STOCKS

News


రూ.1100 దాటిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

Friday 13th July 2018
Markets_main1531470810.png-18279

  • రూ.7లక్షల కోట్లకు చేరిన మార్కెట్‌ క్యాప్‌

ముంబై:- రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు రికార్డు ర్యాలీ పరంపర ఆగడం లేదు. శుక్రవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు మరో 2.31శాతం లాభపడి రూ.1107.2ల వద్ద తమ సరికొత్త ఆల్‌టైం హైని నమోదు చేసింది. ఆ క్రమంలోనే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌మార్కెట్ క్యాపిటలైజేషన్‌ తొలిసారి రూ.7లక్షల కోట్లకు చేరింది. నేడు బీఎస్‌ఈలో రిలయన్స్‌ షేరు రూ.1082.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. గత వరుస లాభాల ట్రేడింగ్‌ను నేడు కొనసాగిస్తూ ఇంట్రాడేలో షేరు ధర రూ.1100 మార్కును అధిగమించి రూ.1107.2ల వద్ద ఆల్‌టైం హైని నమోదుచేసింది. మధ్యాహ్నం గం.2:00లకు రిలయన్స్‌ షేరు గత ముగింపు ధర(రూ.1082.2)తో పోలిస్తే 1.74శాతం లాభపడి రూ.1101.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ఏడాది(2018) జనవరి నుంచి నేటి వరుకు రిలయన్స్‌ షేరు 22శాతం లాభపడింది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.748.00 రూ.1107.25లుగా నమోదయ్యాయి.


RIL

You may be interested

ఫార్మా క్యూ1 లాభాల్లో 50 శాతం వృద్ధి..!

Friday 13th July 2018

ముంబై: జూన్‌ త్రైమాసికంలో ఫార్మా రంగ కంపెనీల నికర లాభాలు 50 శాతం వరకు వృద్ధి చెందేందుకు అవకాశం ఉందని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఈ రంగంలో ధరల ఒత్తిడి కొనసాగుతూనే ఉన్నప్పటికీ.. నియంత్రణా పరమైన వాతావరణం సానుకూలంగా మారుతుండడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనత కారణంగా లాభాలలో వృద్ధికి ఆస్కారం మెండుగా ఉందని భావిస్తున్నాయి. ఫార్మా రంగ ఆదాయం తొలి త్రైమాసికంలో 17 శాతం వరకు

ఇన్‌ఫ్రా స్టాకులకు ఏమైంది?

Friday 13th July 2018

దేశీయ ఇన్‌ఫ్రా రంగ కంపెనీల షేర్లు ఈ ఏడాది భారీగా పతనాలు నమోదు చేశాయి. ఇందుకు పలుకారణాలున్నాయని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు నోమురా, సిటీగ్రూప్‌ చెబుతున్నాయి. దిలీప్‌బుల్డ్‌కాన్‌, ఎన్‌సీసీ, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక‌్షన్స్‌ సహా పలు ఇన్‌ఫ్రా కంపెనీల షేర్లు ఈ ఏడాది దాదాపు 20- 40 శాతం పతనమయ్యాయి. చాలా స్టాకులు ప్రస్తుతం వాటి రెండేళ్ల ఎర్నింగ్స్‌ మల్టిపుల్‌ కన్నా డిస్కౌంట్‌కు ట్రేడవుతున్నాయి. ఇంతలా ఈ షేర్లు కుంగిపోవడానికి కారణాలను

Most from this category