటీ, మెటల్‌ షేర్ల ర్యాలీ అండతో నిఫ్టీ సూచీ సోమవారం 11,695.40 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. వీక్లీ ఛార్ట్‌ ప్రకారం చూస్తే మరింత ర్యాలీ చేయవచ్చు. నిఫ్టీ సూచి తనకు గరిష్టస్థాయి వద్ద సాంకేతికంగా కీలమైన 11,580 స్థాయిని అధిగమించి కనుక 11,700 స్థాయిని

టాటా మోటర్స్‌ షేరును ఏం చేద్దాం?

Monday 27th August 2018

పాజిటివ్‌ అంటున్న మెజార్టీ నిపుణులు గతేడాది కాలంలో టాటా గ్రూప్‌నకు చెందిన రెండు బడా కంపెనీలు టీసీఎస్‌, టాటా మోటర్స్‌ షేరు ఉత్తర, దక్షిణ దిశల్లో పయనించాయి. టీసీఎస్‌ మంచి ర్యాలీతో ఆల్‌టైమ్‌ హైని చేరగా, టాటా మోటర్స్‌ ఏడాది గరిష్ఠాల నుంచి 45 శాతం ఢమాల్‌మంది. ఈ నేపథ్యంలో టాటామోటర్స్‌ షేరును కొనాలా? ఉన్న షేర్లను హోల్డ్‌ చేయాలా? అమ్మేసుకోవాలా? అని రిటైల్‌ ఇన్వెస్టర్లు డైలమాలో ఉఉన్నారు. టాటా మోటర్స్‌

Most from this category