STOCKS

News


రూ.1400 దాటిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

Monday 1st April 2019
Markets_main1554111801.png-24906

దేశీయ ప్రైవేట్‌ దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు సోమవారం మరో కొత్త గరిష్టస్థాయిని నమోదు చేయడంతో పాటు రూ. 1,400 స్థాయిని దాటాయి. నేడు బీఎస్‌ఈలో రూ.1368.55ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ షేరు నేటి ఇంట్రాడే ట్రేడింగ్‌లో 2.8శాతం లాభపడి రూ.1406.80 రికార్డుస్థాయిని తాకింది. ఇది ఈ షేరుకు జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. మధ్యాహ్నం 2 గంటలకు షేరు గత ముగింపు(రూ.1363.05)తో పోలిస్తే 2.50శాతం లాభంతో రూ.1395.60ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట స్థాయిలు వరుసగా రూ.886.10  రూ.1406.80 లుగా నమోదయ్యాయి.
ఇక మార్కెట్‌ విషయానికొస్తే... ఇదే సమయానికి నిఫ్టీ 84 పాయిట్లు లాభంతో 11708 వద్ద ట్రేడ్‌ అవుతుండగా, సెన్సెక్స్‌ 336 పాయింట్లు లాభపడి 39,009 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మెటల్‌, అటో, ఐటీ, ప్రభుత్వరంగ షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి.



You may be interested

ఎల్‌అండ్‌టీ ఇచ్చిన ఓపెన్‌ ఆఫర్‌ ధర ఓకేనా?!

Monday 1st April 2019

మైండ్‌ట్రీలో మెజార్టీ వాటా సొంతం చేసుకునేందుకు ఎల్‌అండ్‌టీ సంస్థ ఓపెన్‌ఆఫర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఒక్కో షేరుకు రూ. 980 చొప్పున ఎల్‌అండ్‌టీ ఆఫర్‌ చేయనుంది. అయితే కొంతమంది రిటైల్‌ ఇన్వెస్టర్లు, కొందరు సంస్థాగత ఇన్వెస్టర్లు మాత్రం ఈ రేటుపై పెదవి విరుస్తున్నారు. ఎల్‌అండ్‌టీ తన ఆఫర్‌ను మరింత పెంచాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో షేరు ఒక్కింటికి రూ. 980 అంటే సరసమైన ధరేనని ఎక్కువమంది అనలిస్టులు

మెటల్‌ షేర్ల మెరుపులు

Monday 1st April 2019

రికార్డు ర్యాలీ కొనసాగిస్తున్న మార్కె్‌ట్‌లో మెటల్‌ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు పెరగడం ఇందుకు కారణమవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 3.33శాతం లాభపడింది. చైనా ఆదివారం ఈ దేశపు పీఎంఐ గణాంకాలను విడుదల చేసింది. ఫిబ్రవరి 49.9గా నమోదైన ఇండెక్స్‌ మార్చిలో 50.8 ఎగిసింది. ప్రపంచంలోనే అతిపెద్ద మెటల్‌ వినియోగదారు దేశమైన చైనా పీఎంఐ గణాంకాలు మార్కెట్‌

Most from this category