STOCKS

News


స్మాల్‌ జెమ్స్‌ పట్టుకునే సరైన సమయం!

Wednesday 5th September 2018
Markets_main1536148526.png-19988

స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ 2017లో కొత్త పుంతలు తొక్కాయి. రాబడులతో కిక్కెక్కించాయి. స్వల్ప కాలంలోనే విపరీతంగా ర్యాలీ చేస్తుండడంతో ఇన్వెస్టర్లు వాటికి ఆకర్షితులయ్యారు. 2018లో దృశ్యం తిరగబడింది. ఈ ఏడాది స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌లో చాలా స్టాక్స్‌ భారీ నష్టాల పాలు చేసినవే. కొన్ని కొద్ది మేర కోలుకోగా, ఇంకొన్ని కింద పడి లేచే శక్తి కోసం చూస్తున్న స్థితిలో ఉండిపోయాయి. ఈ పరిణామంతో చాలా మంది ఇన్వెస్టర్లు వీటికి దూరంగా ఉండిపోయారు. కానీ, మంచి సత్తా ఉన్న స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌తో పోర్ట్‌ఫోలియో ఏర్పాటుకు ఇదే సరైన తరుణంగా ట్రస్ట్‌లైన్‌ హోల్డింగ్స్‌ సీఈవో, ఫండ్‌ మేనేజర్‌ రాకేశ్‌పాటిల్‌ తెలిపారు. 

 

సూచీలు ఎప్పటికప్పుడు కొత్త శిఖరాలకు చేరుతుంటే, మార్కెట్‌ క్యాప్‌ పరంగా కొన్ని లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ పోటీపడుతుండడాన్ని రాకేశ్‌ గుర్తు చేశారు. తొలుత రిలయన్స్‌ రూ.8 లక్ష కోట్ల మార్కెట్‌ క్యాప్‌ మార్క్‌ను చేరుకోగా, టీసీఎస్‌ వెంటనే దీన్నందుకుందని, నంబర్‌1 కోసం పోటీ ఇంకా కొనసాగుతోందన్నారు. ప్రస్తుత మార్కెట్‌ ర్యాలీ చాలా సంకుచితంగా ఉందని అభిప్రాయపడ్డారు. సూచీలు జీవిత కాల గరిష్టాలను నమోదు చేస్తుంటే, అది ఇన్వెస్టర్లు అందరికీ ఆనందాన్నివ్వడం లేదని, చాలా వరకు మార్కెట్‌ ప్రతికూలంగానే ఉందని చెప్పారు. ఈ ఏడాది నిఫ్టీ పెరుగుదలలో 65 శాతం కేవలం ఐదు స్టాక్స్‌... టీసీఎస్‌, ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇన్ఫోసిస్‌ వల్లేనని ఓ నివేదిక తెలియజేస్తోందని గుర్తు చేశారు. ‘‘ఇదే కాలంలో స్మాల్‌ ‍క్యాప్‌ ఇండెక్స్‌ 10 శాతం పతనమైంది. గతేడాది అధిక స్థాయిల్లో స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌లోకి వచ్చిన పెట్టుబడులను హెచ్‌ఎన్‌ఐలు, పీఎంఎస్‌లు అమ్మే వరకు ఈ వెర్రి కొనసాగుతుంది. కానీ, లార్జ్‌క్యాప్స్‌కు స్వీయ కాలం అంటూ ఉంటుంది. అది త్వరలోనే ముగియనుంది. ఈ సైక్లికల్‌ గురించి తరచుగా ఇన్వెస్ట్‌ చేసే వారికి తెలుస్తుంది. లార్జ్‌క్యాప్స్‌ వెంట పడే సమయం కాదు ఇది. అధిక నాణ్యత కలిగిన, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌, అది కూడా బ్లూచిప్‌ ర్యాలీ కారణంగా దిద్దుబాటుకు గురైనవాటిని ఎంచుకోవాలి. ఈ విధంగా స్మాల్‌క్యాప్‌ జెమ్స్‌తో పోర్ట్‌ఫోలియో ఏర్పాటుకు ఇది సరైన సమయం’’ అని రాకేశ్‌పాటిల్‌ వివరించారు. 



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 32 పాయింట్లు అప్‌

Thursday 6th September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం లాభాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:38 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 32 పాయింట్ల లాభంతో 11,536 పాయింట్ల వద్ద ఉంది. మరోవైపు నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌లో బుధవారం నాటి ముగింపు 11,518 పాయింట్లతో పోలిస్తే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో ట్రేడవుతుందని గమనించాలి. దీంతో నిప్టీ గురువారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా

మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎప్పుడు అమ్మాలి?

Wednesday 5th September 2018

పెట్టుబడులు పెట్టేందుకు వందల సంఖ్యలో ఉన్న ఫండ్స్‌ నుంచి ఏ పథకాలను ఎంచుకోవాలన్నది క్లిష్టమైన పనే. చాలా మంది ఆన్‌లైన్‌ పోర్టళ్లు, రికమండేషన్ల ఆధారంగా అడుగులు వేస్తుంటారు. కొందరు అడ్వైజర్ల సూచనలు తీసుకుంటుంటారు. కానీ, కొనడం కంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ను విక్రయించడమే అతిపెద్ద టాస్క్‌ అంటున్నారు వ్యాల్యూ రీసెర్చ్‌ అధినేత ధీరేంద్ర కుమార్‌. ఎప్పుడు విక్రయించాలనే విషయమై పలు అంశాలను ఆయన ఇన్వెస్టర్లకు తెలియజేశారు.    ‘‘ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌ విక్రయించడానికి ఎన్నో

Most from this category