News


సెంట్రమ్‌ టెక్నికల్‌ సిఫార్సులు.!

Tuesday 20th November 2018
Markets_main1542708827.png-22229

ముంబై: నిఫ్టీ 10,850 పాయింట్ల ఎగువన కొనసాగినప్పుడే 11,090 పాయింట్ల ర్యాలీకి ఆస్కారం ఉందని సెంట్రమ్‌ వెల్త్ మేనేజ్‌మెంట్‌ టెక్నికల్‌ హెడ్‌ ఆశిష్ చతుర్‌మెహతా విశ్లేషించారు. టెక్నికల్స్‌ పరంగా 20 శాతం వరకు రాబడిని ఇవ్వగలిగిన 5 షేర్లను ఆయన సిఫార్సుచేశారు.

ఎన్‌ఆర్‌బీ బేరింగ్స్‌ | సిఫార్సు: కొనొచ్చు | ప్రస్తుత ధర: రూ.196 | స్టాప్ లాస్‌: రూ.185 | టార్గెట్ ధరల శ్రేణి: రూ.230-235 | రాబడి అంచనా: 20 శాతం
గడిచిన 11 నెలలుగా ఈ షేరు రూ.190- రూ.150 శ్రేణిలో కదలాడింది. సోమవారం ఈ స్థాయి నుంచి బ్రేకవుట్‌ సాధించి అధిక వాల్యూమ్స్‌తో బేరిష్‌ బార్‌ను ఏర్పాటుచేసింది. డైలీ, వీక్లీ చార్టుల్లో మూమెంటమ్‌ ఇండికేటర్స్‌ బుల్లిష్‌గా ఉ‍న్నాయని విశ్లేషించారు.

అరబిందో ఫార్మా | సిఫార్సు: కొనొచ్చు | ప్రస్తుత ధర: రూ.794 | స్టాప్ లాస్‌: రూ.755 | టార్గెట్ ధర: రూ.900 | రాబడి అంచనా: 13 శాతం
అక్టోబర్‌ 2016లో రూ.895 వద్ద జీవితకాల గరిష్టస్థాయిని తాకిన ఈ షేరు.. ఆ తరువాత ర్యాలీ కొనసాగించిన ప్రథమ స్థానమైన రూ.500 వద్దకు పడిపోయింది. గతేడాదిలో కూడా ఇదే తరహాలో రూ.809 నుంచి రూ.527 వద్దకు పడిపోయింది. వీక్లీ చార్టులో బుల్లిష్‌ డబ్ల్యూ తరహా బోటమింగ్‌ పాట్రన్‌ను ఏర్పాటుచేసింది. 

లార్సెన్‌ అండ్‌ టుబ్రో (ఎల్‌ అండ్‌ టీ) | సిఫార్సు: కొనొచ్చు | ప్రస్తుత ధర: రూ.1,417 | స్టాప్ లాస్‌: రూ.1,360 | టార్గెట్ ధర: రూ.1,600 | రాబడి అంచనా: 13 శాతం
ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.1,470 వద్ద గరిష్టస్థాయిని తాకింది. అనంతరం రూ.1,470 - రూ.1,182 స్థాయిలో 9 నెలలు కొనసాగించింది. వీక్లీ చార్టులో ఫాలింగ్‌ రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్స్‌ను అధిగమించింది. ఇది కరెక్షన్‌ దశకు సంకేతంగా భావించవచ్చని సూచించారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ | సిఫార్సు: కొనొచ్చు | ప్రస్తుత ధర: రూ.1,150 | స్టాప్ లాస్‌: రూ.1,010 | టార్గెట్ ధర: రూ.1,250 | రాబడి అంచనా: 9 శాతం
సెప్టెంబరులో రూ.1,329 దగ్గర గరిష్ట స్థాయిని తాకిన ఈ షేరు.. అక్కడ నుంచి రూ.1,016 వద్దకు పడిపోయింది. రూ.880 నుంచి రూ.1329 వరకు నమోదైన పెరుగుదలలోని 61.8 శాతం ఫిబోనకీ రీట్రేస్‌మెంట్‌ స్థాయికి చేరుకుంది. దీర్ఘకాల 200-రోజుల సగటు కదలికల వద్ద మద్దతు తీసుకుని బౌన్స్‌బ్యాక్‌ అయ్యింది.

వోల్టాస్‌ | సిఫార్సు: కొనొచ్చు | ప్రస్తుత ధర: రూ.562 | స్టాప్ లాస్‌: రూ.535 | టార్గెట్ ధర: రూ.650 | రాబడి అంచనా: 16 శాతం
గతేడాది డిసెంబర్‌లో నమోదైన జీవితకాల గరిష్టస్థాయి రూ.675 నుంచి పడిపోయిన ఈ షేరు గతనెలలో రూ.472 వద్దకు పడిపోయింది. దిగువస్థాయిలో దిద్దుబాటు తరువాత అనంతరం బౌన్స్‌బ్యాక్‌ అయ్యింది. డైలీ చార్టులో హైయ్యర్‌ టాప్స్‌, హయ్యర్‌ బోటమ్స్‌ నమోదుచేసింది.

ఇవి కేవలం సెంట్రమ్‌ వెల్త్ మేనేజ్‌మెంట్‌ టెక్నికల్‌ హెడ్‌ ఆశిష్ చతుర్‌మెహతా అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.

 You may be interested

మూడురోజుల లాభాలకు బ్రేక్‌..!

Tuesday 20th November 2018

10700 దిగువకు నిప్టీ 300 పాయింట్ల నష్టపోయిన సెన్సెక్స్‌ మార్కెట్‌ మూడురోజుల ర్యాలీకి మంగళవారం బ్రేక్‌ పడింది. ఐటీ, మెటల్‌, ఫార్మాషేర్ల క్షీణతతో సెన్సెక్స్‌ 300 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ మళ్లీ 10700ల దిగువకు చేరుకుంది. డాలర్‌ మారకంలో రూపాయి రెండున్నర నెలల స్థాయికి బలపడింది. ఫలితంగా డాలర్‌ రూపంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ,  ఫార్మా షేర్లు నష్టపోయాయి. ప్రపంచమార్కెట్లో మెటల్‌ షేర్ల పతన ప్రభావంతో దేశీయ మార్కెట్‌లోనూ మెటల్‌ షేర్లు క్షీణించాయి.

దీర్ఘకాల పెట్టుబడికి ఐదు షేర్లు

Tuesday 20th November 2018

బ్రెగ్జిట్ సంబంధిత అంశాలు, ఇటలీ బడ్జెట్‌ ప్రణాళిక, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఆర్థిక సంక్షోభం, ద్రవ్య లభ్యత సమస్య, సాధారణ ఎన్నికల వంటి కీలక పరిణామాలు ఈ ఏడాది ద్వితియార్థంలో మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ఎండీ, సీఈఓ అరుణ్‌ తుక్రాల్‌ వ్యాఖ్యానించారు. మార్కెట్‌ దిద్దుబాటు సమయంలో చౌకగా లభిస్తున్న షేర్లను కొనుగోలు చేయడం ద్వారా ఆకర్షణీయ లాభాలను గడించవచ్చని సూచిస్తున్న ఈయన దీర్ఘకాల పెట్టుబడులకు పంచకల్యాణి లాంటి

Most from this category