STOCKS

News


మార్కెట్‌కు నచ్చని రిలయన్స్‌ త్రైమాసిక ఫలితాలు

Monday 22nd April 2019
Markets_main1555919805.png-25268

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించిన నాలుగో త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించలేకపోవడంతో ఈ కంపెనీ షేరు సోమవారం 3శాతం నష్టపోయింది. నేడు బీఎస్‌ఈలో 1.50శాతం నష్టంతో రూ.1364.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మార్కెట్‌ ఆరంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ షేరులో లాభాల స్వీకరణకు పూనుకున్నారు. షేరు 3శాతం నష్టపోయి రూ.1345.30ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. అధిక వెయిటేజీ కలిగిన ఈ షేరు 3శాతం పతనం సూచీలకు భారీ నష్టాన్ని కలిగింది. నిఫ్టీ కోల్పోయిన 100 పాయింట్లలో ఒక్క రిలయన్స్‌ షేరువే 25 పాయింట్లు కాగా, సెన్సెక్స్‌ కోల్పోయిన 250 పాయింట్లలో 100 పాయింట్లు రిలయన్స్‌ షేరువి కావడం గమనార్హం. మధ్యాహ్నం గం 1:00లకు షేరు గత ముగింపు ధర(రూ.1382.9)తో పోలిస్తే 2.50శాతం నష్టంతో రూ.1350.70ల వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.907.10, రూ.1406.50లుగా నమోదయ్యాయి.



You may be interested

15నెలల గరిష్ఠాలకు వీఐఎక్స్‌ సూచీ

Monday 22nd April 2019

మార్కెట్‌లో రిస్కుకు ప్రతిబింబంగా భావించే వీఐఎక్స్‌ సూచీ తాజాగా 15నెలల గరిష్ఠాలకు చేరింది. ఎన్నికల ఫలితాల సమయం దగ్గర పడడం, మార్కెట్లు గరిష్ఠస్థాయిల్లో కదలాడడంతో ఇన్వెస్టర్లు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వీఐఎక్స్‌ పైపైకి పెరుగుతోంది. వీఐఎక్స్‌ పెరగడమంటే సాధారణంగా మార్కెట్లు త‍్వరలో కరెక‌్షన్‌ మూడ్‌లోకి వెళతాయనేందుకు సూచనగా భావిస్తారు. పుట్స్‌ ఎక్కువ కావడం, షార్ట్‌ బిల్డప్‌ జరగడం వంటివి వీఐఎక్స్‌ పెరిగే సమయంలో జరుగుతుంటాయి. లాంగ్స్‌కు హెడ్జింగ్‌ కోసం

ఏడాది కోసం పెట్టుబడులకు...

Monday 22nd April 2019

ఎస్‌బీఐ మ్యాగ్నం లో డ్యురేషన్‌ ఫండ్‌   అంచనాలకు అనుగుణంగా ఈ నెల ఆరంభంలో ఆర్‌బీఐ మరోసారి కీలక రేటును పావు శాతం తగ్గించింది. దీంతో రెపో రేటు 6 శాతానికి దిగివచ్చింది. ఆర్‌బీఐ తన విధానాన్ని తటస్థం వద్దే కొనసాగించింది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్ల పరంగా రిస్క్‌ తీసుకోలేని వారు, సంప్రదాయ ఇన్వెస్టర్లు కొద్ది కాలం కోసం ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు ఎస్‌బీఐ మ్యాగ్నం లో డ్యురేషన్‌ ఫండ్‌ను

Most from this category