STOCKS

News


రిటైలర్ల ‘స్టార్‌’ బ్యాంకు... ఈ కంపెనీ!

Saturday 16th February 2019
Markets_main1550255528.png-24214

ఒకప్పుడు చిన్న బ్యాంకు... ఇప్పుడు మంచి పనితీరుతో అగ్ర స్థాయి బ్యాంకుగా మారే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అదే సిటీ యూనియన్‌ బ్యాంకు. తమిళనాడులోని కుంభకోణం కేంద్రంగా నడిచే ఈ బ్యాంకు గడిచిన 12 నెలల కాలంలో స్టాక్‌ మార్కెట్లో 27 శాతం రాబడులను ఇచ్చింది. బ్యాంకెక్స్‌ సూచీలో యాక్సిస్‌ బ్యాంకు తర్వాత అత్యధిక రాబడులను ఇచ్చిన బ్యాంకు ఇదే.  ప్రధానంగా చిన్న, మధ్య స్థాయి వ్యాపార సంస్థలకు రుణాలివ్వడం ఈ బ్యాంకు వ్యాపారంలో కీలకం. ఎస్‌ఎంఈ రుణాల్లో సిటీ యూనియన్‌ బ్యాంకు గోల్డ్‌ స్టాండర్డ్‌ అని ఆనంద్‌రాఠి ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అనలిస్ట్‌ యువ్‌రాజ్‌ చౌదరి అభివర్ణించారు. 

 

ఎస్‌ఎంఈ రుణాల వ్యాపారంలో ఎక్కువ మార్జిన్లు ఉంటాయి. బ్యాంకులు అధిక వడ్డీ రేటును ఎస్‌ఎంఈ రుణాలపై చార్జ్‌ చేస్తుంటాయి. డిఫాల్ట్‌ రిస్క్‌ ఎక్కువగా ఉండడమే దీని వెనుక కోణం. డీమోనిటైజేషన్‌, జీఎస్టీ, ఆ తర్వాత ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం వంటి పరిణామాలతో ఎస్‌ఎంఈలు సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కానీ, ఈ రంగాన్నే తన వ్యాపారానికి ప్రధాన బిందువుగా మార్చుకుని సీటీ యూనియన్‌ బ్యాంకు రాణిస్తుండడం గమనార్హం. డిసెంబర్‌ చివరి నాటికి ఈ బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు 2.9 శాతం. ప్రముఖ బ్యాంకులతో పోల్చి చూస్తే ఇది తక్కువ. ఇక సిటీ యూనియన్‌ బ్యాంకు నికర వడ్డీ మార్జిన్‌ 4.4 శాతం. ఈ అంశమే బ్యాంకును అగ్ర పథాన నడిపిస్తోంది. తమిళనాడులో సిటీ యూనియన్‌ బ్యాంకు కస్టమర్లలో ఎక్కువ మంది టెక్స్‌టైల్‌ పరిశ్రమకు చెందిన చిన్న వ్యాపారులే. స్పిన్నింగ్‌, వీవింగ్‌ నుంచి సప్లయ్‌ చైన్‌ వరకు వీరంతా ఉంటారు. రిటైల్‌, హోల్‌సేల్‌ డీలర్లకు కూడా రుణాలిస్తుంటుంది. ఇతర బ్యాంకులు అంతగా ఆసక్తి చూపని ఈ విభాగంలో బలంగా పునాదులు వేసుకోవడం వల్లే అధిక వడ్డీ మార్జిన్‌తో సిటీ యూనియన్‌ బ్యాంకు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అయితే, ఈ బ్యాంకులో కాసా డిపాజిట్ల రేషియో తక్కువగా ఉండడం ప్రతికూలం. గత త్రైమాసికంలో నిధుల వ్యయాలు ఎనిమిది బేసిస్‌ పాయింట్ల మేర పెరిగాయి. అయితే, బ్యాంకు చరిత్రలో ఇంత వరకూ నష్టాలు ప్రకటించలేదని, గత 115 ఏళ్లుగా డివిడెండ్‌ ఇస్తూనే ఉన్నామని బ్యాంకు సీఈవో ఎన్‌ కామకోడి తెలిపారు.You may be interested

స్టాక్స్‌లో సంపద కూడబెట్టాలంటే... ఇవి తప్పదు!

Saturday 16th February 2019

అధిక రాబడుల ఆకాంక్షతోనే ఎవరైనా స్టాక్‌ మార్కెట్లో నేరుగా ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. మరి ఆశించిన మేర రాబడులు తెచ్చుకుంటున్న వారు ఎంతమంది...? చాలా తక్కువ మందే ఉంటారు. రాకేష్‌ జున్‌జున్‌వాలా, రమేష్‌ దమానీ, విజయ్‌ కేడియా, డాలీఖన్నా తదితరుల్లా తాము సైతం భారీగా స్టాక్‌ మార్కెట్లో పోగు చేసుకోవాలనుకుంటే... అందుకు సాధారణంగా ఇన్వెస్ట్‌ చేస్తే సరిపోదు మరి. ప్రత్యేక క్వాలిటీలతో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. స్టాక్‌ మార్కెట్లో భారీగా సంపద

ఇంత నిరాశపూరిత మార్కెట్‌ ఎప్పుడూ చూడలేదు!

Friday 15th February 2019

సంజీవ్‌ భాసిన్‌ మార్కెట్లో ప్రస్తుతం ఉన్నంత నిరాశాపూరిత ధోరణి ఎప్పుడూ చూడలేదని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి సంజీవ్‌ భాసిన్‌ అభిప్రాయపడ్డారు. నిజానికి పరిస్థితులన్నీ ఇప్పుడే కాస్త చక్కబడుతున్నాయని, కొందరు ప్రమోటర్లు చేసిన తప్పుల ఫలితంగా మొత్తం మార్కెట్‌లో నెగిటివ్‌ భావనలు పెరిగిపోయాయని తెలిపారు. ఇప్పుడింత నిరాశ అవసరం లేదన్నారు. ఏప్రిల్‌ చివరకు తప్పకుండా నిఫ్టీ మరోమారు 11600 పాయింట్లను చేరడం తధ్యమని జోస్యం చెప్పారు. ఈ సారి ర్యాలీలో మిడ్‌క్యాప్స్‌ కూడా

Most from this category