STOCKS

News


రిలయన్స్‌ 3 శాతం అప్‌

Friday 16th November 2018
Markets_main1542349396.png-22092

గత కొద్దిరోజులుగా స్తబ్ధుగా సాగుతున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. నేడు బీఎస్‌ఈలో రిలయన్స్‌ షేరు రూ.1096.10ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  ట్రేడింగ్‌ ప్రారంభంమైన కొద్దిసేపటికే 3శాతం లాభపడి రూ.1128.50ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:20ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.1096.9)తో పోలిస్తే 1.80శాతం లాభంతో రూ.1117.50ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. స్టాక్‌ మార్కెట్లో అత్యధిక వెయిటేజ్‌ కలిగిన రిలయన్స్‌ 3శాతం ర్యాలీ కారణంగా   నేడు సెన్సెక్స్‌ ఆర్జించిన మొత్తం 286 పాయింట్లలో రిలయన్స్‌ వాటా 80పాయింట్ల కాగా, నిఫ్టీ ఆర్జించిన మొత్తం 78 పాయింట్లలో 21పాయింట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కావడం విశేషం. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.861.70 రూ.1328.75లుగా నమోదయ్యాయి.



You may be interested

విదేశీ నిధులు రావడం కష్టమే..!

Friday 16th November 2018

మార్కెట్లను ఆదుకుంటోన్న దేశీ నిధులు ముంబై: ప్రస్తుతం దేశీ సూచీలను ఆదుకుంటోంది భారతీయుల నిధుల ప్రవాహమే అని వ్యాఖ్యానించిన సీఎల్‌ఎస్‌ఏ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌, ఇండియా స్ట్రాటజిస్ట్ మహేష్ నందూర్కర్.. ఇక్కడివారి నిధులు మాత్రమే మార్కెట్లను ఇంకొంతకాలం నిలబెట్టగలవని విశ్లేషించారు. కేవలం వీరి నిధుల కారణంగానే అధిక విలువలో ఉన్నప్పటికీ.. అభివృద్ధి చెందుతున్న దేశాల సూచీలను అవుట్‌పెర్ఫార్మ్‌ చేయగలుగుతున్నాయని ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విదేశీ

యస్‌ బ్యాంక్ సెర్చి కమిటీ నుంచి భట్ రాజీనామా

Friday 16th November 2018

ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యస్ బ్యాంక్ కొత్త సీఈవో ఎంపిక కోసం ఏర్పాటైన సెర్చి కమిటీ నుంచి ఎస్‌బీఐ మాజీ చైర్మన్‌ ఓపీ భట్ తప్పుకున్నారు. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కి రుణాల వివాదానికి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో సెర్చి కమిటీలో తన పాత్ర వివాదాస్పదం కావొచ్చనే ఉద్దేశంతో ఆయన వైదొలిగినట్లు యస్‌ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. సంస్థ సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈవో రాణా కపూర్ స్థానంలో

Most from this category