STOCKS

News


2-3 ఏళ్లలో రెట్టింపు స్థాయికి రిలయన్స్‌ స్టాక్‌: దేవేన్‌చోక్సే

Tuesday 12th March 2019
Markets_main1552413818.png-24566

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ స్టాక్‌ వచ్చే రెండు మూడేళ్లలో ఈ స్థాయి నుంచి 100 శాతం పెరుగుతుందని కేఆర్‌ చోక్సే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఎండీ దేవేన్‌చోక్సే అంచనా వేస్తున్నారు. మరిన్ని వివరాలను ఆయన ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు. జియో, రిలయన్స్‌ రిటైల్‌ ఎబిట్డా వార్షికంగా 27,000-28,000 కోట్లు ఉంటుందని, వచ్చే మూడు నాలుగేళ్ల కాలంలో వార్షికంగా ఇది 25-30 శాతం వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఇదే జరిగితే జియో, రిటైల్‌ వ్యాపార వ్యాల్యూషన్‌... రిఫైనింగ్‌, పెట్రోకెమికల్‌ వ్యాపారానికి సమాన స్థాయికి చేరుతుందన్నారు. 

 

రిలయన్స్‌ ర్యాలీ కొనసాగుతుందా...?
కన్జ్యూమర్‌ ఆధారిత వ్యాపారం.. రిటైల్‌, జియో, మీడియా వ్యాపారాల నుంచి ఎంతో విలువ సమకూరాల్సి ఉంది. ఇన్‌ఫ్రా ఆస్తుల నగదీకరణ కార్యక్రమం, ముఖ్యంగా జియో నుంచి వచ్చే కొన్ని నెలలో ఆచరణ రూపం దాల్చొచ్చు. దీంతో ఫైబర్‌, టవర్ల వ్యాపారం బ్యాలన్స్‌ షీట్ల నుంచి బయటకు వెళతాయి. నగదు రిలయన్స్‌ పుస్తకాల్లోకి వస్తుంది. అలాగే, రిటైల్‌ వ్యాపారం సప్లయ్‌ చైన్‌ లాజిస్టిక్స్‌ను ఇప్పటికే ఏర్పాటు చేసింది. వాటిని ఈ కామర్స్‌ విభాగంతో అనుసంధానిస్తోంది. ఒకవైపు భౌతిక దుకాణాలు, మరోవైపు డిజిటల్‌ మార్కెట్‌ ప్లేస్‌ ఈ వ్యాపారానికి విలువను తెచ్చిపెడుతుంది. అందుకే వచ్చే రెండు మూడేళ్ల కాలంలో ఈ స్టాక్‌ నూరు శాతం పెరుగుతుందన్న అంచనాతో ఉన్నాం. 

 

చమురు మార్కెటింగ్‌ కంపెనీలు...
చమురు ధరలు పెద్దగా పెరిగే అవకాశాల్లేవు. ఏదైనా రికవరీ వస్తే అది ఉత్పత్తికి కోత వల్లే. చమురు బ్యారెల్‌కు 55-65 డాలర్ల శ్రేణిలో ట్రేడ్‌ కావచ్చు. ఈ నేపథ్యంలో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల (ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌) ఫండమెంటల్స్‌ మారనట్టే. కనుక వీటి కొనుగోళ్లకు ఆసక్తి చూపించొచ్చు. ఈ స్టాక్స్‌ చాలా వరకు పడి ఉండడంతో రికవరీ అచ్చే అవకాశం ఉంది.

 

హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు
ఇల్లు అనేది ఒక ఆస్తి. ప్రజల చేతుల్లో అధికంగా ఖర్చు పెట్టే ఆదాయం పెరగనుంది. అందుకే హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల పట్ల సానుకూలంగా ఉన్నాం. ఈ విభాగంలో రెండు మూడు కంపెనీల పట్ల మేం ఎంతో నమ్మకంతో ఉన్నాం. అవి హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌. ఈ కంపెనీల యాజమాన్యాలు వ్యాపార బలోపేతంపై దృష్టి సారించాయి. కనుక వాటాదారులకు మంచి విలువ సమకూర్చగలవు. ఈ విభాగంలో బలమైన కంపెనీలు ఎక్కువ లాభపడగలవు. 

 

ఫార్మా విభాగం...
బ్రాండెడ్‌ జనరిక్స్‌తో కూడిన దేశీయ కంపెనీల పట్ల సానుకూలం. సన్‌ ఫార్మా, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌ ఈ విభాగంపై దృష్టి సారించాయి. రానున్న కాలంలో ఫార్మా కంపెనీల మార్జిన్లు మెరుగుపడనున్నాయని అంచనా. You may be interested

ఫ్లాట్‌గా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Wednesday 13th March 2019

గత రాత్రి బ్రిటన్‌ ప్రధాని థెరాసా మే ప్రతిపాదించిన బ్రెగ్జిట్‌ డీల్‌..ఆ దేశపు పార్లమెంటు తిరస్కారానికి గురైన నేపథ్యంలోఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్నప్పటికీ, భారత్‌ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 2 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.45 గంటలకు 11,337 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,335 పాయింట్ల వద్ద

స్మాల్‌ క్యాప్‌ ర్యాలీ కొనసాగేనా?!

Tuesday 12th March 2019

స్మా్‌ల్‌, మిడ్‌క్యాప్‌ కంపెనీల నాన్‌స్టాప్‌ ప్రతికూల పనితీరు ఇక ముగిసినట్టేనా...? సూచీల పనితీరు, స్టాక్స్‌ ర్యాలీని గమనిస్తే విశ్లేషకులు, బ్రోకరేజీ సంస్థలు ఇదే అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా స్మాల్‌క్యాప్‌ ఇన్వెస్టర్‌ అనిల్‌కుమార్‌ గోయల్‌ పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్‌ నెల రోజుల్లోనే అంటే ఫిబ్రవరి 18 నుంచి 46 శాతం పెరగడం గమనార్హం. బాగా పడి ఉండడం, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి తాజా నిధుల రాకతో ప్రధాన సూచీల ర్యాలీకి మద్దతుగా మిడ్‌, స్మాల్‌క్యాప్‌

Most from this category