STOCKS

News


హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్ల పతనం

Wednesday 17th October 2018
Markets_main1539768421.png-21244

హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయాయి. ఈ రంగానికి చెందిన ఇండియా బుల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ షేర్లు 16శాతం నుంచి 12శాతం క్షీణించాయి.
ఇండియాబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.911.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 16శాతం నష్టపోయి రూ.765.65ల కనిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం గం.2:30నిలకు షేరు గతముగింపు ధర(రూ.907.35) పోలిస్తే 12శాతం నష్టంతో రూ.802ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.765.65, రూ.1,440.00లుగా నమోదయ్యాయి.
డీహెచ్‌ఎఫ్‌సీ లిమిటెడ్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.272.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 13శాతం నష్టపోయి రూ.234.40ల కనిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం గం.2:30నిలకు షేరు గతముగింపు ధర(రూ.268.80) పోలిస్తే 11శాతం నష్టంతో రూ.238.40 ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.193.40లు, రూ.691.00లుగా నమోదయ్యాయి.
రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.376.95ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 12శాతం నష్టపోయి రూ.323.80ల కనిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం గం.2:30నిలకు షేరు గతముగింపు ధర(రూ.370.79) పోలిస్తే 8శాతం నష్టంతో రూ.342.80ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.323.80లు, రూ.7334.00లుగా నమోదయ్యాయి.



You may be interested

రానున్న వారాల్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు తీవ్రతరం

Wednesday 17th October 2018

ఇండియన్‌ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు రానున్న వారాల్లో నికరంగా చూస్తే విక్రయదారులుగా ఉంటారు తప్ప కొనుగోలుదారులుగా ఉండరని మార్నింగ్‌స్టార్‌ అడ్వైజర్స్‌ ఇండియా సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ హిమాంశు శ్రీవాత్సవ తెలిపారు. ఏవైనా ఊహించని మార్పులు చోటుచేసుకుంటే.. అప్పుడు పైన చెప్పినదానికి మినహాయింపు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.   గత కొన్ని వారాలను గమనిస్తే ఎఫ్‌ఐఐలు ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్‌లో సెల్లింగ్‌ బటన్‌ను

మార్కెట్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు

Wednesday 17th October 2018

మార్కెట్‌ పంచాగకర్తలపై హోవార్డ్‌ మార్క్స్‌ విసుర్లు ఆరునెలల టార్గెట్‌ ఇంత, సంవత్సరం టార్గెట్‌ అంత.. అంటూ మార్కెట్లో అంచనాలు చెప్పడంపై ప్రముఖ మార్కెట్‌ గురు హోవార్డ్‌ మార్క్స్‌ విసుర్లు గుప్పించారు. మార్కెట్‌ చక్రీయ వలయంలో మనమెక్కడున్నామో చెప్పవచ్చుకానీ, రేపేం జరుగుతుందో చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు. మార్కెట్లో ఇలా అంచనాలు చెప్పే వాళ్లు రెండురకాలని, ఒకరకం వ్యక్తులకు ఏమీ తెలీదని, రెండో రకం వ్యక్తులకు తమకేమీ తెలీదన్న సంగతి కూడా తెలీదని చమత్కరించారు. తాజాగా

Most from this category