STOCKS

News


ఈక్విటీకి దూరంగా ఉండండి!

Monday 24th September 2018
Markets_main1537782319.png-20527

మార్కెట్‌ ప్రస్తుత పరిస్థితుల్లో ఈక్విటీ వాటా పెంచుకోవడం మంచిది కాదంటున్నారు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ సీఐవో ఎస్‌.నరేన్‌. మార్కెట్లు ఇప్పటికీ చౌకగా లేవని తెలిపారు. స్మాల్‌క్యాప్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి ఇంకా సమయముందని, ఇవి ఇంకా ఖరీదుగానే ఉన్నాయని పేర్కొన్నారు. అతి స్వల్పకాలిక డెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలకు ప్రాధాన్యమివ్వొచ్చని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. 
మిడ్‌క్యాప్స్‌, స్మాల్‌క్యాప్స్‌ విషయంలో దీర్ఘకాలంలో పాజిటివ్‌గా ఉన్నామని నరేన్‌ తెలిపారు. వీటిల్లో సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేయడం ఉత్తమమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏకమొత్తపు ఇన్వెస్ట్‌మెంట్లకు ఇది సరైన సమయం కాదని తెలిపారు. స్మాల్‌క్యాప్స్‌ గత ఐదేళ్ల కాలంలో 200 శాతం పెరిగాయని, గరిష్ట స్థాయిల నుంచి 20 శాతం మాత్రమే కరెక‌్షన్‌కు గురయ్యాయని పేర్కొన్నారు. మార్కెట్లు చౌకగా లేనప్పుడు ఎర్నింగ్స్‌ పెరుగుతాయని తెలిపారు. క్రూడ్‌ ధరలు పెరుగుతున్నాయని, డాలర్‌ బలోపేతమౌతోందని, వడ్డీ రేట్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. గత నాలుగైదేళ్లుగా ఎర్నింగ్స్‌ లేవు కాబట్టి ప్రస్తుతం అవి పెరుగుతున్నాయని తెలిపారు. ఎర్నింగ్స్‌ పెరుగుతాయని, అందువల్ల ఓవర్‌వ్యాల్యు స్టాక్స్‌ మినహా మిగతావి ఎక్కువగా పడిపోవని పేర్కొన్నారు. ఎర్నింగ్స్‌ రికవరీ అనేది లార్జ్‌క్యాప్స్‌, బ్యాంకుల విషయంలో సానుకూల అంశమని తెలిపారు.
ఎన్‌బీఎఫ్‌సీల్లో ఓవర్‌వ్యాల్యుయేషన్స్‌ ఉన్నాయని నరేన్‌ పేర్కొన్నారు. అలాగే ఇటీవల కాలంలో వీటి రుణ వ్యయాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. ఇది కంపెనీలకు ప్రతికూల అంశమని పేర్కొన్నారు.  
ప్రజలు డెట్‌ ఇన్వె‍స్ట్‌మెంట్‌ సాధనాలను, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఇకే విధంగా చూస్తున్నారని తెలిపారు. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్ల కన్నా డెట్‌ సాధనాలు మంచి రిటర్న్స్‌ అందిస్తాయని పేర్కొన్నారు. ఎక్స్‌పోర్ట్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌ స్టాక్స్‌పై పాజిటివ్‌గా ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం క్రూడ్‌, డాలర్‌, ద్రవ్య లభ్యత అనేది రిస్క్‌ అంశాలని పేర్కొన్నారు. 



You may be interested

వంద డాలర్లకు క్రూడాయిల్‌?!

Monday 24th September 2018

నిపుణుల అంచనా ఐదేళ్ల విరామం అనంతరం త్వరలో క్రూడాయిల్‌ ధర వంద డాలర్లను తాకే అవకాశం ఉందని అంతర్జాతీయ ట్రేడ్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్‌ ఎగుమతులపై అమెరికా విధించే ఆంక్షల కారణంగా చమురు సరఫరా మందగిస్తుందని, ఇందుకు తగ్గట్లు సరఫరా పెంచడంపై ఒపెక్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలదని వివరిస్తున్నారు. దీంతో త్వరలో డిమాండ్‌ కన్నా సప్లై తగ్గే అవకాశాలున్నాయని, అందువల్ల ధర కొండెక్కి కూర్చుంటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే బ్రెంట్‌ క్రూడ్‌

ఎన్‌బీఎఫ్‌సీ స్టాకుల్లో ఎక్కువ ఎక్స్‌పోజర్‌ ఉన్న ఎంఎఫ్‌లు ఇవే!

Monday 24th September 2018

శుక్రవారం ఉన్నట్లుండి హెచ్‌ఎఫ్‌సీ, ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీల షేర్లు కుప్పకూలడం జరిగింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు చెందిన బాండ్స్‌ను డీఎస్‌పీ ఎంఎఫ్‌ విక్రయించిందన్న వార్తలు మార్కెట్లో విపరీతమైన సెల్లింగ్‌ను సృష్టించాయి. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం బయటపడ్డ సమయంలో ఈ వార్తలు మార్కెట్లో లిక్విడిటీపై మరింత భయాందోళనలు పెంచాయి. ఇవన్నీ కలిసి ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో అమ్మకాల జోరు పెంచాయి. వడ్డీరేట్ల పెంపుదల ఎన్‌బీఎఫ్‌సీల వ్యాపారంపై ప్రభావం చూపుతుందన్న భయాలు, మార్కెట్లో నిధుల సమీకరణ కష్టంగా

Most from this category