STOCKS

News


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాప్‌ @100 బిలియన్‌ డాలర్లు

Thursday 12th July 2018
Markets_main1531378347.png-18242

  • వరుసగా 5రోజూ ర్యాలీ చేస్తున్న రిలయన్స్‌ షేర్లు
  • సరికొత్త  హైని నమోదు చేసిన షేర్లు

ముంబై:- రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ గురువారం 100 బిలియన్‌ డాలర్లు మార్కును చేరుకుంది. దేశంలోనే టీసీఎస్‌ తరువాత 100 బిలియన్‌ డాలర్ల మార్కును చేరుకున్న రెండో కంపెనీగా రిలయన్స్‌ కంపెనీ రికార్డు సృష్టించింది. నేటి బీఎస్‌ఈ ఇంట్రాడేలో కంపెనీ షేర్లు 5శాతం లాభపడటంతో కంపెనీ విలువ 6.87లక్షల కోట్లకు అంటే 100 బిలియన్‌ డాలర్ల పైకి చేరుకుంది. దశాబ్దకాలం తర్వాత ఈ కంపెనీ 100 బిలియన్‌ డాలర్ల మార్కును చేరుకోవడం ఇదే ప్రధమం. అయితే 2008 జనవరిలో ఇది 100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి అడుగుపెట్టినప్పుడు రూపాయి మారకపు విలువ 40 సమీపంలో వుండేది. అప్పుడు 100 బిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.4 లక్షల కోట్లు మాత్రమే. ఇప్పుడు రూపాయి విలువ 68 స్థాయిని అధిగమించినందున తాజాగా 100 బిలియన్‌ డాలర్ల మార్కును అందుకోవాలంటే కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ. 6.80 లక్షల కోట్లకు చేరాల్సివుంటుంది.

జీవితకాల గరిష్టానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు:-
గత 4రోజల రికార్డు ర్యాలీని కొనసాగిస్తూ నేటి ఇంట్రాడేలో కూడా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు లాభాల బాట పట్టాయి. జూలై 5న జరిగిన కంపెనీ 41వ వార్షిక సమావేశం సందర్భంగా అధినేత ముకేశ్‌ అంబానీ ప్రకటించిన పలు వ్యూహాత్మక వాప్యార ప్రణాళికలు షేర్ల ర్యాలీకి దోహదపడుతున్నాయి. వార్షిక సమావేశం జరిగిన నాటి నుంచి నేటి వరకు అంటే ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో కంపెనీ షేర్లు 10శాతం పైగా లాభపడ్డాయి. నేడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ షేరు బీఎస్‌ఈలో రూ.1043.15ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. గత 4రోజుల ర్యాలీని కొనసాగిస్తూ నేటి ట్రేడింగ్‌లో 6.5శాతం ర్యాలీ రూ.1098ల వద్ద సరికొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 100 బిలియన్‌ డాలర్లు మార్కును అందుకుంది. మధ్యాహ్నం గం.12:10ని.లకు షేరు గతముగింపు ధర(రూ.1036.35)తో పోలిస్తే 4.83శాతం లాభపడి రూ.1086.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 748.00 రూ.1098.00లుగా నమోదయ్యాయి.


RIL

You may be interested

రూపాయి బలపడడం ఖాయం!

Thursday 12th July 2018

ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ పీజేఎస్‌సీ అంచనా దేశీయ కరెన్సీ ఈ ఏడాదిలో అధ్వాన్న ప్రదర్శన చేస్తూ వస్తోంది. చాలా మంది అనలిస్టులు రూపాయి మరింత బలహీనపడుతుందని అంచనాలు వేస్తున్నారు. అయితే రూపాయిపై ఖచ్ఛితమైన అంచనాలు వెలువరిస్తుందని భావించే ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ పీజేఎస్‌సీ మాత్ర భిన్న స్వరం వినిపిస్తోంది. ఈ ఏడాది చివరకల్లా రూపాయి బలపేతమవుతుందని ఎమిరేట్స్‌ బ్యాంక్‌ అంచనా వేస్తోంది. రూపాయి క్షీణతకు కారణాలైన క్రూడాయిల్‌ ధరల పెరుగుదల, డాలర్‌ బలపడడంఅనే జోడు

ఈపీఎస్‌ వృద్ధి ఉన్న 15 షేర్లు..!

Thursday 12th July 2018

నిఫ్టీ 50లోని 15 షేర్లలో 40 శాతం ఈపీఎస్‌ వృద్ధి అంచనా ముంబై: అంచనాలను మించిన లాభాలతో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్‌ను ప్రారంభించింది. గడిచిన మూడేళ్లపాటు ఫ్లాట్‌ ఎర్నింగ్స్‌ వృద్ధిరేటును కనబరిచిన ఈ ఐటీ దిగ్గజం.. మెరుగైన ఆర్థిక ఫలితాలతో కొత్త ఆర్థిక సంవత్సరంలోనికి అడుగుపెడుతునట్లు ప్రకటించింది. క్యూ1లో ఈ సంస్థ నికర లాభం 23 శాతం వృద్ధి చెందిన

Most from this category