News


లాంగ్స్‌కు 10628 పాయింట్లే స్టాప్‌లాస్‌!

Saturday 12th January 2019
Markets_main1547300871.png-23554

నిఫ్టీ గతవారం 10870 పాయింట్ల కీలక నిరోధ స్థాయిని దాటలేక వెనుదిరిగింది. దిగువన 10730 పాయింట్ల రేంజ్‌లో మద్దతు పొందిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. తొమ్మిది వారాలుగా నిఫ్టీ అర్ధంపర్ధంలేకుండా అటుఇటు తిరుగుతోందన్నారు. ఒక వారం పైవైపునకు, మరోవారం కిందవైపునకు తిరుగుతూ స్వల్ప రేంజ్‌లోనే కదలాడుతోందని పేర్కొంది. వీక్లీ చార్టుల్లో గతవారం నిఫ్టీ ఇన్‌సైడ్‌బార్‌ పాటర్న్‌ను ఏర్పరిచింది. ఈ వారం కూడా అనిశ్చితి కొనసాగుతుందనేందుకు ఇది నిదర్శనమని తెలిపింది. ర్యాలీ రాగానే అమ్మకాలు, పతనం కాగానే కొనుగోళ్లు జరుగుతున్నాయని వివరించింది. నిఫ్టీ చార్టుల్లో లోయర్‌ టాప్స్‌ , హయ్యర్‌ బాటమ్స్‌ ఏర్పరుస్తూ ఒక సౌష్ఠవాకార త్రిభుజాకృతిని ఏర్పరుస్తోందని తెలిపింది. దీంతో నిఫ్టీ తప్పనిసరిగా బ్రేక్‌డౌన్‌ లేదా బ్రేకవుట్‌ సాధించక తప్పని పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడింది. పైవైపు నిఫ్టీ 10870 పాయింట్ల వద్ద బలమైన నిరోధం ఎదుర్కొంటోందని, దీన్ని దాటితే 11300 పాయింట్ల వరకు పరుగు ఉండొచ్చని అంచనా వేసింది. దిగువన 10700 పాయింట్లను, 10630 పాయింట్లను కోల్పోతే తిరిగి 10300 పాయింట్ల వరకు పతనమయ్యే ఛాన్సులున్నాయని తెలిపింది. ట్రేడర్లు నిఫ్టీ స్థాయిలను కచ్ఛితంగా పాటించాలని సూచించింది. ముఖ్యంగా లాంగ్స్‌కు 10628 పాయింట్లను స్టాప్‌లాస్‌గా ఉంచుకోవాలని సలహా ఇచ్చింది. రంగాల వారీగా ఎంపిక చేసిన స్టాకులను కొనుగోలు చేయవచ్చని సలహా ఇచ్చింది. 



You may be interested

క్యు3 ఫలితాలపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనాలు

Saturday 12th January 2019

మూడో త్రైమాసికంలో వివిధ రంగాల ఫలితాలపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనాలు వెలువరించింది. ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్‌ అప్లయిన్సెస్‌, ఆల్కహాల్‌ అండ్‌ బెవరేజెస్‌, హోటల్స్‌ రంగాలకు చెందిన కంపెనీల ఫలితాలు ఎలా ఉండొచ్చనే విషయాన్ని వివరించింది.  ఎఫ్‌ఎంసీజీ: ఈ రంగంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని బ్రోకరేజ్‌ సంస్థ భావిస్తోంది. ప్రభుత్వం లిక్విడిటీ మెరుగుపరిచే చర్యలు తీసుకోవడం, రైతు రుణమాఫీలు, ట్రేడ్‌ ఛానెల్స్‌ సాధారణ స్థితికి రావడం, ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండడం వంటి పరిస్థితులు కలిసివస్తాయని

నిఫ్టీ బ్రేకవుట్‌కు రెడీ అవుతోందా?

Saturday 12th January 2019

గత కొన్నాళ్లుగా నిఫ్టీ స్వల్ప రేంజ్‌లో ట్రేడవుతోంది. గతేడాది జీవిత కాల గరిష్ఠాన్ని తాకిన అనంతరం మరోమారు పదివేల పాయింట్ల వరకు పతనమైంది. అక్కడ నుంచి మరోమారు పైకి ఎగిసినా పరుగు కొనసాగించలేక, కిందకు రాలేక ఒక రేంజ్‌లోనే కదలాడుతోంది. చార్టులను పరిశీలిస్తే కరెక్టివ్‌ అప్‌మూవ్‌లో భాగంగానే తాజా ర్యాలీ వచ్చింది కానీ కొత్త బుల్‌ ర్యాలీ మాత్రం కాదని తెలుస్తోంది. నియో వేవ్‌ సిద్ధాంతం ప్రకారం చూస్తే గతనెల

Most from this category