News


త్వరలో రిలయన్స్‌ రిటైల్‌ ఐపీఓ !

Tuesday 26th February 2019
Markets_main1551156985.png-24338

  • జూన్‌ తర్వాత ఐపీఓకు 
  • 6,400 నగరాల్లో 9,900కు పైగా రిటైల్‌ స్టోర్స్‌

ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు అనుబంధంగా ఉన్న రిలయన్స్‌ రిటైల్‌ త్వరలోనే ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు రానున్నదని సమాచారం.   ఈ ఏడాది జూన్‌ తర్వాత రిలయన్స్‌ రిటైల్‌ను నిర్వహిస్తున్న రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ ఐపీఓ ఉండొచ్చని, ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన రాగలదని అంచనాలున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రిలయన్స్‌ రిటైల్‌తో పాటు ఇటీవలే కార్యకలాపాలు ప్రారంభించిన మొబైల్‌ వెంచర్‌, రిలయన్స్‌  జియో ఇన్ఫోకామ్‌పై భారీ అంచనాలున్నాయి. ఏడేళ్లలో ఈ రెండు సంస్థల అమ్మకాలు రెట్టింపవ్వగలవని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ధీమాగా ఉన్నారు. ఇంధన, పెట్రోకెమికల్స్‌ వ్యాపారాలు సాధించేంత ఆదాయాన్నే  ఈ రెండు సంస్థలు సాధించగలవని ముకేశ్‌ అంబానీ భావిస్తున్నారు.


9,900కు పైగా రిటైల్‌ స్టోర్స్‌...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ కంపెనీ 6,400 నగరాల్లో 9,900కు పైగా రిటైల్‌ స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. స్టాక్‌ మార్కెట్లో లిస్టయిన ఇతర రిటైల్‌ కంపెనీలన్నింటి  స్టోర్స్‌ సంఖ్య కంటే కూడా ఇది ఎక్కువే. భారత రెండో అతి పెద్ద రిటైల్‌సంస్థ, ఫ్యూచర్‌ రిటైల్‌ నిర్వహిస్తున్న స్టోర్స్‌ సంఖ్య 4,000 వరకే ఉంది. రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ కింద రిలయన్స్‌ రిటైల్‌ సంస్థ 73 నగరాల్లో 127 గ్రోసరీ స్టోర్స్‌ను, 609 ఫ్యాషన్‌ రిటైల్‌ స్టోర్స్‌ను, 343 ఎలక్ట్రానిక్స్‌ స్టోర్స్‌ను, 5,705 జియో పాయింట్స్‌ను నిర్వహిస్తోంది. 


కన్సూమర్‌ వ్యాపారాలు @ రూ.4,11,800 కోట్లు 
గ్రోసరీ విభాగంలో డిమార్ట్‌ కంటే రిలయన్స్‌ రిటైల్‌ ఆదాయం వేగంగా వృద్ధి చెందుతోందని విదేశీ బ్రోకరేజ్‌ విశ్లేషకులు ఒకరు పేర్కొన్నారు. దుస్తుల విభాగంలో కూడా రిలయన్స్‌ ఫ్యాషన్‌ రిటైల్‌ స్టోర్స్‌ వేగవంతమైన వృద్ధిని సాధిస్తోందని వివరించారు. కాగా రిటైల్‌, జియో, ఈ కామర్స్‌ వంటి రిలయన్స్‌ కన్సూమర్‌ వ్యాపారాల విలువ 5,800 కోట్ల డాలర్ల(రూ.4,11,800 కోట్లు-ఇది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాప్‌ లో దాదాపు సగానికంటే అధికం) మేర ఉండొచ్చని జేపీ మోర్గాన్‌ ఇటీవలనే అంచనా వేసింది.You may be interested

27000 దిగువకు బ్యాంక్‌ నిఫ్టీ

Tuesday 26th February 2019

నష్టాల మార్కెట్లో భాగంగా బ్యాంక్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఎక్కువగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ గ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో 1.50శాతం నష్టపోయింది. అయితే మార్కెట్‌ రికవరీలో భాగంగా ఇండెక్స్‌ నష్టాలను పరిమితం చేసుకుంది. మధ్యాహ్నం గం.1:00లకు ఇండెక్స్‌ గతముగింపు(26,736.60)తో పోలిస్తే 0.60శాతం (171.05 పాయింట్లు) నష్టపోయి 27000 దిగువున 26,988 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

అనుమతి లేకుండా మొండిబాకీలుగా ప్రకటించొద్దు

Tuesday 26th February 2019

ఐఎల్‌ఎఫ్‌ఎస్ ఖాతాలపై బ్యాంకులకు ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలు న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇన్‌ఫ్రా రుణాల సంస్థ ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ సంస్థల ఖాతాలను తమ అనుమతి లేకుండా మొండిపద్దుల కింద బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రకటించరాదని నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆదేశించింది. సంస్థ రుణ పరిష్కార ప్రణాళిక సజావుగా జరగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. దాదాపు రూ. 90,000 కోట్ల పైచిలుకు రుణభారం పేరుకుపోయిన

Most from this category