STOCKS

News


ఆర్‌ఐఎల్‌ ఆప్షన్‌ విక్రేతలకు ఎదురుదెబ్బ

Thursday 18th April 2019
Markets_main1555579576.png-25208

గురువారం ఫలితాల అనంతరం ఆర్‌ఐఎల్‌ షేరులో భారీ పెరుగుదల ఉంటుందని భావించిన పలువురు ఆప్షన్‌ సెల్లర్లకు గురువారం ఆరంభంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీ రిఫైనింగ్‌ వ్యాపారంలో సౌదీ అరామ్‌కో మైనార్టీ వాటా కొనుగోలు చేయనుందన్న వార్తలతో గురువారం ఆరంభంలోనే షేరు గ్యాప్‌అప్‌తో ఓపెనయింది. దీంతో ఆప్షన్‌ సెల్లర్లు తమ పొజిషన్లు కవర్‌ చేసుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. ఫలితాలు వస్తున్నాయన్న నేపథ్యంలో మంగళవారం ఆర్‌ఐఎల్‌ 1360 స్ట్రైక్‌ ప్రైస్‌ వద్ద భారీ యాక్టివిటీ నమోదయింది. ఆ రోజు షేరు 1343 రూపాయల వద్ద క్లోజయింది. బుధవారం సెలవు కావడంతో ఫలితాలను దృష్టిలో ఉంచుకొని చాలామంది ట్రేడర్లు స్ట్రాడిల్‌ వ్యూహాన్ని అవలంబించారు. ఇందులో భాగంగా రూ. 1360 కాల్‌ను, పుట్‌ను విక్రయించారు. గురువారం ఫలితాల సందర్భంగా షేరు స్తబ్దుగా ఉంటుందని భావించారు. అంతేకానీ ఎవరూ కూడా సౌదీ అరామ్‌కో వార్తలను ఊహించలేదు. ఉన్నట్లుండి వచ్చిన ఈ వార్తతో షేరు ఒక్కసారిగా గ్యాప్‌అప్‌లో ఓపెనయింది. దీంతో సెల్లర్లకు భారీ నష్టాలు వచ్చాయి. ఫలితాల అనంతరం వచ్చే వారం షేరు మరింత ముందుకు దూసుకుపోవచ్చిన అంచనాలున్నాయి. ఇదే జరిగితే మరింత కాల్‌ అన్‌వైండింగ్‌, పుట్‌ కవరింగ్‌ చూడవచ్చు. మరోవైపు షేరు డెలివరీ శాతం కూడా బాగా పెరిగింది. ఇది షేరుపై బుల్లిష్‌ సెంటిమెంట్‌కు నిదర్శనంగా చెబుతున్నారు. మరోవైపు స్ట్రాడిల్‌ వ్యూహంలో సెల్లర్లు అమ్మిన కాల్స్‌కొన్న ట్రేడర్లకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. You may be interested

రికార్డుస్థాయి నుంచి వెనక్కి

Thursday 18th April 2019

ఇన్వెస్టర్ల అప్రమత్తతతో పాటు లాభాల స్వీకరణతో  గురువారం మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 135 పాయింట్లు నష్టపోయి 39140.28 వద్ద, నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 11752.80 వద్ద స్థిరపడింది. సూచీలు రికార్డుస్థాయిలకు చేరిన తరుణంలో  ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో పాటు నేడు మార్కెట​ముగింపు అనంతరం దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గత ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసిక ఫలితాలను వెల్లడించనుండటం, గుడ్‌ఫ్రైడ్‌ సందర్భంగా రేపు(శుక్రవారం), శని

జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు 34శాతం క్రాష్‌

Thursday 18th April 2019

రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేటు రంగ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయడంతో స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ఆ కంపెనీ షేర్లు కుప్పకూలాయి. నిధుల లేమితో అల్లాడిపోతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌కు రూ.400 కోట్ల మేర అత్యవసర నిధులు అందించేందుకు బ్యాంకులు నిరాకరించాయి. దీంతో జెట్‌ తన ప్రయాణాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. బుధవారం రాత్రి అమృత్‌సర్‌ నుంచి దిల్లీకి నడుపుతున్న విమానమే ఆఖరిదని సంస్థ నిన్న ప్రకటించింది. ఈ

Most from this category