STOCKS

News


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కొత్త రికార్డు

Thursday 25th April 2019
Markets_main1556172067.png-25344

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) షేర్లు గురువారం కొత్త జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. నేడు బీఎస్‌ఈలో షేరు రూ.1392.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఒకానొక దశలో 1.50శాతం ర్యాలీ చేసి రూ.రూ.1411.50ల వద్ద స్థాయికి చేరుకున్నాయి. ఈ ధర షేర్ల కొత్త జీవితకాల గరిష్ట ధర కావడం విశేషం. ఉదయం 11:20ని.లకు షేరు బీఎస్‌ఈలో గత ముగింపు ధర(రూ.1390)తో పోలిస్తే 1.15శాతం లాభపడి రూ.1406.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 907.10 రూ.1408.25లుగా నమోదయ్యాయి. 
ఇక ఇదే సమయానికి మార్కెట్‌ విషయానికొస్తే...
ట్రేడింగ్‌ ప్రారంభంలో కొంత ఒడిదుడుకులకు లోనైన సూచీలు ప్రస్తుతం స్థిరమైన లాభాలతో ర్యాలీ చేస్తున్నాయి. బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 202 పాయిం‍ట్ల లాభంతో 39256.99 వద్ద, నిఫ్టీ 69.75 పాయింట్లు పెరిగి 11795.90ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఐటీ, మెటల్‌, మీడియా షేర్లలో స్వల్పంగా అమ్మకాలు జరుగుతున్నప్పటికీ.., మిగతా అన్ని రంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్లు జరుగుతున్నాయి.



You may be interested

అదరగొడుతున్న అల్ట్రాటెక్‌ సిమెంట్‌

Thursday 25th April 2019

మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదుకావడంతో పాటు బ్రోకరేజ్‌ సంస్థ రేటింగ్‌ పెంపుతో గురువారం ఆల్ట్రాటెక్‌ షేర్లు అదరగొడుతున్నాయి. క్రితం రోజు కంపెనీ గతేడాది నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.  స్టాండర్డ్‌లోన్‌ ప్రాతిపదికన రూ.1,017 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నికరలాభం రూ.446.14 కోట్లే కావడం గమనార్హం. మొత్తం అమ్మకాల ఆదాయం 18శాతం పెరిగి రూ.10,334 కోట్లను ఆర్జించింది. అంతకుముందు

డాలర్‌ ఎఫెక్ట్‌ - స్వల్పంగా తగ్గిన పసిడి

Thursday 25th April 2019

డాలర్‌ ఇండెక్స్‌ రెండేళ్ల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్న నేపథ్యంలో పసిడి ధర గురువారం తగ్గుముఖం పట్టింది. ఆసియా ట్రేడింగ్‌లో గురువారం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2.50డాలర్లు నష్టపోయి 1,277.25డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే, ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌, జర్మనీ విడుదల చేసిన బలహీన ఆర్థిక గణాంకాలు పసిడి ధర మరింత నష్టపోకుండా అడ్డుకట్ట వేస్తున్నాయి. అమెరికారిలో గృహ కొనుగోళ్ల గణాంకాలు ఆశించినస్థాయిలో నమోదుకావడం

Most from this category