STOCKS

News


పడుతున్న కత్తులను పట్టుకున్న రిటైల్‌ ఇన్వెస్టర్లు!

Friday 19th October 2018
Markets_main1539972244.png-21295

ఇటీవలి కాలంలో బాగా పతనమవుతున్న స్టాక్స్‌ను రిస్క్‌ చేసి మరీ రిటైల్‌ ఇన్వెస్టర్లు కొంటున్నట్టు స్టాక్‌ ఎక్సేంజ్‌ గణాంకాలు తెలియజేస్తున్నాయి. అధిక పెట్టుబడులు పెట్టే హెచ్‌ఎన్‌ఐలతోపాటు రిటైల్‌ ఇన్వెస్టర్లు నష్ట జాతక స్టాక్స్‌ వెంట అడుగులు వేస్తుండడాన్ని గమనించొచ్చు. సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఇలాంటి స్టాక్స్‌ చాలానే కొన్నారు. ఆ షేర్లు ఒక్క సెప్టెంబర్‌ త్రైమాసికంలోనే 45 శాతం వరకు పడిపోయాయి. 

 

మన్‌పసంద్‌ బెవరేజెస్‌ ఇందులో ఒకటి. ఈ కంపెనీలో రిటైల్‌ ఇన్వెస్టర్ల (రూ.2 లక్షల్లోపు పెట్టుబడి కలిగినవారు) వాటా సెప్టెంబర్‌ క్వార్టర్లో 3.33 శాతం పెరిగింది. దీంతో కంపెనీలో రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా 9.5 శాతానికి చేరింది. కంపెనీ లిస్ట్‌ అయిన తర్వాత రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా ఇంత గరిష్ట స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. హెచ్‌ఎన్‌ఐల వాటా 1.48 శాతం పెరిగి 2.7 శాతానికి చేరుకుంది. వాస్తవానికి సెప్టెంబర్‌ త్రైమాసికంలో దాదాపు చాలా వరకు ఇనిస్టిట్యూషన్లు ఈ కంపెనీ పట్ల బేరిష్‌గా ఉన్నారు. తమ వాటాలను తగ్గించుకున్నారు. కంపెనీ ఆడిటర్‌ ఉన్నట్టుండి తప్పుకోవడంతో కంపెనీ ఖాతాలపై సందేహాలు చెలరేగాయి. 

 

పీసీ జ్యుయలర్‌లోనూ రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా 3.9 శాతం పెరిగి సెప్టెంబర్‌ త్రైమాసికంలో 16.1 శాతానికి చేరుకుంది. ఈ కంపెనీలోనూ రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా ఈ స్థాయిలో ఉండడం ఇదే ప్రథమం. హెచ్‌ఎన్‌ఐల వాటా కేవలం అరశాతం పెరిగి 3.6 శాతానికి చేరుకుంది. ఈ ఏడాది ఈ స్టాక్‌ 87 శాతం నష్టపోయింది. ప్రమోటర్‌ కుటుంబ సభ్యులకు షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చి స్టాక్‌ ఎక్సేంజ్‌లకు వెల్లడించలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఇక సౌత్‌ ఇండియన్‌ బ్యాంకులోనూ రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా 2011-12 తర్వాత తిరిగి అత్యంత గరిష్టానికి (32.82 శాతం) చేరుకుంది. హెచ్‌ఎన్‌ఐల వాటా 8.6 శాతం నుంచి 8.94 శాతానికి చేరింది. బలరామ్‌పూర్‌ చినిలోనూ రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా 21.1 శాతానికి చేరుకుంది. ఇది 11 ఏళ్లలోనే గరిష్ట స్థాయి. హెచ్‌ఎన్‌ఐల వాటా 6.6 శాతంగా ఉంది. గ్రీన్‌ప్లై ఇండస్ట్రీస్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎన్‌సీసీ, బీఈఎంఎల్‌, రెయిన్‌ ఇండస్ట్రీస్‌, తేజాస్‌ నెట్‌వర్క్స్‌, నవనీత్‌ ఎడ్యుకేషన్‌, జిందాల్‌ సా తదితర స్టాక్స్‌లోనూ రిటైలర్లు వాటాను పెంచుకున్నారు. You may be interested

ఈఎల్‌ఎస్‌ఎస్‌ మెరుగైన ఆప్షన్‌... ఎందుకంటే?

Friday 19th October 2018

పన్ను ఆదా చేసే పథకాల్లో ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎఎస్‌ఎస్‌) మెరుగైన ఆప్షన్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపునకు పీపీఎఫ్‌, ఈపీఎఫ్‌, యులిప్‌లు, ఎన్‌ఎస్‌సీ, ఐదేళ్ల బ్యాంకు ఎఫ్‌డీ తదితర సాధనాలున్న విషయం తెలిసిందే. వీటన్నింటలో ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఎందుకు మెరుగైనదన్న దానికి నిపుణులు పేర్కొంటున్న అంశాలు ఇవి...   తక్కువ లాకిన్‌ పీరియడ్‌ అంటే పెట్టుబడి పెట్టిన తర్వాత నిర్ణీత కాలం పాటు తిరిగి

సెన్సెక్స్‌ 464 పాయింట్లు డౌన్‌

Friday 19th October 2018

లిక్విడిటీ భయాలు మళ్లీ తలెత్తడంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయింది. దసరా  (గురువారం) సెలవు కారణంగా ఒక్క రోజు విరామం తర్వాత ఆరంభమైన స్టాక్‌ సూచీలు చెరో ఒక శాతానికి పైగా క్షీణించాయి. ఫెడ్‌ రేట్ల పెంపు భయాలు, చైనా వృద్ధి మందగించడం వంటి కారణాల వల్ల ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. దీనికి తోడు  వీసా నిబంధనలు మరింత కఠినతరం కానుండటం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌  ఇండెక్స్‌

Most from this category